ఆరోగ్యమే మహా భాగ్యం. ఆ భాగ్యం అందరికీ దక్కదు. మనిషన్నాక ఏదో ఒక ఆరోగ్య సమస్య రాక తప్పదు. లేదా రాకుండా జాగ్రత్తపడకా తప్పదు. ప్రజలకు అటువంటి ఆరోగ్య స్ప•హ కల్పిస్తూ వైద్య సేవలందిస్తోంది సాయి హెల్త్ ఫెయిర్. ఇటీవల అట్లాంటాలోని హిందూ టెంపుల్ వద్ద నిర్వహించిన వైద్య శిబిరానికి అక్కడి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
జార్జియా ఇండియన్ నర్సెస్ అసోసియేషన్ (జీఐఎన్‍ఏ) సహకారంతో జార్జియాలోని రివర్‍డేల్‍లో గల అట్లాంటా హిందూ టెంపుల్‍లో 39వ సాయి హెల్త్ ఫెయిర్‍ను ఏప్రిల్ 21న నిర్వహించారు. దీనికి మంచి స్పందన లభించింది. దాదాపు మూడు వందల మందికి పైగా పరిసర ప్రాంతాల ప్రజలు వచ్చి ఈ హెల్త్ ఫెయిర్‍లో వివిధ ఆరోగ్య పరీక్షలు చేయించు కున్నారు. అహింస, సామాజిక సేవకే తమ జీవితాలను అంకితం చేసిన భారత జాతిపిత మహాత్మాగాంధీ, అమెరికా హక్కుల పోరాట నేత మార్టిన్ లూథర్‍కింగ్‍లకు ఘన నివాళి అర్పించిన అనంతరం డాక్టర్ సుజాతారెడ్డి ఈ హెల్త్ ఫెయిర్‍ను ప్రారంభించారు. ఈ ఫెయిర్‍కు జార్జియాకు చెందిన హెల్త్కేర్ నిపుణులు, నర్సులు, వైద్యులు, సంగిశెట్టి చారిటబుల్ ఆర్గ నైజేషన్, బఫలోస్ ఫైర్ పంప్ తదితర సంస్థలు, ప్రముఖులు వెన్నుదన్నుగా నిలిచారు.
సాయి హెల్త్ ఫెయిర్‍లో కేవలం 30 డాలర్ల నామమాత్రపు రుసుముకే దాదాపు 150 వరకు ఖరీదైన రక్త పరీక్షలు నిర్వహించడం విశేషం. టుకర్ ప్రాంతానికి చెందిన సై మెడ్ ఎల్‍ఎల్‍సీ సంస్థ ఈ రక్త పరీక్షలకు అవసరమైన ల్యాబ్ సదుపాయాలను కల్పించింది. రక్త పరీక్షలు చేయించుకున్న వారికి ఫలితాల నివేదికను ఈ-మెయిల్‍కు పంపించే ఏర్పాట్లు చేశారు. ఈ రక్త పరీక్షలు, వాటి ద్వారా తెలిసే ఫలితాల ద్వారా మునుముందు రాబోయే వ్యాధులను తెలుసుకో గలగడంతో పాటు ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవడానికి దోహదం చేస్తాయి. తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవ డానికి వీలవుతుంది. ఇంకా, ఎమోరీ సదరన్ హార్ట్ స్పెషలిస్టులు, గ్విన్నెట్ హార్ట్ స్పెషలిస్టులు దాదా 90కి పైగా ఈకేజీ పరీక్షలు నిర్వ హించారు.
అలాగే, అలబామాలోని అబర్న్ విశ్వ విద్యాలయానికి చెందిన డాక్టర్ శ్రీధర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో దాదాపు 25కి పైగా ఆడియో స్క్రీనింగ్స్ను కూడ సాయి హెల్త్ ఫెయిర్‍లో నిర్వ హించారు. ఎముకల దృఢత్వం, సాంద్రత పరీక్షలు చేయించుకోవడానికి ఈ హెల్త్ ఫెయిర్‍లో ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. 34కి పైగా బోన్ డెన్సిటీ పరీక్షలను మధురెడ్డి ఆధ్వర్యంలోని బృందం నిర్వహించింది. వీటిలో 24 కేసుల అసాధారణమైనవిగా గుర్తించారు. భవిష్యత్తులో ఓస్టియోపెనియా, ఓస్టియోపోరోసిస్ వ్యాధులు రాకుండా ఈ ఎముకల సాంద్రత పరీక్షలు ఉప యోగపడతాయి.
అట్లాంటా ఆర్గనైజేషన్‍కు చెందిన సుసాన్ జి.కోమెన్.. రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, దాని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హెల్త్
••యిర్‍కు వచ్చిన వారికి అవగాహన కల్పిం చారు. వివిధ చిత్రాల ద్వారా అర్థమయ్యేలా వివరించారు. అలాగే, జార్జియా ఇండియన్ నర్సెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విద్య కనగరాజ్ స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్ గురించి అవగాహన కలి గించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అత్యధిక మరణాలకు హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ కారణమవుతున్న వైనాన్ని వివరించడంతో పాటు తీసుకోవడాల్సిన జాగ్రత్తల గురించి వివ రించారు. మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోయి నపుడు రక్త కణాలు మెదడును ఎలా విచ్ఛిన్నం చేస్తాయో సోదాహరణంగా తెలిపారు. సమస్య తీవ్రతను ముందే గుర్తించి తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ ఫెయిర్‍కు వచ్చిన వారిని అప్రమత్తం చేశారు.
ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ హైమవతి మిక్కిలినేని, డాక్టర్ నిమిష్ త్రివేది, డాక్టరన్ శైలా రెడ్డి, డాక్టర్ విజయలక్ష్మి వడ్డిరెడ్డి, డాక్టర్ శైలజా ప్రభాకరన్, కార్డియాలజిస్టులు డాక్టర్ రాజారెడ్డి, డాక్టర్ దేవేంద్ర కోగంటి, ఎండోక్టినాలజిస్ట్ డాక్టర్ స్రవంతి శనివరపు, డెర్మటాలజిస్ట్ డాక్టర్ తులసీ వానపల్లి, ఈఎన్‍టీ స్పెషలిస్టులు డాక్టర్ శ్రీనాథ్ నడిగ, డాక్టర్ తృష్ణారావు, ఓబీ గైనకాలజిస్టు డాక్టర్ సౌమ్యారెడ్డి, ఆప్తమాలజీ నిపుణులు డాక్టర్ ఆరతి పాండ్య, ఆర్థోపెడిక్స్ డాక్టర్ నటరాజన్, డాక్టర్ సర్వేష్ నాయుడు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ కవితా గోపాల్, డెంటిస్ట్లు డాక్టర్ సుప్రతి బాల్యన్, డాక్టర్ స్వాతి కల్లిపల్లి, సైకియాస్ట్రీ డాక్టర్ రోహిణీరెడ్డి, ఆడియాలజీ డాక్టర్ కృష్ణమూర్తి.. వీరంతా సాయి హెల్త్ ఫెయిర్‍కు వచ్చిన పేషంట్లకు ఉచిత సలహా సూచనలను, వైద్య సేవలను సేవాభావంతో, అంకితభావంతో అందించారు.
హెల్త్ ఫెయిర్‍కు వచ్చిన వారికి ఈఎన్‍టీ సర్జన్ డాక్టర్ తృష్ణారావు నడిగ యోగా అవ గాహన తరగతులను నిర్వహించారు. యోగా వలన ఆరోగ్యానికి ఏవిధంగా మేలు కలుగు తుందో వివిధ ఆసనాల ద్వారా వివరించారు.
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెల్త్ సైంటిస్ట్ డాక్టర్ గణేశన్.. హెల్త్ కేర్ అంశా లను, ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్ర త్తల గురించి హెల్త్ ఫెయిర్‍కు వచ్చిన సందర్శ కులు, పేషంట్లకు హిందీ, గుజరాతీ, ఇంగ్లిష్ భాషల్లో వివరించడం విశేషం. రక్వెల్ మెర్సెడ్.. పోషకాహార సంబంధ అంశాలపై అవగాహన కలిగించారు.
సాయి హెల్త్ ఫెయిర్‍కు వచ్చిన వారికి అల్పా హారం, పండ్లు, పానీయాల సదుపాయాలను సాండ్రా జ్యూరిక్ కల్పించారు. చివరిలో ‘సాయి హెల్త్ ఫెయిర్’.. శిబిరానికి విచ్చేసిన వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణులు, వలంటీర్లకు భోజన సౌకర్యాన్ని కల్పించింది.
ఖబర్ మ్యాగజైన్, ఇండియా ట్రిబ్యూన్, ఎన్‍ఆర్‍ఐ పల్స్, తెలుగు పత్రిక, వావ్‍నౌ, రాష్ట్రదర్పణ్, దేశీ ఎక్స్ప్రెస్, అట్లాంటా దునియా తదితర పత్రికలు సాయి హెల్త్ ఫెయిర్‍కు పబ్లిసిటీ కవరేజ్ ఇచ్చాయి. అలాగే మహదేవ్ దేశాయ్, వాసంతి మహదేవన్, రవి పోనంగి మీడియా కవరేజ్‍కు సహకరించడంతో పాటు ఫొటోగ్రఫీ సేవలను అందించారు.
చివరిలో, జార్జియా ఇండియన్ నర్సెస్ అసో సియేషన్ (జీఐఎన్‍ఏ) ప్రెసిడెంట్ విద్య కనగ రాజ్ మాట్లాడుతూ, ‘డాక్టర్ సుజాతరెడ్డి, సాయి హెల్త్ ఫెయిర్‍తో కలిసి సేవల్లో పాలుపంచు కోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నాం. మును ముందు సాయి హెల్త్ ఫెయిర్ అందించే అన్ని వైద్య సేవలకు, ఫెయిర్లకు జీఐఎన్‍ఏ తరపున తమవంతు సహకారాన్ని కొనసాగిస్తాం’ అని ప్రకటించారు.
డాక్టర్ సుజాతరెడ్డి మాట్లాడుతూ సాయి హెల్త్ ఫెయిర్‍లో విశేష సేవలందించిన జీఐఎన్‍ఏ, ఇతర అందరు వైద్యులు, నర్సులు, టెక్నీ షియన్స్, వలంటీర్లకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమష్టి కృషితో సాయి హెల్త్ ఫెయిర్ విజయవంతం అయినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ‘ఆరోగ్యంపై శ్రద్ధతో, జాగ్రత్తతో శిబిరానికి వచ్చి వైద్య పరీక్షలు, స్క్రీనింగ్స్ చేయించుకున్న, ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్న వారందరికీ అభినందనలు. భవిష్యత్తులో కూడా సాయి హెల్త్ ఫెయిర్ వివిధ వేదికల ద్వారా విజయవంతంగా వైద్య సేవలను అందిస్తుందని చెప్పడానికి ఆనందిస్తున్నాను’ అని డాక్టర్ సుజాతరెడ్డి తెలిపారు.
Review సాయి హెల్త్ ఫెయిర్ అందరికి హెల్త్ కేర్.