మన తెలుగు నేల వెలుగుదివ్వెల పూదోట. మనకు అందుతున్న ఆధ్యాత్మిక, సంస్క•తీ సంప్రదాయాల ఘన వారసత్వం మనకు లభించిన వెలకట్టలేని సంపద. దీనిని పది కాలాల పాటు నిలుపుకోవడం మన బాధ్యత. ‘తెలుగు’ అంటే భాష మాత్రమే కాదు.. మనిషి జీవన విధానాల, సంస్క•తీ సంప్రదాయాల సంగమం కూడా!. మనకు, మన భావాలక•, మన ఆలోచనలక•, మన అభిప్రాయాలక• చోటిచ్చే విశిష్ట వేదికగా రూపుదిద్దుకుంది ‘తెలుగు పత్రిక’. మాతృ భూమి, మాతృ భాషలతో పాటు మన నేల నలు దిక్కులా చోటుచేసుకుంటున్న, చోటు చేసుకున్న విశేషాల కలబోతలతో ఇది మిమ్మల్ని పలకరించడానికి వస్తోంది. ‘అ..ఆ’ల నుంచి ‘వహ్వా’ అనిపించే ఆశ్చర్యానందకరమైన విశేషాలు, వింతలు, వార్తాంశాలు ఇవన్ని మనవంటూ అలరిస్తాయి. కారణాలేవైనా.. మన తెలుగు నేల ప్రస్తుతం మన్నన, మన్నిక లేక చిన్నబోతోంది. ఒకప్పుడు కైమోడ్పులందుకున్న మన భూమి నేడు నీళ్లింకిన నేలపై మోడు వారిన వృక్షంలా మిగులుతోంది. సంస్క•తీ సంప్రదాయాలను నిలుపుకోవడం ద్వారా, వాటిని పునర్జీవింప చేసుకోవడం ద్వారా వాటిని తిరిగి నిలబెట్టుకోవాల్సిన బృహత్తర బాధ్యత మనందరిపై ఉంది. కళ్లెదుటే జరుగుతున్న సంస్క•తీ విధ్వంసాన్ని మనమంతా కలిసికట్టుగా నిలిచి అడ్డుకోవాల్సిన సమయమిది. ఇందు కోసం తన వంతు ప్రయత్నంగా ఓ ‘అక్షరమై’ నిలుస్తోంది ‘తెలుగు పత్రిక’. తెలుగు వెలుగుల ప్రభావాన్ని, తేజాన్ని నలుదిశలా చాటేందుకు తన వంతు బాధ్యతగా 35 సంవత్సరాల జర్నలిజం అనుభవంతో ‘విద్య గ్రాఫిక్స్’ తెలుగు పత్రిక కు బీజం వేసింది. అమెరికా వేదికగా తెలుగు భాష, సంస్క•తి, సంప్రదాయాలను వేడుక చేసేందుకు ఇది నడుం బిగించింది. నిజానికి అమెరికాకు ఒక తెలుగు పత్రిక అవసరమా?..ఈ ప్రశ్న మరో ప్రశ్నకు హేతువైంది.. జన్మభూమి, మాతృభాష ఎవరికి వద్దు?. దీనికి అద్భుత సమాధానమై ఆవిర్భవించింది ‘తెలుగు పత్రిక’. అందుకే జన్మభూమి విశేషాలను మాతృభాషలో రంగరించి అందించేందుకు తెలుగుపత్రిక వేకువ వెలుగై ఉదయించింది. తెలుగు అక్షరాన్ని మరింత సలక్షణంగా సాక్షాత్కరించేందుకు.. తెలుగు వెలుగుల విశేషాల్ని దశదిశలా ఆవిష్కరించేందుకు ఒక చిన్న ప్రయత్నమిది. అమెరికాలో, ఇతర దేశాల్లో స్థిరపడిన తెలుగు వారి చేతిలో కరదీపికగా భాసిల్లడానికి ముస్తాబైంది సంపూర్ణ సకుటుంబ సచిత్ర అంతర్జాతీయ తెలుగు మాస పత్రిక.. ‘తెలుగు పత్రిక’. ఇది మీ ఇంట, మీ హృదయాల్లో వెలుగులు పూయించేందుకు ముస్తాబై వచ్చింది.
ఇందులోని సకలం, సమస్తం అక్షర సుమాలై గుబాళిస్తాయి.
జన్మభూమి విశేషాలు, తెలుగు సంస్క•తీ సంప్రదాయ వైభవాలు,
మాతృభాషలోని, ఆచార వ్యవహారాల్లోని మాధుర్యాలు మిమ్మల్ని అలరిస్తాయి.
ఆకట్టుకుంటాయి. ఆలోచింప చేస్తాయి.
ఇది మనది. మన వారధి. ఆదరించండి.
అక్కున చేర్చుకోండి. ఆశీర్వదించండి.
Review మన తెలుగు మన వెలుగు.