అతి నిద్రతో షుగర్‍..

రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అవసరం. అంతకుమించి నిద్రపోతే అది అనారోగ్యానికి దారితీస్తుంది. రోజు మొత్తంమీద పోవలసిన నిద్ర కన్నా గంట ఎక్కువ సేపు పడుకునే వారిలో టైప్‍-2 డయాబెటీస్‍ వచ్చే అవకాశాలు ఎక్కువ. రోజుకు గంటకన్నా అధికంగా పడుకోవడం వలన అధిక బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయనీ, ఇదే టైప్‍-2 డయాబెటీస్‍ రావడానికి కారణం అవుతుందని చెబుతున్నారు. కొంతమందిపై వీరు పరిశోధనలు నిర్వహించి.. వారి రోజువారి కార్యకలాపాలతో పాటు వ్యాయామం, తీసుకునే ఆహారం, నిద్రపోయే సమయం అన్నింటినీ పరిశీలించారు. పోషకాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్న వారిలో కూడా టైప్‍-2 డయాబెటీస్‍ ఉన్నట్టు గుర్తించారు. రోజులో నిద్ర పోవలసిన దానికన్నా గంట ఎక్కువ నిద్రపోవడమే టైప్‍-2 డయాబెటీస్‍ రావడానికి నిద్ర ఒక్కటే కారణమా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అన్న విషయం మీద వీరు పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

Review అతి నిద్రతో షుగర్‍...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top