అమెరికాలో భారత ధ్రువతార

అమెరికాలో ‘రైజింగ్‍స్టార్‍’గా పేరొందిన నిక్కీహేలీని విశిష్ట పదవి వరించింది. దీని ద్వారా భారత్‍ ఖ్యాతి అంతర్జాతీయ సమాజంలో మరింత ఇనుమడించింది. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయభారిగా ఆమె నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె దక్షిణ కరొలినా గవర్నర్‍గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అనేక అంశాలపై స్పష్టంగా మాట్లాడగల చాతుర్యం నిక్కీహేలీ సొంతం. రిపబ్లికన్‍ పార్టీకి చెందిన ఆమె భారత్‍లోని పంజాబ్‍ రాష్ట్రం నుంచి వచ్చిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. నిక్కీ 1972, జనవరి 20న జన్మించారు. తండ్రి అజిత్‍సింగ్‍ రణ్‍దవా, తల్లి రాజ్‍కౌర్‍. నిక్కీ అసలు పేరు నిమ్రిత. కానీ సంతానంలో చిన్న అమ్మాయి కావడంతో ముద్దుగా ‘నిక్కీ’ అని పిలిచే వారు. ఆ పేరుతోనే ఆమె అంతర్జాతీయంగా పేరు గడించారు.

దక్షిణ కరొలినా రాష్ట్రంలోని బాంబెర్గ్లో నిక్కీ కుటుంబం స్థిరపడింది. రాజకీయాల్లో ప్రవేశించిన నిక్కీ రిపబ్లికన్‍ పార్టీలో చేరారు. 2010లో దక్షిణ కరొలినా గవర్నర్‍గా ఎన్నికయ్యారు. 2014లో తిరిగి గవర్నర్‍గా ఎన్నికయ్యారు. 2005-2011 మధ్య అక్కడి రాష్ట్ర ప్రతినిధుల సభలో లెక్సింగ్‍టన్‍ కౌంటీ నుంచి ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. రిపబ్లికన్‍ పార్టీలో నిక్కీని రైజింగ్‍ స్టార్‍గా పిలుస్తారు. భవిష్యత్తులో ఆమెకు అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేసే అర్హత ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2012లో అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఆమె పేరును పరిశీలించినట్టు పార్టీ వర్గాలు చెబుతుంటాయి. 2016లోనూ ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీలోని కీలక నాయకులు ప్రతిపాదించడం విశేషం. అయితే నిక్కీ అందుకు ఆసక్తి కనబరచలేదని అంటారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె చివరి నిమిషంలో రిపబ్లికన్‍ పార్టీ అభ్యర్థి ట్రంప్‍ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. పరిపాలనలో నిక్కీది ప్రత్యేక ముద్ర. 2014 గవర్నర్‍ ఎన్నికల్లో ఆమె రెండోసారి భారీ మెజారిటీతో గెలుపొందారు. గవర్నర్‍ ఎన్నికల్లో ఆమెకు ఎక్కువ ఓట్లు లభించడం ఓ రికార్డు. మైనార్టీ వర్గానికి చెందినప్పటికీ నిక్కీ మెజార్టీ ప్రజల మనసు గెలుచుకున్నారంటే, అందుకు ఆమె పరిపాలనా చాతుర్యమే కారణం. రిపబ్లికన్‍ పార్టీలో కీలక బాధ్యతలో ఉన్న తనకు హిల్లరీ క్లింటన్‍ ఆదర్శమని నిక్కీ చెబుతుంటారు. 2003లో హిల్లరీ ఇచ్చిన ప్రసంగం స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లో ప్రవేశించానని ఆమె అంటారు. పరిపాలనలో తనకు ఆదర్శం బ్రిటన్‍ మాజీ ప్రధాని మార్గరెట్‍ థాచర్‍ అని నిక్కీ చెబుతారు. అమెరికా సైనిక ఉద్యోగి మైకేల్‍ హేలీతో నిక్కీకి వివాహమైంది. రెనా, నలిన్‍ అనే ఇద్దరు పిల్లలు. ప్రజా రంగంలో విశిష్ట సేవలకు గాను యూనివర్సిటీ ఆఫ్‍ సౌత్‍ కరొలినా ఆమెను 2013లో డాక్టరేట్‍తో సత్కరించింది.

రైసింగ్ స్టార్ట్ పద్మశ్రీ వారియర్

మన ప్రవాసాంధ్రురాలు పద్మశ్రీ వారియర్‍ను ప్రముఖ ఫార్చ్యూన్‍ మేగజైన్‍ ‘క్వీన్‍ ఆఫ్‍ ది ఎలక్ట్రిక్‍ కార్‍ బిజ్‍’ అనివర్ణించింది. అమెరికాలోని ఎలక్ట్రిక్‍ వెహికల్స్ కంపెనీ నెక్టస్ఈవీకి సీఈవోగా ప్రస్తుతం పని చేస్తున్న ఆమె 2014లో ఫోర్బస్ వెలువ రించిన, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 71వ స్థానంలో నిలిచారు. గతంలో ఆమె మోటరోలా, సిస్‍కో సిస్టమ్స్ వంటి ప్రముఖ కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలుగు వారు గర్వించదగిన ఆమె విజయయాత్ర గురించి క్లుప్తంగా..

ఆంధప్రదేశ్‍ టు అమెరికా..

ఆంధప్రదేశ్‍లోని కృష్ణా జిల్లా విజయవాడలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన పద్మశ్రీ వారియర్‍ పాఠశాల చదువంతా చిల్డ్రన్స్ మాంటెస్సరీ పాఠశాలలోనే సాగింది. అనంతరం మారిస్‍ స్టెల్లా కాలేజీలో ఉన్నత విద్యనభ్యసించారు. ప్రఖ్యాత ఢిల్లీ ఐఐటీ నుంచి 1982లో కెమికల్‍ ఇంజనీరింగ్‍లో పట్టభద్రులయ్యారు. న్యూయార్క్లోని కార్నెల్‍ విశ్వవిద్యాలయం నుంచి 1994లో కెమికల్‍ ఇంజనీరింగ్‍లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.

ఉద్యోగ జీవితం..

మోటరోలాలో ఉద్యోగిగా జీవితం ప్రారంభించిన ఆమె అంచెలంచెలుగా ఆ కంపెనీకి కార్పొరేట్‍ ఉపాధ్యక్షురాలిగా, చీఫ్‍ టెక్నాలజీ అధికారిణిగా సేవలందించారు. 2003లో మోటరోలా సీటీవోగా నియమితులైన ఆమె 2005లో ఎగ్జిక్యూటివ్‍ వైస్‍ ప్రెసిడెంట్‍గా పదోన్నతి పొందారు. ఈ క్రమంలోనే ఆమె 2004లో అమెరికా అధ్యక్షుని చేతుల మీదుగా నేషనల్‍ మెడల్‍ ఆఫ్‍ టెక్నాలజీని అందుకున్నారు. అనంతరం 2007లో ఆమె సిస్‍కక్ష సిస్టమ్స్ సీటీవోగా చేరారు. 2015లో నెక్టస్ఈ సంస్థలో సీఈవోగా చేరారు.

రైజింగ్‍స్టార్‍..

2005లో పద్మశ్రీ వారియర్‍ను ఫార్చ్యూన్‍ పత్రిక ఆమెను రైజింగ్‍ స్టార్‍గా అభివర్ణించింది. హయ్యస్ట్ పెయిడ్‍, యంగ్‍ అండ్‍ పవర్‍ఫుల్‍ జాబితాలో ఆమెకు 10వ స్థానం లభించింది. ద ఎకనమిక్‍ టైమ్స్ సైతం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రభావశీల భారతీయుల జాబితాలో
ఆమెకు 11వ స్థానం ఇచ్చింది.

ప్రవాసుల గొంతు ప్రమీల’

అమెరికా చట్టసభలకు ‘వాషింగ్టన్‍ సెవెన్త్ కాంగ్రెషనల్‍ డిస్ట్రిక్ట్’ ప్రతినిధిగా ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు ప్రమీలా
జయపాల్‍. తమిళనాడులోని చెన్నైలో జన్మించిన ఆమె చదువుకోవడానికి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మహిళల హక్కులు, జాతి వివక్ష, ఆర్థిక సమానత్వం కోసం విస్త•తంగా ప్రజా పోరాటాలు జరిపి భిన్న ప్రజలు నివసించే వాషింగ్టన్‍ చట్టసభకు ఎన్నికైన ప్రమీల.. ఒక సంచలనం. 1982లో ఆమె కళాశాల విద్య కోసం అమెరికా వెళ్లారు. 2001లో వరల్డ్ ట్రేడ్‍ సెంటర్‍పై జరిగిన ఉగ్రదాడి తరువాత ప్రవాసులపై దాడులు పెరగడంతో వాళ్ల హక్కుల కోసం పోరాడేందుకు ప్రమీల ‘హేట్‍ ఫ్రీ జోన్‍’ సంస్థను ప్రారంభించారు. ఇమిగ్రేషన్‍ సంస్కరణులు, అరబ్‍, మధ్యప్రాచ్య, దక్షిణాసియా దేశాల పౌరుల రక్షణ కోసం ఆమె ఈ సంస్థ ద్వారా నడుం బిగించారు. మహిళల హక్కుల కోసం పోరాడటంలో ఆమె ఎప్పుడూ ప్రథమ పంక్తిలో నిలిచే వారు. దేశవ్యాప్తంగా ఉన్న 4,000 మంది సోమాలీలను అమెరికా నుంచి వెళ్లగొట్టకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత హేట్‍ ఫ్రీ జోన్‍ సంస్థ 2008లో ‘వన్‍ అమెరికా’గా రూపాంతరం చెందింది. 2013లో వైట్‍హౌస్‍ ఆమెకు ‘చాంపియన్‍ ఆఫ్‍ చేంజ్‍’ పురస్కారాన్ని అందచేసింది. ఆమె ‘పిలిగ్రిమేజ్‍: వన్‍ వుమన్‍ రిటర్న్ టు ఏ చేంజింగ్‍’ పుస్తకం రాశారు. కొలంబియా సిటీ సమీపంలోని సియాటెల్‍లో భర్త స్టీవ్‍, కుమారుడితో కలిసి ఆమె నివసిస్తున్నారు.

టాప్ 10 కరెన్సీ

ప్రతి దేశానికి ఓ కరెన్సీ ఉంటుంది. దానికో విలువ ఉంటుంది. అయితే, ఏ కరెన్సీ విలువ ఎంత? కరెన్సీ విలువ పరంగా ప్రపం చంలో ఏ దేశం టాప్‍- 10 జాబితాలో ఉంది?.. భారతీయ కరెన్సీలో విలువెంత.. పరిశీలిద్దాం.
1.కువైట్‍: కరెన్సీ పేరు దీనార్‍. విలువ రూ.225.91.
2.బహ్రెయిన్‍: కరెన్సీ పేరు బహ్రెయిన్‍ దీనార్‍. విలువ రూ.180.
3.ఒమన్‍: కరెన్సీ పేరు రియాల్స్. విలువ రూ.176.
4.యూరో: ఫౌండ్‍. విలువ రూ.86.31.
5.ఈయూ: యూరో. విలువ రూ.75.42.
6.స్విట్జర్లాండ్‍: స్విస్‍ ఫ్రాన్స్. విలువ రూ.69.28.
7.లిబియా: లిబియన్‍ దీనార్‍. విలువ రూ.48.87.
8.ఆస్ట్రేలియా: ఆస్ట్రేలి యా డాలర్‍. విలువ రూ.48.86.
9.బ్రూనే: బ్రూనెయిన్‍ డాలర్‍. విలువ రూ.46.85.
10. సింగపూర్‍: సింగపూర్‍ డాలర్‍. విలువ రూ.46.85.

Review అమెరికాలో భారత ధ్రువతార.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top