ఆరోగ్యకరమైన జీవనానికి ఆధ్యాత్మికతకు దోహదం చేస్తుంది. మన రోజువారీ జీవితానికి కొన్ని ఆధ్యాత్మిక సూత్రాలను జోడించి, పాటిస్తే.. జీవనం మెరుగుపడుతుంది. జీవనం మెరుగుపడితే ఆరోగ్యం ఒనగూరుతుంది. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే..
2 ఉదయం నిద్ర లేచిన వెంటనే భగవంతుడికి, తల్లిదండ్రులకు నమస్కరించాలి.
2 నిద్ర లేచిన వెంటనే పళ్లు తోముకోకుండా, రెండు గ్లాసుల గోరు వెచ్చని నీళ్లు తాగాలి.
2 బరువు తగ్గాలి అనుకుంటే పరగడుపున తాగే నీటిలో కొంచెం నిమ్మరసం, తేనె వేసుకోవాలి.
2 మల విసర్జన సమయంలో పళ్లను గట్టిగా నొక్కి పట్టడం వలన వృద్ధాప్యంలో కూడా
పళ్లు గట్టిగా ఉంటాయి.
2 దంతధావన సమయంలో చల్లని నీటిని నోటి నిండా తీసుకుని పుక్కిలిస్తూ చల్లని నీటిని రెండు చేతులతో కళ్లపై చల్లుకుంటే కళ్ల ఆరోగ్యం బాగుంటుంది.
2 స్నానం చేసే నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపితే వంటి దుర్గంధం తగ్గుతుంది. తాజాదనపు అనుభూతి కలుగుతుంది.
2 ఆరోగ్యమైన జీవితం కోసం సాత్విక, ప్రాకృతిక, సహజ ఆహారం తీసుకోవాలి.
2 శరీర సమతుల్యం, శక్తి, చర్మ సౌందర్యం కోసం రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీటినైనా తాగాలి.
2 నీరు ఎప్పుడు తాగినా కూర్చునే తాగాలి. అందువలన మోకాళ్ల నొప్పి రాదు.
2 దీర్ఘ కాల ఉపవాసం అనారోగ్యకరం.
2 ఉపవాసం వలన శరీరంలోని మలినాలు (ట్యాక్సిన్స్) బయటకు వెళ్లిపోతాయి.
2 సామర్థ్యాన్ని అనుసరించి, అవసరం అయినంత మేరకు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి.
2 అధికమైన ఆహారం అజీర్ణం కలుగచేస్తుంది. అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
2 రోజూ సకాలంలో ఆహారాన్ని తీసుకోవాలి. అందువలన జీవన గడియారం సక్రమంగా ఉంటుంది.
2 భోజనాన్ని కింద కూర్చుని తినడం ఉత్తమ అలవాటు. డైనింగ్ టేబుల్ వాడుతూ ఉంటే కనుక కుర్చీలో మఠం వేసుకుని కూర్చుని తినడం ఉత్తమం.
2 భోజనం చేస్తూ మాట్లాడకూడదు. అన్నం భగవత్ ప్రసాదం. కాబట్టి మొదటి ముద్ద ఆయనకు సమర్పించి ఆ తరువాత మనం తినడం అలవాటు చేసుకోవాలి.
2 టీవీ చూస్తూ, పేపర్ చదువుతూ భోజనం చేయరాదు.
2 ఇత్తడి బిందెలోని నీరు తాగడం మంచిది. రాగి బిందె నీరు వరుసగా మూడు నెలల పాటు తాగితే మధ్యలో ఒక నెల విరామం ఇవ్వాలి.
2 భోజనం చివరిలో శీతల పానీయాలు, ఐస్‍క్రీములు వంటి చల్లని పదార్థాలు తినకూడదు.
2 వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోండి. అది మీకు నడుము నొప్పి రాకుండా చేస్తుంది.
2 ఉదయం అల్పాహారంలో మొలకలు (పీచు పదార్థాలు)ఉండేలా చూసుకోండి. పండ్లను తీసుకోండి. సలాడ్లు తినండి.
2 భోజనంలో ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ ఉండేలా చూసుకోండి. నూనెలు తగ్గించి బదులుగా ఆవు నెయ్యి వాడండి. అది బరువును పెంచదు.
2 ఉప్పు, నూనె, కారం ఆహారానికి రుచిని కలిగించే మాట వాస్తవమే అయినా, అవి అనారోగ్యాన్ని కూడా చేకూరుస్తాయి.
2 ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తే జీవితం ఆనందమయమవుతుంది.
2 నిద్రకు మెత్తటి పరుపులు, ఎత్తు ఎక్కువ ఉన్న తలగడలు హాని కలిగిస్తాయి.
2 ఎడమ వైపు తిరిగి పడుకోవడం శ్రేయస్కరం.
2 వ్యాధి రహిత జీవనానికి మానసిక శాంతి అవసరం. ఆనందంగా ఉండటానికి ప్రయ త్నించాలి.
2 నిన్నటి విచారం, రేపటి ఆందోళన నేటి జీవితంలోని ప్రశాంతతను చెదరగొడతాయి.
2 చింత, ఆందోళన అనేవి హృద్రోగాలకు దారితీస్తాయి.
2 పెద్దలతో, పిల్లలతో ఆప్యాయంగా ఉండాలి.
Review దారి చూపే దైవం.