హీరోయిన్లు తెరపై ఆరబోసే
అందాలను కళ్లారా చూడటమే కాదు.. రియల్ లైఫ్‍లో వారు చెప్పే విషయాలనూ అభిమానులు చెవులప్పగించి వింటారు. అందుకే తారలు చెప్పే కబుర్లకు ఫాలోయింగ్ ఎక్కువ. ‘మహానటి’లో సావిత్రి పాత్రను పోషిస్తున్న కీర్తిసురేష్‍తో ఇటీవల మాటలు కలిపినప్పుడు తన బాల్యం, అప్పుడు చేసిన అల్లరి చేష్టల గురించి సరదాగా చెప్పుకొచ్చింది. ఏం చెప్పిందో చదవండి మరి…
అందరి జీవింతలో బాల్యం అందమైన అనుభవం కదా! మీ బాల్యం గుర్తొస్తే ఏమని పిస్తుంది?
చిన్నప్పటి సంగతులను ఎప్పుడు తలచుకున్నా, గుర్తుకు వచ్చినా మనసు పులకరిస్తుంది. ఒక్కసారిగా బాల్యంలోకి పరుగులు తీయాలని అనిపిస్తుంది.
మీ బాల్యంలోని గుర్తొచ్చే అనుభవాలు ఏమిటో చెబుతారా?
అమ్మో.. చిన్నప్పుడు బాగా అల్లరి చేసే దానిని. నా ఫ్రెండ్స్ కంటే నేనే ఎక్కువగా అల్లరి చేసే దానినని మమ్మీ చెబుతుంటుంది. అవన్నీ గుర్తుకు వస్తే ఇప్పటికీ నవ్వు వస్తుంది. స్నానాల గదిలోకి ఎవరైనా వెళ్తే బయటి నుంచి తలుపుల గడియ వేసి నేను దాక్కుండిపోయే దానిని. లోపలి నుంచి వాళ్లెంత అరచి గీ పెట్టినా తలుపు తీసేదానిని కాదు.
ఇంకా ఏమేం చేసేవారు?
నాణేలు కనిపిస్తే చాలు నాకు తెలియకుండానే నోట్లోకి వెళ్లిపోయేవి. ఈ అలవాటు చాలా కాలం చిన్నప్పుడు నన్ను వెంటాడింది. అందేంటో చేతిలో నాణెం ఉంటే అది నాకు తెలియకుండానే నోట్లోకి వెళ్లిపోయేది. ఆ తరువాత తరువాత ఆ అలవాటును తగ్గించుకున్నాను.
చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువగానే ఉండేవారా?
అవును. చాలా ఎక్కువ మంది ఉండేవారు. దాంతో అందరితో కలివిడిగా ఉండటం నేను చిన్నప్పటి నుంచే నేర్చుకోగలిగాను. నిజానికి ఇలా చిన్నప్పటి నుంచే నేను అందరితో కలివిడిగా ఉండటం నేను చిత్ర పరి శ్రమలో బాగా స్థిరపడటానికి ఉపయోగపడింది.
అంటే.. ఎలా?
చిత్ర పరిశ్రమలో రకరకాల వ్యక్తులతో కలిసి పనిచేయాలి. మంచి ఇన్‍పుట్ రావా లంటే అందరితో కలిసి పనిచేయాలి. టీమ్ వర్క్ అనేది చిన్నప్పుడే నాకు అలవడింది కాబట్టి నా పని ఇక్కడ సులువైంది.
Review అల్లరి పిల్ల.