అట్లాంటాలో క్రికెట్ సందడి

క్రికెట్‍పై ఉన్న మక్కువ ఖండాంతరాలు దాటింది. ముఖ్యంగా మన భారతీయుల గురించి చెప్పనవసరం లేదు. క్రికెట్‍కు
ఉన్న క్రేజ్‍ అలాంటిది. ఆగష్టు 15 భారత స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఇండియన్‍ ఫ్రెండ్స్ ఆఫ్‍ అట్లాంటా ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ కప్‍ నిర్వహించారు. ఆగష్టు రెండోవారంలో జరిగిన ఈ ట్వంటీ-ట్వంటీ మ్యాచ్‍లకి కమ్మింగ్‍లోని కేథ్‍బ్రిడ్జ్ రోడ్‍ క్రికెట్‍ గ్రౌండ్స్ వేదికైంది. ఈ ట్వంటీ•-ట్వంటీ• క్రికెట్‍ పోటీల్లో మొత్తం 24 గ్రూపులు పాల్గొన్నాయి. ఈ ట్వంటీ-ట్వంటీ మ్యాచ్‍లో •తెలంగాణ ఫైటర్స్, గోవా టోర్నడోస్‍ టీమ్‍లు ఫైనల్‍కు చేరుకున్నాయి. ఫైనల్‍ మ్యాచ్‍లో తెలంగాణ ఫైటర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. సిక్సులు, ఫోర్లు కొడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది. అనంతరం లక్ష్యఛేదనలో భాగంగా రంగంలోకి దిగిన గోవా టోర్నడోస్‍.. 19 ఓవర్లలో 91 పరుగులు చేసి ఆలౌట్‍ అయింది. ఈ సందర్భంగా ఐఎఫ్‍ఏ విజేత తెలంగాణ ఫైటర్స్ జట్టుతో పాటు రన్నరప్‍ గోవా టోర్నడోస్‍ జట్టుకు పటేల్‍ బ్రదర్స్, సువిధ గ్రోసరీస్‍, jhalak.com ,EIS టెక్నాలజీస్‍ బహుమతులు అందజేశారు. అనంతరం ఆగష్టు చివరివారంలో ఐఎఫ్‍ఎ ఫ్రీడమ్‍ మేలా ఈవెంట్‍ అట్టహాసంగా జరిగింది. ఈ మేలాలో 24 జట్లకు చెందిన క్రికెటర్లు, వేలాదిమంది అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ మేలాకు ముఖ్య అతిధిగా హాజరైన భారత క్రికెటర్‍ పార్థీవ్‍ పటెల్‍ ఇండిపెండెన్స్ డే కప్‍ను విజేత జట్టు సహా పలువురు క్రికెటర్లకు అందజేశారు.

Review అట్లాంటాలో క్రికెట్ సందడి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top