
భారతదేశ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు బీజేపి ప్రభుత్వం క•షి చేస్తోందని తెలంగాణ బీజేపి కిసాన్ మోర్చా అధ్యక్షుడు, చీוజువీ సంచాలకుడు గోలి మధుసూధన్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన జార్జియా పర్యటనలో భాగంగా అట్లాంటాలో పర్యటించారు. స్థానిక బిర్యానీ పాట్లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో గోలి మధుసూధన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపి నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎరువుల ధరలు తగ్గించిందన్నారు. దేశంలో నదుల అనుసంధానం చేసిన ఘనతే తమేదనన్నారు. ప్రవాసాంధ్రులు స్వదేశానికి చేస్తున్న మేలు అంతాఇంతా కాదన్న ఆయన వారికి అన్నివిధాల తోడ్పాటునందిస్తామని చెప్పారు. మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేస్తున్న పథకాలను వివరించారు. ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ బీజేపి నేతలు నందా చాట్ల, హరి పులిజల, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపి జనరల్ సెక్రెటరి వాసుదేవ్ పటేల్ సహా ATA, GATA, TATA, TANA, TAMA, GATeS, NATA సంఘాల నేతలు పాల్గొన్నారు.
Review అట్లాంటాలో గోలి మధుసూదన్ రెడ్డి పర్యటన.