తెలుగువారు, భారతీయులు గర్వపడే విషయమిది. అమెరికా తపాలా శాఖ దీపావళిని పురస్కరించుకుని ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. సంప్రదాయబద్ధంగా వెలుగొందుతున్న దీపపు ప్రమిద.. బంగారు కాంతుల వర్ణరంజిత నేపథ్య వర్ణంగా వెలువడిన ఈ స్టాంపు ఎంతో ఆకర్షిణీయంగా ఉంది. ‘జోయస్ హిందు ఫెస్టివల్ ఆఫ్ దివాళి విత్ ఏ ఫరెవర్’ పేరుతో దీన్ని విడుదల చేశారు. అక్టోబరు 5న న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో అంకిత ఆవిష్కరణోత్సవాన్ని ఘనంగా నిర్వ హించనున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా నిలిచే దీపావళికి పోస్టల్ స్టాంపును విడుదల చేయడం ఆనందంగా ఉందని అమెరికాలోని తపాలా శాఖ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఈ మేరకు ఆ శాఖ పోస్టల్ స్టాంపు నమూనాను విడుదల చేసింది. అక్టోబరు 29న దీపావళి వేడుకలు తెలుగునాట జరగనున్నాయి. అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయులకు ఈ పోస్టల్ స్టాంపు విడుదల గర్వకారణంగా నిలిచే అంశమని, ఇది అరుదైన గుర్తింపు అని ప్రవాస భారతీయులు వ్యాఖ్యానించారు.
అమెరికాలో ‘దీపావళి’ పోస్టల్ స్టాంప్

Review అమెరికాలో ‘దీపావళి’ పోస్టల్ స్టాంప్.