అమెరికాలోను హవా నడుస్తున్న ఆటగాధరా శివ

‘ఆటగదరా శివ’… తెలుగులో ఓ కొత్త హీరోతో రూపుదిద్దుకున్న సినిమా ఇది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం తెలుగునాటే కాదు, అమెరికాలోనూ విజయ వంతంగా నడుస్తుంది.
పైగా ఈ సినిమా పాటలను పవర్‍స్టార్‍ పవన్‍ కల్యాణ్‍ విడుదల చేయడం… ఈ సినిమా హీరో
ఉదయ్‍శంకర్‍ తండ్రి గాజుల శ్రీరాం తన ఆధ్యాత్మిక గురువు గారని చెప్పడంతో ఈ సినిమా హీరో మామూలోడు కాదని అందరికీ అర్థమైపోయింది. పవన్‍కల్యాణ్‍ ఇలా ప్రకటించిన కొద్దిసేపటికే అటు అమెరికాలోని తెలుగువారు, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల వారు గూగుల్‍ సెర్చ్ మొదలుపెట్టారు.
ఎవరు శ్రీరాం? ఉదయ్‍ శంకర్‍ నేపథ్యం ఏమిటి? అని ఆరా తీసే పనిలో పడ్డారు. ఈ చిత్ర కథానాయకుడు ఉదయ్‍శంకర్‍ విషయానికి వస్తే… బెంగుళూరులో డెంటిస్ట్ కోర్సు చదువుతున్న సమయంలో సినిమాలపై ఎపెక్షన్‍ పెంచుకున్నాడు. వెంటనే హైదరాబాద్‍లోనే మధు ఫిల్మ్ ఇన్‍ స్టిట్యూట్‍లో చేరిపోయాడు. తొమ్మిది సంవత్సరాల శిక్షణతో ‘ఆటగదరా శివ’తో వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇంతకు ముందు రవితేజ ‘పవర్‍’, రజనీకాంత్‍ ‘లింగ’ సినిమాల్లో చిన్న పాత్రలు వేశాడు. ప్రముఖ నిర్మాత రాక్‍లైన్‍ వెంకటేశ్‍ ఉదయ్‍శంకర్‍ హీరోగా ‘ఆట గదరా శివ’ నిర్మించారు. పోస్టర్లు, ప్రచారచిత్రాలు, సినిమా రిలీజ్‍ వేడుక… ఈ వేడుకకు పవన్‍కల్యాణ్‍ హాజరుకావడం వంటి విశేషాలు ‘ఆటగదరా శివ’ను విజయవంతం చేశాయి. పవన్‍కల్యాణ్‍ ‘ఎట్టాగయ్యా శివయ్యా’ అనే పాటను విడుదల చేశారు. చైతన్య ప్రసాద్‍ సాహిత్యం ఈ పాటలో మెరిసింది.
ఇంతకీ ఏమిటీ చిత్రకథ?
ఈ సినిమాలో హీరో ఓ ఖైదీ. ఉరిశిక్ష పడు తుంది. అయితే బతకాలనే ఆరాటం అతనిది. జైలునుంచి తప్పించుకుని పరారవుతాడు. విచిత్రంగా తనని ఉరి తీసే తలారినే అను కోకుండా కలుస్తాడు. కానీ ఇద్దరూ ఒకరికొకరు తెలియదు. ఇద్దరూ కలిసే ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఎందాకా సాగింది? చివరికి ఏమైందో తెలియాలంటే స్క్రీన్‍పై చూడాల్సిందే. చదవడానికి చాలా ట్విస్ట్గా ఉన్న ఈ కథ… ఇక వెండితెరపై ఎలా ఆవిష్కరించారనేది డిస్కషన్‍ పాయింట్‍గా మారింది. ‘ఆ నలుగురు’ వంటి ఆలోచనాత్మక చిత్రాలను రూపొందించిన చంద్రసిద్ధార్థ ఈ సినిమాకు దర్శకుడు కావడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
ట్రైలరే ఒక థ్రిల్లింగ్‍…
‘సమయానికి వచ్చేది దేవుడు కాదు… యముడు’ ఇదీ ఈ చిత్ర ట్రైలర్‍ సందర్భంగా వి(క)నిపించే మొదటి డైలాగ్‍. ఎంతో తాత్వికంగా, ఆలోచింపచేసేలా ఉన్న ఈ డైలాగ్‍ ప్రస్తుతం తెలుగునాట ఊపేస్తుంది.
ఎవరి జీవితంలోనైనా తప్పించుకోలేనిది ‘చావు’ మాత్రమే. అది తెలిసినా చావంటే అందరికీ భయమే. అది తొందరగా రాకూడదని కోరు కుంటారు. అటువంటి మానసికస్థితి కలిగిన హీరో కూడా తనకు పడిన ఉరిశిక్షనుంచి తప్పించు కోవాలని చూస్తాడు. ఈ ప్రయత్నంలో జరిగే విశేషాలే క్లుప్తంగా ఈ సినిమా కథ. మనం నిజ జీవితంలో ‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు’ అని అంటాం. ఏం జరిగినా ఆ సర్వేశ్వరుడి లీలే అని అనుకుంటాం. ఆ తాత్వికతే ఈ చిత్రకథకు మూలాధారమని చిత్ర దర్శకుడు చందస్రిద్ధార్థ చెబుతున్నారు.
నా ఆలోచనలకు తగిన కథ…
‘‘నాకు చిన్నతనం నుంచీ పుస్తక పఠనం అంటే ఇష్టం. నా ఆలోచనలకు తగిన కథతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నా. ఈ సినిమాలో ఖైదీగా కనిపించాలి కాబట్టి పదకొండు నెలలపాటు సహజత్వం కోసం గడ్డం, మీసాలు పెంచాను. ‘పిక్నిక్‍కి వచ్చినట్టు ఫీలవ్వు, షూటింగ్‍గా భావిం చకు’ అని సెట్‍లోకి అడుగు పెట్టిన తొలిరోజే చంద్రసిద్ధార్థ ధైర్యం చెప్పారు. ‘నిన్నో విభిన్నమైన పాత్రతో సినిమా రంగానికి పరిచయం చేస్తా’నని రాక్‍లైన్‍ వెంకటేశ్‍ ఈ చాన్స్ ఇచ్చారు. భావో ద్వేగాలు పండించడంలో చంద్రసిద్ధార్థ శైలే వేరు. ఇప్పుడీ చిత్రం విడుదలైన ప్రతిచోటా విజయ వంతంగా నడుస్తుండడం, ఈ సినిమా చూసిన వారంతా ‘కొత్తోడైనా భలే చేశాడ్రా’ అంటుంటే నాకు చాలా ఆనందంగా ఉందంటూ’’ తన మన సులో మాట పంచుకున్నాడు ఉదయ్‍శంకర్‍.
ఇదీ ఉదయ్‍శంకర్‍ నేపథ్యం…
ఉదయ్‍శంకర్‍ది మహబూబ్‍నగర్‍ జిల్లా. నాన్న గారి పేరు గాజుల శ్రీరాం. ప్రభుత్వ పాలిటెక్నిక్‍ కళాశాలలో ఆయన ఇంగ్లీష్‍ ప్రొఫెసర్‍. ఆధ్యాత్మిక, తాత్విక రచనలు చేయడంలో శ్రీరాంది అందెవేసిన చేయి. ఎటువంటి సినీనేపథ్యం లేదు. ఉదయ్‍ శంకర్‍కు పవన్‍ కల్యాణ్‍ అంటే పిచ్చి. ‘తొలిప్రేమ’, ‘బద్రి’, ‘ఖుషి’ సినిమాలు చూసి… ఆయనకు
ఉన్న అభిమానులు చూసి… తనూ హీరో కావా లనుకున్నాడు. మొదటిసారి దాసరినారాయణ రావుగారి ‘యంగ్‍ ఇండియా’లో ఏడు నిమిషాలు తెరపై తళుక్కుమన్నాడు. తరువాత అవకాశాల కోసం తిరిగినా లభించలేదు. రాక్‍లైన్‍ వెంకటేశ్‍తో పరిచయం… నాలుగేళ్ళుగా ఆయనతో కలిసి చేసిన జర్నీ… ఇక్కడివరకు తీసుకొచ్చింది. కన్నడంలో హిట్టయిన ‘రామా రామారే’ సినిమా ఒకసారి చూడాలని వెంకటేశ్‍ సూచించారు. అటువంటి కథతోనే హీరోగా ఎంటర్‍ అవ్వాలని భావించిన ఉదయ్‍శంకర్‍ ఈ ‘ఆటగదరా శివ’లో హీరోగా మెప్పించి తనేంటో నిరూపించుకున్నాడు.

Review అమెరికాలోను హవా నడుస్తున్న ఆటగాధరా శివ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top