ఈ ఆలయ నిర్మాణ ప్రస్థానం 30 ఏళ్ల క్రితం హ•షీకేశ్లో మొదలైంది. ఇప్పటి మా ప్రధానార్చకులు శ్రీ నారయణం వెంకట సత్యనారాయణా చార్యులు అప్పట్లో హ•షీకేష్లోని శ్రీ వేంకటశ్వర స్వామి ఆలయ అర్చకులుగా పనిచేసేవారు. అప్పుడు ఒక హిమాలయ సాధువు వారికి శ్రీ అష్టముఖ గండ భేరుండ లక్ష్మీ నరసింహ మహామంత్రాన్ని ఉపదేశించారు.
అప్పటినుంచీ ఆ మహా మంత్రాన్ని వారు జపిస్తూ ఉన్నారు. తమ ఆలయాల్లో అర్చకత్వం నిర్వహించాల్సిందిగా ఎంతో మంది కోరి నప్పటికీ వారు మెంఫిస్లోని మా ఆలయానికి ప్రధానార్చకులుగా ఉండటానికి అంగీకరించారు. అదే ఏడాది వ్యాసాశ్రమానికి చెందిన శ్రీ విద్యానంద స్వామి, పరిపూర్ణానందస్వామి వార్లు మెంఫిస్ విచ్చేశారు. ఆలయం, పరిసరాలు మరింత పవిత్రంగా వర్ధిల్లేందుకు ఇక్కడ యజ్ఞాలు నిర్వహించాల్సిందిగా సూచించారు. స్వామీజీ వార్లు తిరిగి 1997లో మళ్లీ మా ఆలయాన్ని సందర్శించినపుడు నార్త్ అమెరికాలోనే మొదటి సారిగా యజ్ఞం (శ్రీ వెంకటేశ్వర అద్భుత శాంతి యజ్ఞం) నిర్వహించాం. అది అద్భుతంగా విజయ వంతం కావడంతో అప్పటి నుంచీ మేం ప్రతీ ఏడాది యజ్ఞాలను నిర్వహిస్తున్నాం. శ్రీ కరుణా మయి విజయేశ్వరీ దేవి స్ఫూర్తితో 2007లో శ్రీ వేంకటేశ్వర స్వామికి యజ్ఞాన్ని నిర్వహించాలని సంకల్పించాం. ఒకనాడు మా ఆచార్యుల వారు ధ్యానంలో ఉండగా ‘‘శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కనిపించి శ్రీ అష్టముఖ గండభేరుంఢ లక్ష్మీ నరసింహ స్వామికి యజ్ఞాన్ని నిర్వహించా ల్సిందిగా ఆజ్ఞాపించారు’’. అయితే ఈ యజ్ఞ నిర్వహణ, విధి విధానాలను గూర్చి తిరుమల తిరుపతి, వారణాశిలకు చెందిన ఆగమ పండితులు ఎన్నో విధాలుగా పరిశీలించి నప్పటికీ ఎలాంటి సమాచారం లభ్యం కాలేదు. దరిమిలా అసలిలాంటి యజ్ఞం ఎప్పుడూ, ఎక్కడా నిర్వహించలేదని మాకు తెలిసింది. అయితే ఒక సారి ఆచార్యుల వారు అట్లాంటాకు వెళుతూ శ్రీ కరుణామయి మాతాజీ అనువదించి సమర్పిం చిన శ్రీ స్రంపుటిత శ్రీ సూక్తాన్ని వింటు న్నారు. అలా వింటూ ఆయన ఒక ట్రాన్స్లోకి వెళ్లి పోయారు. అప్పుడు ఆయనకు యజ్ఞ నిర్వహణ చిక్కుముడి వీడింది, యజ్ఞ నిర్వహణ విధి, విధానాల గురించి చక్కటి వివరణ దొరి కింది. యజ్ఞ నిర్వహణ ఏర్పాట్లు జరుగుతున్నప్ప టికీ అసలు మా దగ్గర కనీసం శ్రీ అష్టముఖ గండభేరుండ లక్ష్మీ నరసింహ స్వామి చిత్రం కూడా లేదు, ఆ మూర్తి రూపురేఖలు కూడా తెలీదు. అయితే ఆశ్చర్యకరంగా ఒకరోజు ఒక భక్తుడు ఆలయానికి వచ్చి ఆచార్యుల వారికి శ్రీ అష్టముఖ గండభేరుండ లక్ష్మీ నరసింహ దేవతామూర్తి రేఖా చిత్రాన్ని ఇచ్చారు. మేం ఆ చిత్రాన్ని ఇండియాకు పంపి మధురైలో ఉన్న ఒక చిత్రకారుడితో శ్రీ అష్టముఖ గండభేరుంఢ లక్ష్మీ నరసింహస్వామి చిత్రాన్ని, ధ్యాన శ్లోకాన్ని గీయించాం. ఆ చిత్రం ఎంతో సుందరంగా, అద్భుతంగా రూపొం దింది.
భారత్, నార్త్ అమెరికా, యూరప్‍ల నుంచి విచ్చేసిన 120 మంది అర్చకులతో , 108 హోమ గుండాలతో అత్యంత వైభవోపేతంగా యజ్ఞం నిర్వహించాం. మెఫిస్ ఆలయం తరపున 2010లో ఈ యజ్ఞాన్ని నల్గొండ జిల్లాలోని తిప్ప ర్తిలో, 2014లో మంగళగిరిలోనూ, 2016లో హైదరాబాద్లోనూ నిర్వహించాం. ఆది శంకరా చార్య ప్రతిష్టిత జ్యోతిర్మఠంలో కూడా ఈ యజ్ఞాన్ని నిర్వహించాల్సిందిగా కోరారు. ఆ తరు వాత శ్రీ అష్టముఖ గండభేరుంఢ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి దక్షిణాన పుష్కరిణిని నిర్మిం చాలని, శ్రీ విఖనస, అత్రి, కాశ్యప, మరీచి, భ•గు మహర్షుల గుళ్లను పుష్కరిణికి ఉత్తరాన ఏర్పాటు చేయాలని సంకల్పించాం.
గురువుల ఆశీస్సులు, శ్రీ అష్టముఖ గండ భేరుంఢ లక్ష్మీ నరసింహ స్వామి క•పా, కటా క్షాలతో నార్త్ అమెరికాలోనే మొదటిసారిగా టెన్నెస్సీ రాష్ట్రంలోని మెంఫీస్ ఆలయాన్ని, పుష్కరిణిని, విఖనస మహర్షి ఆలయాన్ని నిర్మించగలిగాం. అనంతరం ఆలయంలో దేవతా మూర్తులను ప్రతిష్టించాం.
శ్రీ అష్టముఖ గండభేరురుండ లక్ష్మీ నర సింహస్వామి ఎనిమిది ముఖాలను కలిగి ఉంటారు.
హయగ్రీవ: జ్ఞానాన్ని, మేథస్సును సూచిస్తుంది
వ్యాఘ్ర: ధార్మిక చింతనకు ప్రతీక.
సింహ: ధైర్యానికి, శక్తికి సూచన.
గండభేరుండ: వేగాన్ని, కంటికి కనిపించని దాన్ని కూడా గమనించ గలిగేంత ద•ష్టిని (గండభేరుంఢ పక్షి మాదిరి) ఇస్తుంది.
గరుడ: సేవాగుణం, భక్తిభావన, పంచార్పణలను సూచిస్తుంది.
భల్లూక: శారీరక బలాన్ని, తెలివితేటలను, సేవాగుణానికి ప్రతీక.
ఆంజనేయ: బుద్ధిబలానికి, అనుగ్రహానికి ప్రతీక,
వరాహ: త్యాగగుణానికి, అనుగ్రహ సిద్ధికి.
అన్నదానం: డాక్టర్ సుబ్బులక్ష్మి , శ్రీధర్ రాయుడు గార్ల సలహా మేరకు 2003, జనవరి నుంచి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిం చింది. ప్రతి శనివారం జరిగే అన్నదానంలో దాదాపు 500 మంది దాకా భోజనం చేసేందుకు వీలుగా సదుపాయాలు కల్పిస్తున్నాం. ఇదే కాక ప్రత్యేక సందర్భాల్లో కూడా అన్నదానాన్ని నిర్వహిస్తున్నాం. ఆనాటి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి, అన్నపూర్ణాదేవి కరుణా కటాక్షాలతో, భక్తులు, వాలంటీర్ల సహాయ, సహకారాల.
ఆలయంలో జరిగిన ముఖ్యకార్యక్రమాలలో కొన్ని
శ్రీనివాస కల్యాణం
మహాశివరాత్రి-5 రోజుల వేడుకలు
శివసహస్ర కలశాభిషేకం
శ్రీ వేంకటేశ్వర సహస్ర కలశాభిషేకం
శివుడికి అన్నాభిషేకం, వేంకటేశ్వర స్వామికి పూలంగిసేవ, మహాయజ్ఞం ఐదురోజుల ఉత్సవం
గణేశ నిమజ్జనం, 9 రోజులపాటు నవ రాత్రోత్సవాలు
దీపావళి, వైకుంఠ ఏకాదశి
Review అష్టముఖ గండభేరుంఢ నరసింహ స్వామి ఆలయం.