ఉసిరి ఆరోగ్యానికి మంచి ఔషదం. ఉసిరి నూనె జుట్టు నెరవడాన్ని ఆపుతుంది. జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. ఈ నూనె వాడటం వల్ల జుట్టుకి మంచి పోషకాలు అందుతాయి. కొబ్బరి తురుములో కొద్దిగా నీళ్లు కలపాలి. ఆ తర్వాత కొబ్బరి తురుమును పిండితే చిక్కటి కొబ్బరి పాలు వస్తాయి. ఆ పాలతో జుట్టు కుదుళ్లను మర్దనా చేయాలి. వారంలో మూడు సార్లు చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది. చుండ్రు వల్ల జుట్టు పెరుగుదల ఆగిపోవడమే కాకుండా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది కూడా. అందుకని ముందు చుండ్రును నివారించాలి. మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేయాలి. ఈ పేస్ట్ను మాడుకి పట్టించి అరగంట తర్వాత నీళ్లతో కడిగేయాలి. మెంతులతో తయారు చేసిన టీ ఆరోగ్యానికే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. రోజూ మెంతుల టీ తాగితే ఎంతో ఫలితముంటుంది. గుడ్డు తెల్లసొనను మాడుకి పట్టించి పావుగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాకుండా పోషకాలు అందుతాయి. గుడ్డులో ఉండే ప్రొటీన్ వల్ల పోషకాలు లభిస్తాయి.
Review ఉసిరితో లాభాలు.