ఆడదే అధారం, ఆరంభం, సంతోషం, సంతాపం అని అన్నాడో కవి. నిజంగా చెప్పాలంటే ఒక మనిషి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుదన్నమాట యెంత నిజమొ.. అలాగే పురుషిని వ్యక్తిత్వ నిర్మాణంలో స్త్రీ పాత్ర మాత్రం ఉంటుదన్నది నిజం. అయితే ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఒకటి రెండూ కాదు. అలాంటి వారిని అక్కున చేర్చుకుంటోంది పరమ పూజ్య దీదీమా సాద్వి రితంభరాజి. ది హిందూ ఉమెన్స్ నెట్‍వర్క్ ఆధ్వర్యంలో అట్లాంటా చాప్టర్‍లో 4వ వార్షిక హిందూ మహిళా కాన్ఫరెన్స్లో దీదీమా పాల్గొన్నారు. ఇందుకు జార్జియాలోని నార్కోస్ గార్డెన్ ప్లాజా హోటల్ వేదికైంది. అనంతరం దీదీమా మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆరోగ్యం, సంబంధాలు, ఆర్థిక ప్రణాళిక, ఆధ్యాత్మికత తదితర సమస్యల పరిష్కారపై ప్రవచనాల రూపంలో వెల్లడించారు. అలాగే మహిళల జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, వాటి అనుభవాలను అక్కడికి వచ్చిన వారితో పంచుకొని పలు సలహాలు, సూచనలు చేశారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రవచనాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న దీదీమా.., సమాజంలో నిరాశ్రయులైన మహిళలు మరియు అనాధపిల్లలను చేరదీస్తూ తమ సంస్థ వత్సాలయ గ్రామ్‍లో వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. అంతేకాదు వారికి సంవిద్ గురుకులం స్కూల్ ఏర్పాటు చేసి విద్యాబోధన, మహిళలకు వొకేషనల్ ట్రేయినింగ్ అందిస్తున్నారు. దీదీమా శాంతి, సామరస్యాన్ని ప్రోత్సహించడానకి భక్తి ప్రవచనాలు బోధిస్తారు. నిజానికి పూజ్య ఆచార్య మహామండలేశ్వర్ యుగపురుష స్వామి మరియు పరమానంద గురూజి మహరాజ్ యొక్క ప్రేరణతో ఆమె ఆథ్యాత్మికవేత్తగా మారారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది ఔత్సాహికులు పాల్గొన్నారు.
అట్లాంటా హిందు ఉమెన్స్ కాన్ఫరెన్స్

Review అట్లాంటా హిందు ఉమెన్స్ కాన్ఫరెన్స్.