ఐదు రోజుల ఆనందం

దీపావళి పండుగ మన ఆచార, సంప్రదాయాల్లో విశేషమైనది. కృతయుగం ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు దీపావళి. త్రేతాయుగం ప్రకారం శ్రీరాముడు సీతతో కలిసి అయోధ్యకు ప్రయాణం చేసిన రోజు దీపావళి. ద్వాపరయుగం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వచ్చిన రోజు దీపావళి. దీపావళి అయిదు రోజుల పర్వం ఆశ్వయుజ మాసం బహుళ పక్ష త్రయోదశి నుంచి కార్తీక మాసం శుక్ల పక్ష ద్వితీయ వరకు గల ఈ ఐదు రోజులూ ఇంటి

శుభ ముహూర్తం

శ (పది) విధాలైన పాపాలను హరించేది ‘దశహరా’. అదే కాల క్రమంలో దసరా అయింది. దుష్ట సంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే దసరా ఉత్సవాల్లోని పరమార్థం. ప్రకృతిపరంగా పరిశీలిస్తే.. శరదృతువు ప్రసన్నతకు, ప్రశాంతతకు నిలయం. అప్పటి దాకా వర్షాలతో చిత్తడిగా మారిన నేలలన్నీ ఈ రుతువు ప్రారంభంలో వర్షాలు ఆగిపోవడం వల్ల ఎండిపోయి నిర్మలం అవుతాయి. జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తాయి. శరత్కాలంలో వెన్నెల పిండారబోసినట్టు ఉంటుంది. చంద్రుడి కళలు ఉత్క•ష్ట స్థాయికి చేరతాయి.

కృష్ణుడి అల్లరి.. గణపతి ఆకలి

అప్పుడప్పుడే అడుగులు వేయడం మొదలుపెట్టిన బుల్లి కృష్ణుడు.. నడుస్తూ నడుస్తూ దబ్బున పడతాడు. శరీరమంతా దుమ్ము కొట్టుకుపోయి విబూది పూతలా మారింది. ఉంగరాల జుత్తును పైకి దువ్వి, ముత్యాలహారంతో వేసిన ముడి చంద్రవంకలా ఉందట. నుదుట నిలువుగా పెట్టిన ఎర్రటి తిలకం ఫాలనేత్రంతా, రత్నాలహారంలో నాయకమణిలా ఉన్న నీలమణి శివుడి కంఠాన ఉన్న నల్లటి మచ్చలా, మెడలోని ముత్యాలహారాలు సర్పహారాల్లా అనిపించి.. బాలకృష్ణుడు అచ్చు శివుడే అనిపించాడట!. ఒకసారి పాలు తాగడానికి

చక్కని బుద్ధి.. లక్ష్మీసిద్ధి!

సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతోనే కలుగుతాయి. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తారు. శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా పాటిస్తారు. కుటుంబసభ్యుల సంక్షేమం కోసం గృహిణులు, మహిళలు ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. అష్టలక్ష్మీ ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మీ వ్రతం కూడా అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. జగన్మాత పార్వతి ఒకనాడు సకల సౌభాగ్యాలనిచ్చే వ్రతం ఏదైనా ఉందా? అని

ఓం గురుభ్యోనమ:

గురువు అంటే..గౌరవమైనది, గొప్పది అని అర్థం. గురువు అనే శబ్దం మనలోని అజ్ఞానాన్ని నశింపచేస్తుంది. మనలో ఏళ్ల తరబడి పిడచకట్టుకొనిపోయిన అజ్ఞాన తిమిరాంధకారాన్ని తొలగించి, జ్ఞానజ్యోతిని వెలిగించే మహత్తర శక్తి గురువు. భారతదేశం యుగయుగాలుగా గురువును గొప్ప దృష్టితో చూస్తోంది. ధర్మదండాన్ని గురువు చేతికిచ్చి దేశ ధర్మాన్ని నడిపించాలని కోరిన ఘటన భారతీయులది. గురువులు కూడా పలు రకాలు. ఆధ్యాత్మిక తత్త్వాన్ని ఆవపోసన పట్టిన గురువులు కొందరు.. రాజనీతి సామాజిక బాధ్యతను తమ

Top