గురువుబాటలో నడిస్తేనే గురి

జీవితంలో ఏ విషయం గురించైనా అతిగా తాపత్రయపడితే మిగిలేవి ఆవేదన, ఆందోళనలే. ఈ లోకంలో అందరికీ వారి వారి స్థాయిని బట్టి జీవించడానికి భగవంతుడు అవకాశాలను ఇచ్చాడు. అవసరాలకు సరిపడా డబ్బున్నా ఇంకా లేనిపోని కీర్తి ప్రతిష్టలు, హోదా, గుర్తింపు కోసమంటూ మనిషి తాపత్రయపడుతూనే ఉన్నాడు. ఈ కోరికలను తీర్చుకునే క్రమంలో జీవితాలు అశాంతిమయం అవుతున్నాయి. ‘ప్రాపంచిక గౌరవాలను అందుకోవాలనే తాపత్రయాలను వీడండి. కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడకండి. దైవం

పని.. ప్రయత్నం.. ఫలిత

ఒక చిన్న కుర్రాడు ఒకరోజు దిగులు ముఖంలో ఇంటికి చేరతాడు తల్లి- ‘ఎందుకురా? అలా ఉన్నావు?’ అని అడుగుతుంది. ‘మా స్కూల్లో నాటకం వేస్తున్నారు. నా మిత్రులందరికీ రాజు, మంత్రి, సేనాధిపతి వంటి మంచి వేషాలు ఇచ్చారు. నాకు మటుకు భటుడి వేషం ఇచ్చారు. నాకు ఏడుపొస్తోంది అమ్మా’ అన్నాడు పిల్లాడు బేలగా. ‘పిచ్చికన్నా ఆ నాటకంలో రాజు పాత్ర ఎంత ముఖ్యమో భటుడి పాత్ర కూడా అంతే ముఖ్యం. నాటకం

జ్ఞాని-భగవత్‍స్వరూపం

భగవంతుడి గురించి తెలుసుకోవడం అంత తేలిక కాదు. అందుకు ఎంతో సాధన చేయాలి. పవిత్రమైన దివ్య భావాల మధుమందారాలతో ఆయనను ఆరాధించాలి. భగవంతుడు లేదా సద్గురువు కృప వల్లనే ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞాని మనుషులందరినీ సమదృష్టితో చూస్తాడు. అందరినీ దైవ స్వరూపంగా ఎంచి ప్రేమిస్తాడు. అటువంటి జ్ఞానులు ప్రాతఃస్మరణీయులు. వారి పట్ల సదా భక్తిప్రపత్తులు ప్రదర్శించాలి. వారు చేసే బోధనలు, ఉప దేశాలు ఆత్మవికాసానికి దోహదం చేస్తాయి. నిజమైన

భారతీయత

సమాజ శ్రేయస్సు భారత ధర్మం (వేద ధర్మం)తోనే ముడిపడి ఉంది. వేద పురాణ, ఇతిహాసాల కాలాల నుంచి లక్షల సంవత్సరాలుగా మన రుషులు మనకు ఇచ్చిన ఆర్ష ధర్మం భారతదేశంలో కొనసాగుతూనే ఉంది. భారతీయ ధర్మాన్ని సూర్యపుత్రుడైన మనువు రచించాడు. భారతీయ ధర్మాలలో పది ప్రధాన ధర్మాలు, మరో పది ఉప ధర్మాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి ప్రధాన ధర్మం- శౌచం. సకాలంలో విధి నిర్వహణ (తపస్సు) రెండవది. ఇంకా,

సమస్యలు – ధైర్యం – పరిష్కారం

ఒక రాజ్యంలో ప్లేగు వ్యాధి విజృంభించి అపార జన నష్టం సంభవిస్తుంది. దాంతో రాజ్యాధినేత తీవ్ర ఆందోళనకు గురవుతాడు. రాజ గురువు సలహా మేరకు శివ యజ్ఞాన్ని ఆచరిస్తాడు. ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ రాజు చేస్తున్న క్రతువుకు శివుడు సంతుష్టుడై ప్రత్యక్షం అవుతాడు. ఆ రాజును నీ అభీష్టం ఏమిటని అడుగుతాడు. మహారాజు ఎంతో ఆర్తితో ‘భగవాన్‍! మా రాజ్యంలో ప్లేగు వ్యాధి వ్యాపించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాధి

Top