
కావాల్సినవి: బాస్మతీ బియ్యం- పెద్ద కప్పు, మీల్‍మేకర్: అరకప్పు, కారం: చెంచా, ధనియాల పొడి: అరచెంచా, అల్లంవెల్లుల్లి పేస్ట్: చెంచా, మైదా: రెండు చెంచాలు, మొక్కజొన్న పిండి: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, నూనె: తగినంత, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, క్యాప్సికం: ఒకటి, చిల్లీసాస్: టేబుల్‍స్పూన్, సోయాసాస్: చెంచా, వినెగర్: చెంచా, మిరియాల పొడి: అర చెంచా.
తయారు చేసే విధానం: ముందుగా మీల్‍మేకర్‍ను వేడినీళ్లలో వేసుకుని పది నిమిషాలు అయ్యాక ఆ నీటిని వంపేసి చన్నీళ్లు పోయాలి. తరువాత మీల్‍మేకర్‍ను గట్టిగా పిండి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. వీటిపైన కారం, ధనియాల పొడి, సగం అల్లంవెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు, మైదా, మొక్కజొన్న పిండి వేసి రెండు చెంచాల నీళ్లు పోసి కలపాలి. వీటిని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. మరో కడాయిలో రెండు టేబుల్‍స్పూన్ల నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, మిగిలిన అల్లంవెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి తరుగును వేయించుకుని క్యాప్సికం ముక్కలు, సాస్‍లు, వినెగర్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, మీల్‍మేకర్‍ను వేసి వేయించాలి. చివరగా అన్నం వేసి అన్నింటినీ కలిపి దించేస్తే సరి.
Review మీల్‍మేకర్ రైస్.