ఆరోగ్యమే మహాభగ్యమని నానుడి. మనకు ఎన్ని సిరి సంపదలైనా ఉండొచ్చు. కానీ మంచి ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఉన్నా వ•ధానే. ఆరోగ్యంగా
ఉంటే మనిషి అడవిలోనైనా బతికేయవచ్చు. మనిషికే కాదు ప్రపంచంలో ప్రాణం ఉన్న ప్రతి జీవికి ఈ సూత్రం వర్తిస్తుంది. మనకు ఉన్నది అనుభవించాలన్నా ఆరోగ్యం ఉండాలి కదా. కాబట్టి మనిషి మనుగడకు ఆరోగ్యం అనేది అత్యంతావశ్యకమైనది. ప్రస్తుతం మనుషులు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న ‘‘తీపి’’ ముప్పు డయాబెటిస్.
యావత్తు ప్రపంచం ఇప్పుడు మధుమేహం (షుగర్)తో బాధపడుతోంది. పిల్లలు, పెద్దలు అంతా దీని బాధితుల జాబితాలో చాలా వేగంగా చేరిపోతున్నారు. ఏ దేశంలో, ఏ ప్రాంతంలో చూసినా డయాబెటిస్ వ్యాధి అత్యంత వేగంగా విజ•ంభిస్తోంది. అయితే దీనికి చికిత్సలు ఉన్నా.. దీర్ఘకాలం నియమబద్ధంగా పొందితేనే వ్యాధి కొంత నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్‍లో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో గెస్టేషనల్ డయాబెటిస్ ఒకటి. ఇది గర్భిణులకు ఎక్కువగా వస్తుంది. గర్భం దాల్చిన ప్రతి స్త్రీ దీని బారిన పడటం చాలా సహజం. అయితే పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే మాత్రం గర్భిణులు కొన్ని నియమాలను పాటించాలని నార్త్ అట్లాంటా ఉమెన్స్ కేర్ వైద్యురాలు డాక్టర్ సుజాత చెబుతున్నారు. అవేమిటో చదవండి.
3 ఇటీవల గెస్టేషనల్ డయాబెటిస్‍పెరుగుదల వేగంగా ఉంది. 35 ఏళ్లు దాటిన తరువాత గర్భం దాల్చే వారిలో ఊబకాయం, అధిక బరువు పెరగడం వంటివి వేగంగా సంభవిస్తుంటాయి.
3 గర్భాశయ మధుమేహానికి జిటిటి అనే స్క్రీనింగ్ టెస్ట్ చేయడం వల్ల వ్యాధి లక్షణాలు ఉన్నాయో లేదో తెలుస్తుంది.
3 ఒకవేళ సమస్య ఉన్నట్లు గుర్తిస్తే ఆకలి, యూరిన్ సమస్యలు, బలహీనతలు వంటి సమస్యలు పెరుగుతాయి.
3 ఇటువంటి లక్షణాలు కనిపించిన గర్భిణులు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
3 గర్భధారణ సమయంలో బరువును కోలమానంగా తీసుకుంటారు.
అలాగే తీసుకునే ఆహారంపైనా శ్రద్ధ వహించాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఉండే కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. కొవ్వు పదార్ధాల జోలికి అసలు వెళ్లకూడదు.
గర్భిణులకు చికిత్స అందించడంలో నార్త్ అట్లాంటా ఉమెన్స్ కేర్ హాస్పిటల్ అందరి మన్ననలు పొందుతోంది. మీకు గెస్టేషనల్ డయాబెటిస్ ఉందనే అనుమానం ఉందా..? వెంటనే నార్త్ అట్లాంటా ఉమెన్స్ కేర్ హాస్పిటల్‍ను సంప్రదించండి.
Review గర్భణీలకు వచ్చే గెస్టేషనల్ డయాబెటిస్.. నియంత్రణ పద్ధతులు.