పత్రం..ఆరోగ్యం ‘భద్రపదం’

వినాయక చవితి నాడు ముఖ్యంగా ఇరవై ఒక్క (21) రకాల పత్రులతో వినాయకుడిని పూజిస్తారు. వినాయక చవితి పూజలో పూల కంటే పత్రాలకే ప్రాముఖ్యం ఎక్కువ. ఈ పత్రాలన్నీ మంచి ఓషధీ గుణాలు కలవి. అందుకనే మన పూర్వీకులు ఆలోచించి, అందరి ఆరోగ్యాన్ని కాపాడటానికి గాను వీటిని పూజా ద్రవ్యాలుగా నిర్ణయించారు. జీవితంలో వేగం పెరగడంతో పండుగలు కూడా తూతూ మంత్రంగా సాగిపోతున్నాయి. ప్రస్తుతం పచ్చగా కనిపించే ప్రతి గడ్డినీ పత్రిగా విక్రయించే ధోరణి కూడా కనిపిస్తోంది. వినాయక చవితి నాడు ఇరవై ఒక్క రకాల పత్రాలను, అంటే ఆకులను పూజా ద్రవ్యాల్లో వినియోగిస్తాం. వాటి పేర్లు, ఉపయోగాలు, వాటిల్లో ఉండే ఓషధ విలువల గురించి తెలుసుకుందాం

1. మాచీ పత్రం
దీనిని మాచిపత్రి అంటారు. దీని కషాయం దద్దుర్లు తగ్గించడానికి, వ్రణాలకు వాడతారు. ఇది కుష్టువ్యాధికి మంచి మందుగా పని చేస్తుంది. నరాలకు సత్తువనివ్వడంలో మంచి టానిక్కు. తలనొప్పులను, వాతం నొప్పులను తగ్గిస్తుంది. కళ్లకు చలువ చేస్తుంది. పొట్టకు బలం చేకూరు స్తుంది. మానసిక వికాసానికి తోడ్పడుతుంది.

2. బృహతీ పత్రం
దీనిని మన వాడుక భాషలో వాకుడాకు అంటారు. ఇది ఒక రకమైన ముళ్లచెట్టు. ఉబ్బు, శ్వాసకోశ వ్యాధులు, శ్లేష్మము, క్షయ, ఉబ్బసపు దగ్గు, తాపములను తగ్గిస్తుంది. ఇది హృద్రోగాలకు మందు. వీర్యవృద్ధిని కలిగిస్తుంది.

3. బిల్వ పత్రం
దీనిని మారేడు లేక బిలిబిత్తిరి అనే పేర్లతోనూ పిలుస్తారు. బిల్వ పత్రం త్రిదళం. ఇది శివునికి మిక్కిలి ప్రీతిపాత్రమైనది. బిల్వాష్టకం దీని విలువ లకు తార్కాణం. దీని పండ్ల గుజ్జు బంకలా పని చేస్తుంది. దీన్ని చాటలకు పూస్తారు. చాటలు, ఇతర వెదురు వస్తువులు పుచ్చు పట్టకుండా ఇది పనిచేస్తుంది. బంక విరేచనాలను తగ్గిస్తుంది. ప్రతి శివాలయంలో బిల్వ చెట్లను పెంచుతారు.

4. గరిక
ఇది ఎత్తుగా పెరిగే గడ్డి. దీనిని ఎన్నో ఓషధీ విలువలు ఉన్నాయి. పశువులకు ఇది శ్రేష్ఠమైన ఆహారం. కొద్ది గరికకు ఒక ఉప్పురాయి, చిటికెడు పసుపు వేసి నూరి కట్టు కడితే ఎదురు దెబ్బల గాయాలు మానుతాయి. ఇంకా గరిక ఉప యోగాలు, దీనిలోని ఔషధ విలువల గురించి చెప్పుకోవాలంటే పేజీలు స్థలాభావం రీత్యా సాధ్యం కాదు. అంటే, అంత ప్రశస్తమైనది గరిక. క్లుప్తంగా చెప్పుకోవాలంటే- ఎంతటి తాప (వేడి)మైనా గరికతో చల్లారాల్సిందే. గరికతో పచ్చడి కూడా చేసుకుని తింటారు. విదేశాల్లో ప్రస్తుతం గరికతో రొట్టెలు కూడా చేస్తున్నారు. ఇజ్రాయిల్‍లో గరిక అక్కడి ప్రజల ఆహార పదార్థంగా ‘మెనూ’లో ఉంది. గోధుమ, వరి, జొన్నల కంటే గరిక విలు వైనది. పశువులకు గరికను మేతగా వేస్తే సంతాన నిరోధ గుణం పెరుగుతున్నట్టు శాస్త్రజ్ఞుల పరి శోధనలో తేలింది. హోమియోపతిలో గరికతో తయారైన రసాయన ఔషధం నీరసానికి మంచి మందుగా నేడు బాగా వాడుకలో ఉంది. చిడుము, సర్పి తదితర వ్యాధులకు గరిక పోచలను విరుగుడుగా వాడతారు.

5. దుత్తూర పత్రం
దీనిని ఉమ్మెత్త ఆకు అంటారు. ఇందులో నల్ల ఉమ్మెత్త చాలా శ్రేష్ఠమైనది. వీటి ఆకులను ఆముదం రాసి దీపపు సెగ చూపి వెచ్చదనంతో గడ్డలపైన, వ్రణాలపైన వాడటం ద్వారా గడ్డలు, వ్రణాలు పగిలి చీము కారిపోవడానికి ఉప కరిస్తాయి. ఇది లైంగికపరమైన వ్యాధులకు రామ బాణంలా పనిచేస్తుంది.

6. బదరీ పత్రం
దీనిని రేగు ఆకు అంటారు. ఇది జీర్ణకోశ వ్యాధులలో ఉపయోగపడుతుంది. రుచిని పుట్టి స్తుంది. రక్త దోషాలను హరిస్తుంది. బలా న్నిస్తుంది. లేత ఆకుల్ని మిరియపు గింజలతో కలిపి తింటే వీర్య నష్టాన్ని అరికడుతుంది. ఆకుల నురుగు రాస్తే అరికాళ్ల మంటలు, అరిచేతుల మంటలు తగ్గుతాయి.

7. అపామార్గ పత్రం
ఉత్తరేణి అని కూడా అంటారు. ఇది పంటి జబ్బులకు మంచి మందు. ఉత్తరేణి వేరు దంత ధావనకు పెట్టింది పేరు.

8. తులసీ పత్రం
తులసిలోని ఔషధ ప్రాశస్త్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో అనేక రకాలు ఉన్నాయి. వీటిలో కృష్ణ తులసి, విష్ణు తులసి, రామ తులసి వంటి రకాలు ముఖ్యమైనవి. తులసి ఆకులు అజీర్ణ వ్యాధులకు, కడుపు నొప్పికి, పసిపిల్లల గర్భశూలాలకు వాడతారు. ఇది చర్మ వ్యాధులను అరికడుతుంది. తేలు విషాన్ని విరిచేసే గుణం దీనికి ఉంది. యాంటీ సెప్టిక్‍గా ఉపయోగ పడుతుంది. స్త్రీ సౌభాగ్య చిహ్నం తులసి. పసి బిడ్డల పాలిట సంజీవని దీని రసం. నోటి దుర్వాస నను అరికడుతుంది. దోమలను దరిచేరనివ్వని గుణం తులసి ఆకులకు ఉందని తాజా పరి శోధనల్లో తేలింది.

9. చూత పత్రం
మామిడాకునే చూత పత్రం అంటారు. గృహాలంకరణ మొదలు సర్వ మంగళ కార్యాల్లో తోరణంగా ఉపయోగపడుతుంది మామిడాకు. దీని ఆకులతో విస్తరి కుట్టి దానిలో భోజనం చేస్తే రుచి పుట్టిస్తుంది. మేహకారక మంటలను, రక్త అతిసారములను తొలగిస్తుంది.

10. కరవీర పత్రం
దీనిని గన్నేరు ఆకు అంటారు. ఇది కంతులను కరిగిస్తుంది. గడ్డలను రానీయదు. జంతు విషా లను విరగ్గొడుతుంది. దురదలను తగ్గిస్తుంది. దద్దుర్లను, కుష్టును పోగొడుతుంది. తలలో పేలు గలవారు కరవీర ఆకుల రసంతో తల రుద్దుకుంటే పేలు నశించిపోతాయి.

11. విష్ణుక్రాంత
విష్ణుక్రాంతలో రెండు రకాలు ఉన్నాయి. గడ్డి మాదిరిగా నేలపై పాకుతూ విస్తారంగా పెరిగేది ఒకటి. చిన్న మొక్కగా పెరిగేది ఒకటి. వీటికి నీలిరంగులో అతి చిన్న పుష్పాలు పూస్తాయి. విష్ణుక్రాంత పత్రాల కషాయం పైత్య జ్వరాలకు, కఫ జ్వరాలకు, ఉబ్బులకు వాడతారు. వీటి ఆకులు ఎండబెట్టి, ఆకుల పొగ పీలిస్తే రొమ్ము పడిశెం, దగ్గు, ఉబ్బసపు దగ్గు తగ్గుతాయి.

12. దాడిమీ పత్రం
దీనిని దానిమ్మ పత్రం అంటారు. ఇది వగ రుగా ఉండే మంచి ఔషధం. జీర్ణకోశ, మలాశయ వ్యాధుల్లో దీనిని ఉపయోగిస్తారు. నీళ్ల విరేచనాలను తగ్గిస్తుంది. దీని కషాయం ఏలిక పాములను, నాడా పాములను చంపుతుంది. రక్త హీనత (డీసెంట్రీ)ని తగ్గిస్తుంది. నోరుపూత గలవారు దానిమ్మ చిగుళ్లు నమిలితే తగ్గుతుంది.

13. దేవదారు పత్రం
దీని లేత చిగుళ్లు మేహశాంతిని కలిగిస్తాయి. దీని ఆకులతో కాచిన తైలం కళ్లకు చలువ చేస్తుంది. ఆకులు, పువ్వులు కూడా మంచి ఔషధ గుణాలు గలవే.

14. మరువక పత్రం
దీనిని మరువం అని కూడా అంటారు. ఇది మంచి సుగంధ లక్షణం గల ఆకులతో కూడి ఉంటుంది. ఈ సువా సన సమ్మోహన పరుస్తుంది. వీటిని స్త్రీలు తలలో ముడుచుకుంటారు. పూలతో కలిపి మాలలు కడతారు. ఇది జీర్ణశక్తిని పెంచి, ఆకలిని పుట్టి స్తుంది. ఇంద్రియ పుష్టిని కలిగిస్తుంది. దీని తైలం మెదడుకు చలువ చేస్తుంది. జుత్తును రాలనివ్వదు.

15. సింధూర పత్రం
దీనిని వావిలాకు అంటారు. దీని కషాయం జ్వరాలను, జ్వర దోషాలను తొలగిస్తుంది. ఉబ్బు లను, మేహవాతపు నొప్పులను, ఇరుకు నొప్పు లను, కీళ్లవాపులను, కీళ్ల నొప్పులను హరిస్తుంది.

16. జాజి ఆకులు
ఇది వాతానికి, పైత్యానికి మందుగా ఉప యోగపడుతుంది. జీర్ణాశయ, మలాశయ రోగా లకు ఇది మందు. నోటిపూతను, నోటి దుర్వాస నను పోగొడుతుంది. బుద్ధికి బలాన్ని ఇస్తుంది. కామెర్లను పోగొడుతుంది. చర్మ రోగాలకు, మచ్చలకు దీనిని ఔషధంగా వాడతారు. కాలే యానికి బలాన్నిస్తుంది. పక్షవాతాన్ని, తలనొప్పిని నివారిస్తుంది. గవద బిళ్లలకు మందుగా ఉప యోగపడుతుంది. ఇది జాజికాయ, జాపత్రి జాతికి చెందినది. జాజి మల్లె కాదు.

17. గండకీ పత్రం
వినాయక పత్రం అని దీనికి మరో పేరు. ఇది అందరికీ తేలికగా లభించేది కాదు. కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో మాత్రమే పండుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.

18. శమీ పత్రం
దీనినే జమ్మి ఆకు అంటారు. ఇది కఫాన్ని హరిస్తుంది. మూలవ్యాధి, కుష్టు వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది. పాండవులు అజ్ఞాతవాస సమయంలో తమ ఆయుధాలను ఈ చెట్టుపైనే ఒక సంవత్సరం కాలం పాటు దాచి పెట్టారు. ఆ ఆయుధాలు తుప్పు పట్టకుండా ఉండటానికి కారణం శమీ పత్రంలోని ఔషధ గుణాలేనని అంటారు. వినాయక చవితితో పాటు దసరా నాడు కూడా పూజలో శమీ పత్రాలను ఎక్కువగా వినియోగిస్తారు.

19. అశ్వత్థ పత్రం
రావి ఆకు. ఇది జ్వరాలకు, నోటిపూతకు మందుగా ఉపయోగపడుతుంది. రావి పండ్లను ఎండబెట్టి, చూర్ణం చేసి రోజుకు రెండుసార్లు, రెండు చెంచాలు తినిపిస్తే ఆస్తమా తగ్గుతుంది.

20. అర్జున పత్రం
దీనిని మద్ది ఆకు అంటారు. దీనిలో తెల్ల, నల్ల మద్ది రకాలున్నాయి. తెల్లమద్ది మేహశాంతికి, వ్రణాలకు వాడతారు. ఇది విదాహం, చెవినొప్పు లను తగ్గిస్తుంది. దీని ఆకుల రసం ‘రుమాటిజా’నికి మంచి మందు. గాయాలను, వ్రణాలను త్వరగా మాన్పుతుంది. నల్ల మద్ది మలాశయ దోషాలకు మందుగా ఉపకరిస్తుంది. క్రిములను హరిస్తుంది.

21. అర్క పత్రం
దీనిని జిల్లేడు ఆకు అంటారు. దీని ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తే ఎటువంటి విష మైనా హరిస్తుందని ప్రతీతి. తగిన వైద్యుని సల హాతో జిల్లేడు ఆకులను వినియోగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చని ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. ఇంకా మూర్ఛ, పక్షవాత వ్యాధులను పోగొట్టే గుణం ఈ చెట్టు ఆకుల్లో ఉంది.

Review పత్రం..ఆరోగ్యం ‘భద్రపదం’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top