మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే ఏం తింటున్నాం? ఎలా తింటున్నాం ? అనేది చాలా ముఖ్యం. మనం నిత్యం తీసుకునే ఆహారం ఎలా ఉండాలి? ఏది మంచి ఆహారం? ఏది ఆరోగ్యానికి చేటు తెచ్చే ఆహారమో తెలుసుకుందాం.
మంచి ఆహారం
– కూరగాయలు, ఆకుకూరలు
– పీచు పదార్థాలు అధికంగా ఉండే చిక్కుడు, బీర, మునగ తదితరాలు
– ఫైబర్ రిచ్ ఆహారం. అంటే గోధుమలు, గోధుమ పిండి, రవ్వ, గోధుమ బియ్యం
– ఒమెగా – 3 బాగా ఉండే అవిసెలు
– జొన్న, రాగి, ఓట్స్, పాలు, గుడ్లు, డైఫ్రూట్స్, మల్లీగ్రెయిన్ పిండి
– జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, సజ్జగంజి, రాగి సంకటి, రాగి జావ
– గుండెకు మంచి చేసే కుసుమ నూనె, పొద్దుతిరుగుడు నూనె
– సిట్రిక్ జ్యూస్‍లు బాగా తీసుకోవాలి. ఇది బత్తాయి, నారింజ, నిమ్మకాయలు, పండ్లలో బాగా దొరుకుతుంది.
– రోజూ 2 -3 లీటర్లు పీహెచ్ లెవెల్ కలిగిన నీళ్లు, కొబ్బరి నీళ్లు తాగాలి.
– తోటకూర, పాలకూర, చుక్కకూర, బచ్చలాకు వంటివి ఎలా పూర్తి స్థాయిలో తీసుకుంటామో కొత్తిమీర, కరివేపాకు, మెంతికూర పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి.
చెడు ఆహారం
ప్రాసెస్డ్ ఫుడ్, ఓవెన్ ఫుడ్, కెమికల్లీ ఆల్టర్డ్ ఫుడ్, షుగర్స్, స్పయిసీ ఫుడ్, మసాలాలు దట్టించిన ఆహారం, ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, రెడ్ మీట్. ఇలాంటి ఆహారం వల్ల దీర్ఘకాలిక రోగాలు చుట్టుముడతాయి.
మంచి ఆహారానికి యోగా తోడు
మనం రోజూ తీసుకునే ఆహారం సమతులంగా ఉండాలి. అప్పుడే వ్యాధులను ఎదుర్కొనే శక్తిని శరీరం సంతరించుకుంటుంది. ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, పండ్లు, దుంపలు, పాల ఉత్పత్తులలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు కాసింత శారీరక వ్యాయామం చేస్తూ యోగా వంటివి ఆచరిస్తే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యోగా కేవలం మానసిక ఉల్లాసానికే అనే అభిప్రాయం ఉంది. అయితే ఇది తప్పు. ప్రతి రోజూ మంచి ఆహారం తీసుకోవడంతో పాటు యోగా చేయడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. యోగాలో వివిధ ఆసనాలన్నీ మనలో రోగనిరోధక శక్తిని పెంచేవే. ఇవన్నీ బాడీలో ఎనర్జీ లెవల్స్ను పెంచుతాయి. ఉద్విగ్నత, ఒత్తిడి వంటి వాటిని తగ్గించుకోవడానికి యోగా ఒక అనువైన, సులువైన మార్గం.
నిత్యం సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల పాజిటివిటీ పెరుగుతుంది. మనసు కూడా ఎంతో ప్రశాంతంగా, రిలాక్స్డ్‍గా ఉంటుంది.
రోజూ తగినంతసేపు నిద్రపోకపోవడం, పోషకాహారం తగినంతగా తీసుకోకపోవడం, ఒత్తిడి.. వీటి వల్లే సాధారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే వివిధ ఇన్ఫెక్షన్లకు తొందరగా శరీరం లొంగిపోతుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను యోగా దూరం చేస్తుంది. అలాగే, మనం తీసుకునే ఆహారం కూడా మన నడవడి, మన మనస్తత్త్వాలను నిర్దేశిస్తుంది. అందుకు సమతుల ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం. దీనికి కాసింత యోగాను జోడిస్తే ఆరోగ్యం అందరి సొంతమవుతుంది. మంచి ఆహారం ఆరోగ్యాన్ని కలిగిస్తే.. యోగా శరీరంలోని మలినాలను తొలగించి మనసును, శరీరాన్ని స్వచ్ఛం చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? మంచి ఆహారానికి యోగాను జోడించండి.
Review ఏం తింటున్నారు?.