ఆయుర్వేదంలో వివిధ ఉత్పత్తులు ఉన్నాయి. వాటిలో లేహ్యములు ఒకటి. లేహ్యాలను తయారు చేయడానికి అవసరమైన మూలికల సమ్మేళనంతో ఫార్ములాలను బట్టి వాటిని రసంగానూ లేదా కషాయంగానూ మార్చాల్సి ఉంటుంది. అవి మరింత చిక్కగానూ, గాఢంగానూ, రుచిగానూ ఉండేందుకు బెల్లం లేదా ఖండశర్కరతో తగినంత వేడి చేసి పాకం రూపంలో మారుస్తారు. ఇలా తయారైన ఔషధాన్నే లేహ్యం లేదా అపలేహ్యం అని కూడా అంటారు. నేరుగా ఔషధాలను తీసుకోలేని వారు, చూర్ణాలను సేవించడానికి ఇబ్బంది పడే వారు లేహ్యాలను సులువుగా తీసుకోవచ్చు. ఆయుర్వేదంలో భస్మాలు అత్యంత శక్తివంతమైన రసాలు. వీటిని సేవించలేని వారు లేహ్యాలను తీసుకోవచ్చు. బలహీనంగా ఉన్న వారు అన్ని కాలాల్లోనూ ఆయుర్వేద వైద్య నిపుణుల పర్యవేక్షణలో లేహ్యాలను నిరంతరం వాడవచ్చు. సాధారణంగా రోజులో రెండుసార్లు వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని లేహ్యములను అనుపానంగా ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని వాడే ముందు ఆయుర్వేద వైద్యుల సలహాను తప్పక తీసుకోవాలి.
Review ఆయుర్వేదం.. లేహ్యం.