
నవంబర్ 2, 2021 `
జాతీయ ఆయుర్వేద దినోత్సవం
ఆయుర్వేదం అంటే..?
ఆయుర్వేదం అంటే` ఆయుష్షును గురించి తెలిపే శాస్త్రం.
హితాం హితం సుఖందు:ఖ మాయుస్తస్య హితాహితమ్
మానంచ తచ్చ యతఓక్త మాయుర్వేద: స ఉచ్యతే
ఆయుష్షుకు హితమైనది, అహితమైనది ఏమిటో తెలిపేదీ, సుఖమును కలిగించేది ఏదో, దు:ఖాన్ని కలిగించేది ఏదో వివరించేది మాత్రమే కాక, ఆయుష్షు పరిమితిని కూడా తెలియచెప్పే శాన్త్రమే ఆయుర్వేదం.
ఆయుర్వేదం వల్ల మానవ జీవనానికి కలిగే ప్రయోజనం ఏమిటి?
ఆయు: కామయమానేన,
ధర్మార్థ సుఖసాధనం
ఆయుర్వేదోపదేశేషు విధేయ:
పరమాధర:
ఆయువు గురించి తెలుసుకోవడానికి, ఆయువును పెంచుకోవడానికి ఆయుర్వేద శాస్త్రం ఉపయోగపడుతుంది.
ఆయుర్వేదంలో ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఎన్నో సులభ పద్ధతులు, సరళమైన వైద్య విధానాలు ఉన్నాయి. అవన్నీ మన ఆరోగ్యాన్ని, తద్వారా ఆయుష్షును పెంచే దివ్యమైన వరాలే సుమా!.
Review ఆయుర్వేదం.. ఆరోగ్యం.