వావింటి చెట్టు సమూలం నీటిలో నూరి ముద్దచేసి నువ్వుల నూనెలో ఉడికించి ఆ నూనెను రాసుకుంటే అన్ని రకాల చర్మ రోగాలు నశిస్తాయి.
వేపచెట్టు బెరడుతో చేసిన కషాయాన్ని తీసుకుంటే చర్మరోగాలు నయమవుతాయి.
మెట్ట తామరాకు పసరు, నిమ్మకాయ రసం కలిపి పూస్తే సాధారణ చర్మరోగాలు దరిచేరవు.
నేలవేము ఆకు కషాయం చర్మరోగాలకు బాగా పనిచేస్తుంది.
మోదుగ విత్తనాలు నిమ్మరసంతో కలిపి అరగదీయగా వచ్చిన ద్రవాన్ని చర్మరోగాలకు మందుగా సేవించవచ్చు.
నల్ల ఉమ్మెత్త రసం చర్మ సమస్యలు ఉన్న చోట పూయవచ్చు.
కొబ్బరినూనెలో గంధకం పొడిని కలిపి పూస్తే చర్మరోగాలు హరిస్తాయి.
పచ్చ గన్నేరు వేరుపైన గల పొరను నేతిలో వేయించి, కాచి ఆ తైలాన్ని రాసుకుంటే చర్మరోగాలు దరిచేరవు.
కసివిందాకు రసం రాసుకుంటే గజ్జి, తామర, చిడుము వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి.
జిల్లేడాకు రసం, ఆవనూనె, పసుపు కలిపిన మిశ్రమాన్ని వివిధ చర్మరోగాలకు ఔషధంగా వాడవచ్చు.
నల్లజీలకర్ర, నీలి ఆకులు కలిపి మెత్తగా నూరి చర్మంపై రాస్తే కరుపులు, గడ్డలు వంటివి హరిస్తాయి.
పనస చెట్టు ఆకుల రసం చాలా రకాలైన చర్మవ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.
తాటికల్లులో బియ్యపు పిండి కలిపి పులియబెట్టి రాస్తే చీము పొక్కులు వంటివి నశిస్తాయి.
Review చర్మ సమస్యలు.. ఆయుర్వేద పరిష్కారం.