ఉత్తరాయణం

సాయిబాబా గురించి ఇవ్వండి.. ‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రికలో షిర్డీ సాయిబాబాకు సంబంధించి కూడా ఏదైనా ఒకటి రెండు శీర్షికలు ప్రవేశపెట్టాలని మా విన్నపం. బాబా సూక్తి ఒకటి ఇస్తున్నారు కానీ ఏదైనా ప్రత్యేక శీర్షిక కూడా ఉంటే బాగుంటుందని అనిపిస్తోంది. ఎందుకంటే బాబాకు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్దసంఖ్యలో భక్తులు ఉన్నారు. కాబట్టి అందరి కోసం సాయిబాబాకు సంబంధించి ఒక శీర్షిక (ఏదైనా) ప్రవేశపెట్టగలరని కోరిక.

ఉత్తరాయణం

విలువలతో బతకడమే ఆధ్యాత్మికత.. విలువలతో బతకడమే ఆధ్యాత్మికత.. ‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక ఆధునిక ఆధ్యాత్మికతకు చిరునామాగా నిలుస్తోంది. ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకోవడమే అభివృద్ధి, నాగరికత కాదు. మనిషిగా మనం నాణ్యతగా జీవించే తీరు, మనం కనబరిచే విలువలే ఆ దేశపు ఔన్నత్యాన్ని పెంపొందించే సాధనాలు. ఇవి అల వడాలంటే, బతుకుల్లో నాణ్యత పెరగాలంటే ప్రతి మనిషి ఆధ్యాత్మికతను అలవరుచుకోవాలి. మానసిక వికాసానికి, శారీరక దృఢత్వానికి ఆధ్యాత్మికత దోహదపడుతుంది. తెలుగు పత్రికలో వివిధ ఆధ్యాత్మిక

ఉత్తరాయణం

వంటల రుచులు బాగున్నాయ్‍.. ‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రికలో ‘సూపర్‍డిష్‍’ శీర్షిక కింద అందిస్తున్న కొత్త వంటకాల పరిచయం బాగుంటోంది. ఇంట్లోనే తేలికగా చేసుకోగల వంటకాల గురించి బాగా వివరిస్తున్నారు. అలాగే, ఆధ్యాత్మిక విశేషాలు, తెలుగు భాష - సంస్క•తి, సంప్రదాయాలు, ఆచారాల గురించి అందిస్తున్న వివరాలు బాగుంటున్నాయి. కార్టూన్లు, పరిమితిలోనే ఉంటూ సరదాగా నవ్వించే జోకులు వంటివి కూడా వీలును బట్టి ప్రచురించండి. -రాగవర్షిణి, హైదరాబాద్‍, రాజ్‍.పి.కుమార్‍, ఆన్‍లైన్‍ పాఠకుడు,

ఉత్తరాయణం

మన సంప్రదాయాల ప్రతిబింబం ‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రికను ఇటీవల అనుకోకుండా ఆన్‍లైన్‍లో చూడటం జరిగింది. ఏముందో అని రెండు మూడు పేజీలు స్క్రోల్‍ చేశా.. ఇక ఆ తరువాత ఆగలేదు. మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదివా. ఫీచర్లు చాలా బాగున్నాయి. పిల్లలు, పెద్దలకు మాత్రమే అని కాకుండా అందరికీ పనికి వచ్చే, ఉపకరించే శీర్షికలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా మన భారతీయ సంస్క•తీ సంప్రదాయాలకు, అందునా

ఉత్తరాయణం

అన్నీ ప్రత్యేకమే.. ‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక చదివించే శీర్షికలతో అలరిస్తోంది. అయితే, మాదొక విన్నపం.. భక్తుల ఆధ్యాత్మిక యాత్రా విశేషాలకు తెలుగు పత్రికలో చోటివ్వండి. చాలామంది పుణ్య క్షేత్రాలకు వెళ్లాలని ఉన్నా వివిధ కారణాల వల్ల వెళ్లలేరు. అటువంటి వారికి ఇతరుల ఆధ్యాత్మిక యాత్రలు, విశేషాలు, వారికి ఎదురైన అనుభవాలు కొంత లోటును తీరుస్తాయి. కాబట్టి భక్తుల నుంచి ఆధ్యాత్మిక యాత్రా విశేషాలను సేకరించి ప్రచురించగలరు. - కె.వెంకటేశ్వరరావు- హైదరాబాద్‍,

Top