ఆరోగ్యసిరి…. అరటి ,కొబ్బరి

అరటి, కొబ్బరి.. ఈ రెండూ లేకుండా పూజాధికాలు జరగ•వంటే అతిశయోక్తి కాదు. శుభకార్యాల్లోనూ ఈ రెండింటికే పెద్దపీట వేస్తారు. అటు ఆధ్యాత్మికపరంగానూ, ఇటు ఆరోగ్యపరంగానూ కూడా ఇవి రెండూ ఎంతో విశేషమైనవి. పైగా ఇవి రెండూ అన్ని కాలాల్లోనూ, సమయాల్లోనూ అందుబాటులో ఉంటాయి. పూజలు, శుభకార్యాల్లో వీటికి గల ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం.

హిందూ సంప్ర దాయం ప్రకారం టెంకాయకు, అరటిపండుకు ఒక విశేష స్థానం ఉంది. దేవాలయానికి వెళ్లినపుడు కొబ్బరికాయ, అరటిపళ్లు తప్పకుండా తీసుకువెళుతుంటారు. ఇంట్లో కూడా రోజూ కాకపోయినా మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం పూజల సందర్భంలో తప్పకుండా కొబ్బరికాయ కొట్టి తమ ఇష్టదైవాలకు నైవేద్యం పెట్టడం చాలామంది సంప్రదాయంగా భావిస్తారు. అలాగే షాపుల్లో వ్యాపారులు ప్రతి శుక్రవారం లక్ష్మీపూజ చేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి దాన్ని అందరూ భక్తితో తింటారు. వధూవరులకు, పసిపిల్లలకు దిష్టి తగలకుండా కొబ్బరికాయ దిగదీసి పడేస్తారు. ప్రత్యేక పూజల సందర్భంలో, ఇతర శుభ కార్యక్రమాల సమయంలో పెట్టే పూజా కలశాలలో కూడా కొబ్బరికాయనే పెడతారు. పూజల్లో తొలి స్థానం కొబ్బరికాయకే లభిస్తుంది.

కొబ్బరికాయ కొట్టాల్సిందే
ఏ శుభకార్యం జరిగినా కొబ్బరికాయలు, అరటిపళ్లు తప్పకుండా
ఉండాలి. పెళ్లిళ్లకు, పండుగలకు ఇంటికి వచ్చిన ముత్తయిదువులకు, బ్రాహ్మ ణులకు తమలపాకుల్లో అరటిపళ్లు, కొబ్బరిబొండం పెట్టి ఇవ్వడం మన సంప్రదాయం. ఏదైనా కొత్త పని ప్రారంభించినపుడు కూడా నిర్విఘ్నంగా జరగాలని దేవునికి మొక్కుకుని కొబ్బరికాయ కొడతారు. అలాగే కొత్త వస్తువు షాపు నుంచి కొని తీసుకుని వచ్చిన వెంటనే కొబ్బరికాయను మూడుసార్లు తిప్పి కొడుతుంటారు. టెంకాయ, అరటిపండ్లకే కాకుండా వీటిని అందించే చెట్లకు కూడా అత్యంత ప్రాముఖ్యత ఉంది. గతంలో కొబ్బరి ఆకులతో పెళ్లిళ్లకు, ఉపనయనాలకు పందిళ్లు వేసేవారు. ఇప్పటికీ గ్రామ ప్రాంతాల్లో కొబ్బరి ఆకులతోనే పందిళ్లు వేస్తుంటారు. అలాగే, పండుగల సందర్భంలో అరటిచెట్లను షాపులకు, ద్వారాలకు కట్టడం మన సంప్రదాయం.
ఇలా ఎందుకు చేస్తారు? మిగిలిన పండ్లు అన్నీ దేవునికి పెట్టవచ్చు కదా? అనే సందేహం రావచ్చు. అరటిపండ్లు, టెంకాయలే దేవుని పూజకు, పెళ్లిళ్లకు ఎందుకు ఉపయోగిస్తారు? అనే విషయం పరిశీలిస్తే అందుకు అనేక కారణాలు ఉన్నాయి.

అరటిపండు.. ఆరోగ్యం మెండూ
అరటిపండు అందరికీ అందుబాటులో ఉన్న పండు. మంచి పౌష్ఠికాహారం. రోజూ రెండు అరటి పండ్లు తింటే రోగాలు దరి చేరవని వైద్యులు చెబుతుంటారు. అరటిపండు రక్తపోటును నియంత్రిస్తుంది. అరటిపండు ఆకలిని పోగొడు తుంది. దీంట్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కళ్లకు మంచిది. అరటిపండు తినడం పసిపాపల దగ్గరి నుంచి అన్ని వయసుల వారికీ మంచిది. అంతేకాకుండా పచ్చి అరటికాయలను కూడా అందరూ ఉప యోగిస్తుంటారు. ఇంకా, అరటి కాయలు కాయ డానికి ముందు గెల వేస్తుంది. ఆ సందర్భంలో విరిసే అరటి పువ్వు కూడా కొన్ని ప్రాంతాల్లో కూరగా ఉపయోగపడుతుంది. ఇదెంతో రుచి కరంగా కూడా ఉంటుంది. అలాగే, కూరకు పనికి వచ్చే అరటి రకాలు కూడా
ఉన్నాయి. ఈ కాయ లతో చేసే పులుసు.. రుచిలో చేపల పులుసుకు ఏమాత్రం తీసిపోదు. అరటి ఈ విధంగా పువ్వుగా, కాయగా, పండుగా ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

నారికేళం.. ఆరోగ్యవర

  • కొబ్బరి మానవజాతికి ప్రకృతి ప్రసాదించిన వరం. నిత్య జీవితంలో కొబ్బరి అనేక విధా లుగా ఉపయోగపడుతుంది.
  • కొబ్బరిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదంలో ఉంది.
  • ప్రతి రోజూ పచ్చి కొబ్బరి కొంత మోతాదులో తింటే కళ్లకు మంచిది. జుట్టు నల్లబడుతుంది.
    కొబ్బరి తినడం వల్ల వాత పైత్యాలు తగ్గు తాయి.
    కలరా వ్యాధి వచ్చినపుడు కొబ్బరి నీరు తాగిస్తే చాలా మంచిది.
  • పార్శ్వపు నొప్పి వచ్చిన వారికి కొబ్బరినీరు తాగిస్తే చటుక్కున బాధ తగ్గి ఉపశమనం కలుగుతుంది.
  • అతిసారవ్యాధి సోకినప్పుడు కూడా కొబ్బరి నీళ్లు తాగితే వెంటనే శక్తి పుంజుకుంటారు.
  • పచ్చి కొబ్బరి మెత్తగా రుబ్బి పాలుతీసి తలకు రాసుకుంటే తలలో ఉండే చుండ్రు తగ్గు తుంది. జుట్టు ఊడిపోవడం తగ్గి నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.
  • కొబ్బరినీళ్లతో తయారు చేసిన ‘నారికేళాం జనం’ను ఒకటి రెండు చుక్కలు కంట్లో వేస్తే కళ్లకు వచ్చే జబ్బులు తగ్గిపోతాయని ఆయు ర్వేద గ్రంథాలలో ఉంది.
  • స్త్రీలు గర్భం దాల్చినట్టు నిర్ధారణ అయినప్పటి నుంచి కొబ్బరి చెట్టు నుంచి తీసిన కొబ్బరికల్లు రోజూ కొంచెం తాగితే భార్యాభర్తలు ఏ రంగులో ఉన్నా పిల్లలు మాత్రం తెల్లటి రంగుతో ఆరోగ్యంగా పుడతారని అంటారు.
  • కొబ్బరికల్లు అత్యంత చలువ చేస్తాయి. చాలా రుచిగా ఉంటుంది. పైత్యాన్ని తగ్గించి ఆకలిని వృద్ధి చేస్తుంది. మనసుకు ఉత్సాహం, జ్ఞాపకశక్తి లభిస్తాయి.
  • కొబ్బరిని నూనె రూపంలో వంటలలో ఉప యోగిస్తే ఆయా వంటకాలకు మంచి రుచి వస్తుంది. కేరళలో వంటనూనెగా కొబ్బరి నూనెనే వాడతారు.
  • కొబ్బరి నూనె.. జుట్టుకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇక, ఆహార పదార్థాలకు ఇది మంచి రుచిని కలిగిస్తుంది.
  • ఏవిధమైన జబ్బుచేసిన వారికైనా కొబ్బరి నీరు పట్టించాలని డాక్టర్లు చెబుతుంటారు.
  • కొబ్బరిబొండాం నీళ్లు సత్వర శక్తినిచ్చే దివ్యౌ షధం. ఎంత నీరసించి పోయినవారైనా కొబ్బరి నీళ్లు కాసిన్ని తాగితే ఠక్కున లేచి కూర్చుంటారు. లేత కొబ్బరిబొండం నీళ్లకు పది సెలైన్లు కూడా సాటి రావని వైద్యులు చెబుతుంటారు

ఒక్కమాటలో చెప్పాలంటే, అందరికీ అందు బాటులో ఉండే అమృతఫళం నారికేళం.
ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కాబట్టే అరటిపండ్లు, కొబ్బరి కాయలను ప్రతి పండుగకు, శుభకార్యాలకు వాడుతుంటారు. ప్రతి రోజూ దేవుడికి వీటిని మనం సమర్పించి, ఆ విధంగా నైనా వాటిని మనం తింటామనే ఉద్దేశంతోనే ఈ రెండూ పూజలకు, శుభకార్యాలకు తప్పకుండా ఉండాలనే ఉద్దేశంతో మన పెద్దలు ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారేమో!

Review ఆరోగ్యసిరి…. అరటి ,కొబ్బరి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top