జీవనవేదం ఆయుర్వేదం

వేదాల గురించి మనకు తెలుసు. అవి- రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం.. ఒకవేళ వీటి గురించి మనకు అంతగా తెలియకపోయినా పెద్దగా కలిగే నష్టమేమీ లేదు. కాబట్టి ఈ నాలుగు వేదాల సంగతి పక్కన పెట్టండి. ఇక, ఐదవదైన పంచమ వేదం (మహా భారతం) ఉంది కదా! దాన్ని కూడా కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ‘ఆయుర్వేదం’ గురించి! దీన్ని కూడా పక్కన పెట్టేస్తామంటారా? మిగతా ఐదు వేదాల గురించి తెలియకున్నా, తెలుసుకోకపోయినా పర్వాలేదు. కానీ ఆయుర్‍‘వేదం’ గురించి మాత్రం తెలుసుకుని తీరాలి. కానీ, ప్రస్తుతం మనం మరీ అంటరాని శాస్త్రంగా ఆయుర్వేదాన్ని పక్కన పెట్టేశాం. దీని బూజు దులిపి బయటకు తీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయుర్వేదం.. మనకు ఆరోగ్యాన్నిచ్చే ఔషధం మాత్రమే కాదు.. మన బతుకుబండిని నడిపించే జీవన వేదం కూడా!
చంటాడు ఆడుకుంటూ చేయి తెగ్గోసు కున్నాడు. అమ్మ మనసు తల్లడిల్లిపోయింది. వెంటనే వంటగదిలోకి వెళ్లి గబగబా గాయం చుట్టూ పసుపు పూసింది. ఆ తరువాత టీ పొడి అద్దింది. ఇలా చేయాలని ఆమెకు చిన్నప్పు డెప్పుడో ఆమె అమ్మ చెప్పింది. ఆమె ఆమ్మకు వాళ్ల అమ్మ చెప్పింది. అంటే ఏదైనా గాయమైతే అలా చేయాలనే విషయం తరతరాలుగా అలా అనువంశికంగా వస్తోంది. అయితే, వీరిలో ఎవరూ వైద్య శాస్త్రం చదవలేదు. వాటికి సంబం ధించిన పుస్తకాలు చదవలేదు. గాయాలైతే ఇలా చేయాలని ఏ డాక్టరూ వారికి సలహానివ్వలేదు. కానీ వాళ్లకు ఎలా తెలిసింది? అంటే భారతీయ తత్వంలోనే ఇంటి వైద్యం అనేది వారసత్వంగా వస్తోందన్న మాట. ఆ వారసత్వ ఇంటి వైద్యానికి ఆద్యం- ఆయుర్వేదం. ఇది నూటికి నూరు పాళ్లు భారతీయ తత్వం నుంచి పుట్టుకొచ్చిన వైద్యం. ఇది జనం హృదయపు పొరల్లో నిక్షిప్తమై ఉన్న ప్రాచీన వైద్యనిధి. దురదృష్టవశాత్తూ ఆ నిధిని మనం మనసు అట్టడుగు పొరల్లో కప్పిపెట్టి ఉంచేశాం.
ప్రజాప్రయో‘జన’ వేదం..
ఆయుర్వేదం గొప్పదనం గురించి ఏం చెప్పాలి? అసలు చెప్పడానికి అక్షరాలు సరి పోతాయా? కానీ, కొంత ప్రయత్నం చేద్దాం. భారతీయ నేలపై పుట్టిన ఈ అపురూప ఆయు ర్వేద శాస్త్రం గురించి కొంతైనా తెలుసుకుందాం. ఇక, విషయంలోకి వెళ్లిపోతే..
అసలు మనం తినడం కోసం బతుకు తున్నామా?లేక బతకడం కోసం తింటున్నామా?
బతకడం కోసమే మనం తింటున్నామనే విషయాన్ని గ్రహించగలిగితే మనిషిని బతి కిస్తున్న అన్నానికే మనం ముఖ్యపాత్రను కల్పించగలుగుతాం. మనల్ని బతికించే అన్నం ఏది? ఆయుష్షు తీసే అన్నం ఏది? ఆహారం అంటే కేవలం నాలుకకు, దాని రుచికి సంబం ధించిన అంశంగా మారిపోయింది. మనం తినేది కడుపులోకి వెళ్లాక ఏం జరుగుతుంది? మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం? అది లోపలికి వెళ్లాక ఎటువంటి అపకారం చేస్తుంది? అనే స్ప•హ ఈనాడు దాదాపు ఎవరికీ లేదు. కానీ, మనం తినే ఆహారం ఎటువంటిది? ఎటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి? ఏది హితవు చేస్తుంది. ఏది చెరుపుతుంది? అనే అంశాలను వేల ఏళ్ల క్రితమే చెప్పిన అద్భుత శాస్త్రం ఆయుర్వేదం. అందుకే ఇది ప్రజా శాస్త్రం. అతి సామాన్య మానవుడి ఆరోగ్య భాగ్యమే ధ్యేయంగా రూపొందిన శాస్త్రం. అట్టడుగు మనిషి కూడా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని పరితపించే శాస్త్రం. ‘సర్వేసంతు నిరామయాః’ (అందరికీ ఆరోగ్యం) అనేది ఆయుర్వేద శాస్త్ర నినాదం.
మన ఆహార విధానం భేష్‍
ఒక అంచనా ప్రకారం శ్రీనాథుడి కాలం వరకు కూడా మన భారతీయుల ఆహారపు అలవాట్లు, ఆహార విహారాలు చాలా పొందికగా, ఆరోగ్యయుక్తంగా ఉండేవట. ఆయన తరువాత ఈ ఐదారు వందల ఏళ్లలో ఎందరో రాజులు, విదేశీయులు మనల్ని పాలించారు. వారి ఆహారపు అలవాట్లు, జీవనశైలుల ద్వారా మనల్ని చాలా ప్రభావితం చేశారు. దాదాపు ఆ ప్రభావానికి మనం పూర్తిగా బానిసలమైపోయాం కూడా! అయినా, మౌలిక స్వరూపం చెడకుండానే మన ఆహార విధానం ఇప్పటికీ సజీవంగానే మిగిలి ఉందనేది సత్యం. ఆయుర్వేదానికి తిరిగి మునుపటి ప్రాచుర్యం కల్పిస్తే మన ఆహార విధానం మరింతగా ఆరోగ్యప్రదమవుతుంది.
చదివితే ఇంద్రలోకం.. ఆచరిస్తే దైవమే..
ఆయుర్వేదానికి సంబంధించిన ఒక నానుడి ప్రచారంలో ఉంది. అది- ‘ఆయుర్వేదం చదివిన వారికి ఇంద్రలోకం లభిస్తుంది’. కేవలం చదివితేనే ఇంద్రలోకం లభిస్తుందంటే, ఆయుర్వేద వైద్య విధానాన్ని ఆచరిస్తే, ఏకంగా దేవతలుగా మారిపోతామనేది ఆధునిక లోకోక్తి. పూర్వ కాలంలో బ్రహ్మదేవుడు మొదటగా ఈ ఆయుర్వేద విద్యను దేవతలకు ఉపదేశించాడు. భూలోకంలో ఆ విద్యను కాశీరాజైన ధన్వంతరి ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ఆయుర్వేద విద్య నిత్యనూతనమైనది. అంటే, సర్వ కాలాలలోనూ ప్రజలకు ప్రయో‘జనం’ కలిగించేదిగా ఉంటుంది. ఆకలి వేసిన అన్నార్తికి అన్నం పెట్టిన వాడికీ, దాహం వేసిన దాహార్తికి మంచినీళ్లు ఇచ్చిన వాడికీ, రోగం వచ్చిన రోగికి ఔషధం ఇచ్చిన వాడికీ ఎలాంటి యజ్ఞాలూ, పూజలూ, నోములూ, వ్రతాలు చేయకుండానే స్వర్గఫలం దక్కుతుందని అంటారు. ‘రోగం’ అనేది పెద్ద ఊబి. అందులోకి దిగబడిన వారికి ఔషధం అనే ఊతం ఇచ్చి వ్యాధి ఊబిలో నుంచి బయటకు లాగి గట్టుకు చేర్చిన వ్యక్తి చెయ్యని ధర్మకార్యం ఏముంటుంది?
రుతువులు.. ఆయుర్వేదం చెప్పిన ప్రభావం..
శిశిర వసంత గ్రీష్మ వర్ష శరత్‍ హేమంత రుతువులు.. ఇవి ఏటా రెండేసి నెలలకు ఒకటి చొప్పున వస్తుంటాయి. ఒక్కో రుతువు చొప్పున విభజించి ఆయుర్వేద శాస్త్రం ఆయా రుతువులు మనిషిపై చూపే ప్రభావాన్ని చక్కగా వివ రించింది. ఈ ఆరు రుతువులూ గాలి వలన చలిని, సూర్యుడి వలన వేడినీ, చంద్రుడి వలన వర్షాన్ని చిహ్నాలుగా కలిగి ఉంటాయని అంటాడు ఆచార్య సుశ్రుతుడు. చంద్రుడు, సూర్యుడు కాలాన్ని విభజిస్తున్నారు. కేవలం పగలు, రాత్రి మాత్రమే కాదు ఉత్తర ఆయనం, దక్షిణ ఆయన పేర్లతో సంవత్సర కాలాన్ని రెండుగా విభజిస్తున్నారు. శిశిర వసంత గ్రీష్మాలు ఉత్తరాయనం. వర్ష శరత్‍ హేమంతాలు దక్షిణాయనం. ఉత్తరాయనంలో సూర్యుడు, దక్షిణాయనంలో చంద్రుడు బలంగా ఉంటారు. శిశిరంలో చేదు. వసంతంలో వగరు, గ్రీష్మంలో కారం, వర్ష రుతువులో పులుపు, శరదృతువులో ఉప్పు, హేమంత రుతువులో తీపి రుచులు బలంగా ఉంటాయి. ఉత్తరాయన కాలంలో సూర్యుడు బలంగా ఉండటం వలన ఆదాన కాలం అని అంటారు. ఈ కాలంలో మనుషుల శరీరంలోని శక్తిని సూర్యుడు గ్రహిస్తాడు. అందుకని శిశిరం కన్నా వసంతంలోనూ, వసంతం కన్నా గ్రీష్మంలోనూ మనుషులు బలహీనంగా ఉంటారు. వర్ష, శరత్‍, హేమంత రుతువుల్లో చంద్రుడు బలంగా ఉంటాడు. దాన్ని ప్రదాన కాలం అంటారు. మనుషులకు ఈ కాలంలో చంద్రుడు శక్తిని ప్రదానం చేస్తాడు. వర్ష రుతువు కన్నా శరదృతువులోనూ, శరదృతువులో కన్నా హేమంత రుతువులోనూ మనుషులు బల సంపన్నంగా ఉంటారు.
ఆయుర్వేదం.. మూడు దోషాలు
ఆయుర్వేదం మొత్తం మూడు లక్షణాల చుట్టూ అల్లుకుని ఉంటుంది. మనుషుల్ని ముఖ్యంగా వాత, పిత్త, కఫ వర్గాల వారీగా విభజించి ఇది తగిన వైద్యాన్ని అందిస్తుంది. ఆయా దోషాల లక్షణాలు ఇలా ఉంటాయి.
వాతం: తుఫాను, సునామీ, ఉప్పెన, అగ్నిప్రమాదాల వంటివి సంభవించడానికి ప్రధానంగా వాయువే కారణం. వీటిని సృష్టించేది.. వీటిని వ్యాపింపచేసేది వాయువే. శరీరంలో కూడా అచ్చం అలాగే జరుగు తుందని అంటోంది ఆయుర్వేదం. శరీరంలో ఎక్కడైనా చిన్న సందు దొరికితే చాలు వాయువు దూసుకుపోతుంది. అది బలంగా చొచ్చుకుపోయి ఇతర దోషాలను కూడా తనతో లాక్కునిపోతుంది. అవి కూడా ప్రకోపించేలా చేస్తుంది. ఇది ‘వాతం’ అనే దోషం శరీరంలో చేసే అపకారం. వాత ప్రకృతి కలిగిన మనుషులు సాధారణంగా ఈ కింది లక్షణాలను కలిగి ఉంటారు. – దుష్ట స్వభావం కలిగి ఉంటారు.
కొబ్బరిపీచులా ఉండి, బూడిదరంగు వెంట్రుకలు కలిగి ఉంటారు. ఈ లక్షణాలు ‘వీళ్లు వాత ప్రకృతి మనుషులు’ అని గుర్తింప చేస్తాయి.
శరీరం బిగదీసినట్టు ఉంటుంది. మనిషిని ముట్టుకుంటే కట్టెను ముట్టుకున్నట్టే ఉంటుంది. ఆ స్పర్శలో ఆత్మీయత, అనురాగం ఉండవు.
చల్లదనాన్ని సహించలేరు. వేసవిలో కూడా వేడినీళ్లే స్నానానికి కావాలని అంటారు.
ధైర్యంగానే ఉంటారు కానీ, చంచల స్వభావులు.
పిత్తం: ఇది మరో దోషం. ఇది ‘అగ్ని’ చేత కలిగే దోషం. కాబట్టి ఈ ప్రకృతి కలిగిన మనుషులకు దప్పిక ఎక్కువగా ఉంటుంది. ఆకలి ఎక్కువ బాగుంటుంది. శరీరం ఎప్పుడూ వెచ్చగా ఉంటుంది. అరిచేతులు,
కాళ్లు, కళ్లు ఎర్రగా ఉంటాయి. జుట్టు కొంచెం ఎర్ర రంగులో ఉంటుంది. వెంట్రుకలు తక్కువగా ఉంటాయి. నిజాయితీపరులని పేరు. వీరి లక్షణాలివీ..
వీరిలో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. మేధావుల్లో ఎక్కువ మంది పిత్త ప్రకృతి కలిగి ఉంటారు.
తన గురించి ఎక్కువ గొప్పలు చెప్పుకునే స్వభావం కూడా
ఉంటుంది. కానీ, చెప్పుకోవ డానికి విషయం ఉంటుంది కాబట్టే వీళ్లు గొప్పలు చెప్పుకున్నా.. అది డబ్బాగా అని పించదు.
మంచి తేజస్సు కలిగి ఉంటారు. తన దారికి రాని మనుషుల పట్ల కఠినంగా వ్యవహరించే స్వభావం ఉంటుంది.
దాతృత్వం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. తరచూ నోటిపూత వస్తుంటుంది.
కఫం: ఇది చల్లదనం లక్షణంగా కలిగిన స్వభావం. వీరు సౌమ్య స్వభావులై ఉంటారు. నిగూఢంగా ఉంటారు. వీరిని అంచనా వేయడం కష్టం. మనిషిని చూస్తేనే తెలిసి పోతుంది. స్నిగ్ధంగా ఉంటారు. సమానమైన ఆకలి ఉంటుంది. ఉపవాసాలు ఎక్కువ చేయగలుగుతారు. ఇంకా వీరి లక్షణాలేమిటంటే..
బుద్ధిమంతులు, నిజాయతీ పరులుగా ఉంటారు.
కళ్లు మరీ తెల్లగా ఉంటాయి. వీరి వెంట్రుకలు దృఢంగా ఉండి ఏపుగా పెరుగుతాయి.
మా•తీరు గంభీరంగా ఉంటుంది. సత్వగుణ సంపన్నులు. మంచిని కోరే వారుగా, మంచిని చేసే వారుగా, మంచిని మాత్రమే ఆలోచించే వారుగా ఉంటారు.
కష్టాలను ఓర్చుకునే శక్తి ఎక్కువగా కలిగి ఉంటారు.
అనుపానమే ఆయుర్వేదం ప్రత్యేకత
ఆయుర్వేదం ప్రధానంగా ఈ మూడు లక్షణాలను బట్టే వైద్యాన్ని సూచించింది. నిజానికి ఒకే ప్రకృతి కలిగిన వ్యక్తులు ఉండరు. ఒకరిలోనే మూడు ప్రకృతుల లక్షణాలు కలగలసి కూడా ఉంటాయి. అయితే, మొదట మనిషి స్వభావం ఎటువంటిదో అంచనా వేయడానికి ఆయుర్వేదం ఈ ప్రకృతి నియమాలను నిర్దేశించింది. దీనిని బట్టే వారికి సోకిన అనారోగ్య లక్షణాలకు చికిత్స అందించడం ఈ శాస్త్రం ప్రత్యేకత. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వ్యాధికి కారణమైన దోషాలను తగ్గించడం ద్వారా వ్యాధిని తగ్గించడం చికిత్సా సూత్రంగా ఉంటుంది. ఒకే ఔషధం వివిధ వ్యాధులపైన పని చేయడానికి దోషాలను ఉపశమింపచేసే గుణాలు ఆ ఔషధానికి ఉండటమే కారణం. ఆయా వ్యాధుల మీద పనిచేసే ద్రవ్యాల్ని అనుపానంగా ఇస్తూ ఒకే ఔషధాన్ని అనేక వ్యాధుల మీద ప్రయోగించే నేర్పు ఆయుర్వేద వైద్య విజ్ఞానం సొంతం. అనుపానం లేకుండా ఆయుర్వేద చికిత్స ఉండదు. ఔషధాన్ని మరికొన్ని మిశ్రమాలతో కలిపి ఇవ్వడమే అనుపానం అంటే. ఉదాహరణకు రస సింధూరాన్ని పిప్పళ్లపొడి, తేనె అనుపానంతో ఇస్తే వాత వ్యాధులు తగ్గుతాయి. ఇదే రస సింధూరాన్ని త్రిఫలా చూర్ణం, పంచదారతో కలిపి తినిపిస్తే కడుపులో పైత్య దోషం తగ్గుతుంది.
ఆయుర్వేదం చెప్పిన మజ్జిగ ముచ్చట..
ఆయుర్వేదంలో మజ్జిగకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు. వీలున్నంత మేరకు, వీలైనంత వరకు దీన్ని ఆహారంలో తీసుకోవడం వల్ల ఎన్నెన్ని ప్రయోజనాలో ఆయుర్వేదం చాలాసార్లు ప్రస్తావిస్తుంది. యోగరత్నాకరం అనే వైద్య గ్రంథంలో మజ్జిగ ప్రాశస్త్యం గురించి చమత్కారంగా ఇలా చెబుతారు..
‘‘కైలాసంలో ఈశ్వరుడికి మజ్జిగ దొరికి నట్టయితే ఆయన కంఠం నల్లగా ఎందు కుండేది? విషదోషాలకు మజ్జిగ విరుగుడు కదా! అది తాగితే నీలకంఠుడు అయ్యే వాడే కాదు శివుడు.
వైకుంఠంలో విష్ణుమూర్తి పాలసముద్రాన్నే స్థావరంగా చేసుకున్నాడు. కానీ, ఆయనకు మజ్జిగ తాగే అలవాటే ఉండినట్టయితే అంత నల్లని శరీరం ఎందుకుంటుంది? మజ్జిగ తాగి ఉంటే మంచి రంగు వచ్చి
ఉండేది.
ఇంద్రుడు దేవతలకు రాజు. సురాపాన ప్రియుడు. కొంచెం మజ్జిగ కూడా తాగే అల వాటు చేసుకున్నట్టయితే ఆయనకు క్షయవ్యాధి వచ్చి అంత దుర్భలుడు అయ్యేవాడే కాదు కదా!
వినాయకుడు ఉండ్రాళ్లతో పాటు మజ్జిగ కూడా తాగితే లంబోదరు (పెద్దపొట్ట) వచ్చేది కాదు కదా!
అగ్నిదేవుడికి మజ్జిగ దొరికి ఉంటే ఆయనలో అసలు మండే గుణం అనేదే ఉండేది కాదు కదా!

కుబేరుడికి కుష్టు వ్యాధి కూడా మజ్జిగ తాగే అలవాటు ఉండి ఉంటే వచ్చేదే కాదు.
….ఇదీ యోగరత్నాకరంలో మజ్జిగ గురించి సరదాగా చెప్పిన చమత్కారాలు. మజ్జిగ చేసే మేలు శరీరానికి అంతా ఇంతా కాదు.
మజ్జిగ- విషదోషాలను పోగొడుతుంది. చర్మానికి మంచి కాంతిని ఇస్తుంది. క్షయ వంటి శరీరాన్ని శుష్కింపచేసే వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అతిగా కొవ్వు పేరుకుపోనివ్వదు. స్థూలకాయం కలగనివ్వదు. కుష్టు, సోరియాసిస్‍ వంటి అనేక చర్మవ్యాధులు ముంచుకు రానివ్వదు. ఇవన్నీ మజ్జిగ తాగే వారికి కలిగే ప్రయోజనాలు. శరీరంలో వేడిని తగ్గించడంలో మజ్జిగ నిర్వహించే పాత్ర అమోఘం. ఆయుర్వేదం మజ్జిగ ప్రాముఖ్యాన్ని గురించి వివరిస్తూ, దానిని తగినంత తీసుకోవడం ద్వారా సగం రోగాలను దరిచేరనివ్వకుండా చూసుకోవచ్చని సూచిస్తోంది.
హితాహారం.. అహితాహారం
శరీరానికి సరిపడితేనే ఆహారం ఆరోగ్యంగా మారుతుంది. శరీరానికి మంచి వృద్ధినిచ్చేది హితాహారం. మంచిని కలిగించనది, వ్యతిరేక లక్షణాలను పెంచేది అహితాహారం. ఇటువంటి హిత, అహిత ఆహార లక్షణాల గురించి, వాటి వల్ల కలిగే లోపాలు, మేలు గురించి ఆయుర్వేదం ఎంతో చక్కగా వివరించింది. అసలు ఆహారమే ఆరోగ్యానికైనా, అనారోగ్యానికైనా కారణమని వేల సంవత్సరాల క్రితమే చాటింది ఆయుర్వేదమే. హితాహారం ఒక్కటే ఆరోగ్యాన్ని కలిగిస్తుందనీ, అహితాహారం వ్యాధి కారకం అవుతుందనీ చరక మహర్షి చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని కలిగించే వాటిలో సదాచార విహారాలు, సుఖనిద్ర వంటి కారణాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నింటి కన్నా హితాహారం ఒక్కటే ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఏ ఆహారం శరీరంలో ధాతువులన్నిటినీ సమస్థితిలో ఉంచుతుందో, ఏ ఆహారం శరీర దోషాల్ని (వాత, పిత్త, కఫ) సమస్థితిలో నడుపుకొని పోగలదో అది హితాహారం.
నీళ్లు ఎప్పుడు, ఎన్ని తాగాలి?
రోజూ పొద్దున్నే లేచిన వెంటనే ఎన్ని నీళ్లు తాగాలనేది ఇప్పటికీ చాలామందికి సందేహమే. పైగా ఇదేదో నేటి ఆధునిక వైద్యులు సూచిస్తున్న ఆరోగ్య పక్రియగా నేటి తరం భావిస్తోంది. కానీ, యోగరత్నాకరం అనే వైద్య గ్రంథంలో వేల ఏళ్ల క్రితమే ఉదయాన్నే లేచిన వెంటనే ఎన్ని
నీళ్లు తాగాలి? ఎలా తాగాలో వివరించారు. సూర్యోదయ కాలంలో రోజూ ఎనిమిది దోసిళ్ల నీళ్లు తాగే వారు రోగాలు, ముసలితనం లేని వారై నూరేళ్లు జీవిస్తారని ఈ గ్రంథం నాడే చెప్పింది. సూర్యోదయానికి ముందే నీళ్లు తాగడం మంచిదని మన ప్రాచీన ఆయుర్వేదం చెబుతోంది. రాత్రి నాలుగో జాములో అంటే, తెల్లవారుజామున తాగాలని, ఆ నీరు కూడా రాత్రి పూట తెచ్చి నిల్వ ఉంచినదై ఉండాలని మరో నియమం కూడా ఉంది. రాగిపాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం మరీ మంచిదని మన ప్రాచీన వైద్యం మాట.
శరీర పాలన ముఖ్యం
ఆయుర్వేదం ఒక్కటే చెబుతుంది.. అది- శరీర పాలన. బుద్ధిమంతుడైన వాడు ఆహార విహారాల ద్వారా తన శరీరం యోగక్షేమాలు చూసుకొంటాడు. అందుకు ఉపయోగపడేవి ఏవి? హాని చేసేవి ఏవి? అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. వ్యక్తికి శరీరమే మూలం. శరీరానికి వ్యక్తి మూలం. అందుకే ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోందంటే.. అన్ని ఇతర పనులూ మాని శరీర పాలన చేసుకోవాలని చెబుతోంది. ఎందుకంటే శరీరం లేకపోతే వ్యక్తి మాత్రమే కాదు, వ్యక్తికి సంబంధించిన ఆస్తిపాస్తులతో సహా అన్నీ శూన్యమే అయిపోతాయి కాబట్టి. చరక మహర్షి ‘శోష’ అనే వ్యాధి లక్షణాల గురించి వివరించే సందర్భంలో – నిదాన స్థానంలో మనిషిని శుష్కింపచేసే వ్యాధులు రావడంలో వ్యక్తి స్వయంకృతాపరాధాలు, తెలిసి చేసే తప్పులు, అశ్రద్ధ, నిర్లక్ష్యం, తనకు మాత్రమే ఏమీ కాదనే భావన.. ఇలాంటివి వ్యాధులకు ఎలా కారణం అవుతాయో ఆలోచించాలని తన ‘చరకసంహిత’లో వివరిస్తాడు.
మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే, దానికి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. చికిత్స కూడా ఇదే సూత్రాన్ని అనుసరించి ఉంటుంది. చికిత్స అనేది రోగాన్ని తగ్గించడానికే. కానీ, ఒక ప్రత్యేక వైద్య విధానానికి ఒక ప్రత్యేక దృక్పథం అనేది ఉంటుంది. ఆ దృక్పథాన్ని అనుసరించి ఆ శాస్త్రం అభివృద్ధి చెందుతుంది.
ఆయుర్వేదంలోనే అంతా ఉంది..
ఆరోగ్యవంతుడైన మనిషి తనకు ఎటువంటి అనారోగ్యాలూ కలగకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలూ ఆయుర్వేదంలో వివరించి ఉన్నాయి. అలాగే వ్యాధి కలిగిన తరువాత వ్యాధిని తగ్గించేందుకు చేయాల్సిన చికిత్స విధానం అంతా కూలంకషంగా వివరించి ఉంది. ఇదే ఆయుర్వేద శాస్త్ర ప్రయోజనమని సుశ్రుతుడు సూత్రీకరించాడు. వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడేందుకు, రోగాలు రాకుండా చూసుకునే ఉపాయాలను వివరించే విభాగాన్ని ‘స్వస్థవృత్తం’ (ప్రివెంటివ్‍ మెడిసిన్‍) అంటారు ఆయుర్వేద శాస్త్రంలో!. దీని ప్రకారం- ప్రతి వ్యక్తికీ ఒక శరీర తత్వం ఉంటుంది. ఎవరి శరీరతత్వం వారిది. ఆ శరీర తత్వాన్ని బట్టి, తీసుకునే ఆహార విహార ప్రభావం ఆ వ్యక్తిపైన పడుతుంది. మనం ఈ విషయాన్ని పట్టించుకోకుండా కేవలం రోగాలు, వాటికి మందులు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. అందువలన రోగాలు రాకుండా చేసే ఆహార విహారాన్ని పట్టించుకోవడం మానేశాం. అలాగే, రోగం వచ్చిన తరువాత ఆహార విహారాల్లో జాగ్రత్త తీసుకోవడాన్ని కూడా పట్టించుకోవడం మానేశాం. ఇది వ్యాధులు అతిగా ప్రబలడానికి ముఖ్య కారణం. అందుకే ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతుందో జాగ్రత్తగా చదవండి..
‘‘తెలిసి చేసే తప్పుల్ని ప్రజ్ఞాపరాధం అంటారు. ఇలా ప్రజ్ఞాపరాధాల వల్ల ప్రతి వ్యక్తి శరీరం మీద తప్పకుండా కనిపించే వాతం వంటి రకరకాల దోషాలు, వాటిని ప్రకోపింప చేసే ఆహార విహారాలు ఆ వ్యక్తికి కలిగించే రకరకాల అనారోగ్యాల గురించి వివరిస్తుంది కాబట్టి, ఇది అసాధారణ విభాగంలోకి వస్తుంది. అంటే, వ్యక్తి వ్యక్తిగత ఆరోగ్య అనారోగ్యాలకు సంబంధించిన శాస్త్రం ఆయుర్వేదం. దీన్ని ‘పర్సనల్‍ హైజీన్‍’ అంటారు.
ఆయుర్వేదం ఏం చెబుతోంది?
ఆయుష్షుకు హితమైనది, అహితమైనది, సుఖాన్ని కలిగించేది, దుఃఖాన్ని కలిగించేది తెలియ చెప్పడమే కాక, ఆయుష్షు పరిమితిని కూడా తెలియచెప్పేది ఆయుర్వేద. ఆయువును తెలుసుకోవడానికి, ఆయువును పెంచుకోవడానికి ఆయుర్వేద శాస్త్రం ఉపయోగపడుతుంది. ధర్మార్థ కామ మోక్షాలను కోరే వారు ఆయుష్షు సాధన కోసం ఆయుర్వేద శాస్త్రాన్ని మిక్కిలి శ్రద్ధతో చదవాలి. అందులోని ఆరోగ్య నియమాల్ని, జీవనశైలి సదాచారాలను ఆచరించాలి.
ప్రకృతి ప్రసాదం..
ఆయుర్వేదం ప్రకృతి ప్రసాదం. ఇందులో నకిలీ లేదు. కల్తీ లేదు. దేవుడు మనకు ప్రసాదించిన ప్రకృతి నుంచి పుట్టిన ప్రాణౌషధం ఆయుర్వేదం. సహజసిద్ధంగా లభించే మూలికలు, వృక్షాలు, వాటి భాగాల నుంచి ఆయుర్వేద ఔషధాలు తయారవుతాయి. వీటి వల్ల ఇంగ్లీష్‍ మందుల మాదిరి సైడ్‍ ఎఫెక్టస్ ఉండవు. ఒక రోగాన్ని తగ్గించి మరో రోగాన్ని పెంచే లక్షణాలు ఈ ఔషధాల్లో ఉండవు. ఇంగ్లీష్‍ మందులు వ్యాధిని కేవలం నివారిస్తాయి మాత్రమే.. ఆయుర్వేదం మాత్రం వ్యాధి లక్షణాన్ని, వ్యాధి కారకాన్ని గుర్తించి వాటిని సమూలంగా శరీరం నుంచి బయటకు పంపుతుంది. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో సైతం ఆయుర్వేద వైద్య విధానాలను అనుసరిస్తున్నారు. విచిత్రంగా మన ఇంటి వైద్యాన్ని మనం మాత్రం తృణీకరిస్తున్నాం.

ఆయుర్వేదం పట్ల అమెరికాలో ఇటీవల కాలంలో అవగాహన చురుగ్గా పెరుగుతోంది. ఇలా అవగాహన పెరగడంలో ఎనిమిదేళ్ల క్రిందట నగేశ్‍ కాసం ఏర్పాటు చేసిన ‘అమ•త ఆయుర్వేద’ ఒకటని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అమెరికాలో తాను చేస్తున్న ఐటీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆయుర్వేదం పట్ల పెంచుకున్న ఆసక్తితో నగేశ్‍ కాసం ఒక ఉద్యమంలా అమెరికా వాసుల్లో ఆయుర్వేద పక్రియ పట్ల అవగాహన పెంచుతున్నారు. బాబా రాందేవ్‍ గారి ప్రేరణతో ఇతర పనులన్నీ ప్రక్కనబెట్టి పూర్తిస్థాయిలో ఆయుర్వేద పక్రియను బహుళ ప్రచారంలోకి తీసుకురావడంలో నగేశ్‍ అంకితమయ్యారు. అట్లాంటా నగరంలో వారు ఇప్పటికే రెండు స్టోర్స్ నిర్వహిస్తున్నారు.
యోగ, ధ్యానం, ఆయుర్వేద పక్రియల పట్ల ఇక్కడి ప్రజల్లో విస్త •త అవగాహన కల్పించడంలో నగేశ్‍ క•తక•త్యులయ్యారనే చెప్పాలి. ఆయుర్వేదంలో విశిష్ట సేవలందించడంలో ఆయన ఇప్పటికే సముచిత గుర్తింపు పొందారు.
వాయు, వాత, పిత్త, కఫనాశనానికి ఆయుర్వేదం ఎంతగానో ఉప యుక్తంగా ఉంటుందని నగేశ్‍ కాసం గారు అంటున్నారు. ఆయుర్వేద పక్రియ గురించి ఇంకా వారేం చెబుతున్నారంటే….
వాత, పిత్త, కఫ దోషాలు శరీరంలోని అన్ని భాగాలను సాధారణ స్థితిలో ఉంచేందుకు దోహదపడటమే కాకుండా, ఏడు ధాతువుల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అందువలన మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మూడు లక్షణాలు సమపాళ్ళల్లో పనిచేయాలి. మన శరీరతత్వం.. సమస్యలు తెలిస్తే – వాటినుంచి బయటపడే మార్గాలను అన్వేషించడం సులభం.
ఆయుర్వేదమన్నది భారత దేశం అందిస్తున్న ఓ చక్కటి ఆరోగ్య విధాన పక్రియ అని చెప్పారు. సుమారు ఐదు వేల సంవత్సరాలకు ముందే ఆయుర్వేదం ఆవిర్భవించింది. ఆయుర్వేదాన్ని గురువులు మొదట్లో శిష్యులకు బోధించేవారు. కాల క్రమేణా ఆయుర్వేద విధానాన్ని గ్రంథస్తం చేశారు. ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే రోగిని శాశ్వతంగా రోగం బారినుండి బయటపడేయటం.
అమెరికాలో వందలాది మందికి ఆయుర్వేదం పట్ల అవగాన పెంచడం కోసం ఐదారొందల మంది ప్రాక్టీషర్స్ క•షి చేస్తుండటం విశేషంగా చెప్పు కోవచ్చు. ఒక్క మాటలో చెప్పా లంటే, అమెరికాలోని 20 శాతం మందికి ఆయుర్వేదం పట్ల అవగాహన ఏర్పడింది.
మెరుగైన జీవన ప్రమాణానికి ఆయుర్వేదం ఒక చక్కటి నిర్వచనం. తెల్లవారు జామున నాలుగు గంటలకు లేచి కాలక •త్యాలు తీర్చుకొని క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుటుంటే రోజంతా ప్రశాంతంగా కొనసాగుతుందని ఆయుర్వేదం తెలుపుతుంది. అంతేకాకుండా ఎటువంటి ఆహారం తీసుకోవాలి.. ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనేది కూడా ఆయుర్వేదం చెపుతుంది. సన్మార్గాన్ని బోధించే ఆయు ర్వేదం ప్రపంచంలో ఏ దేశస్థులకైనా ఒక మార్గదర్శి.

Review జీవనవేదం ఆయుర్వేదం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top