ఆయుర్వేదం.. సద్వర్తనం

ఆయుర్వేదం ఆరోగ్యం గురించే కాదు.. మంచి జీవనశైలి గురించి కూడా బోధిస్తుంది. వాటినే ‘సద్వర్తనాలు’ అంటారు. అంటే ‘లోక మర్యాద’ (సివిక్‌ సెన్స్‌) అని అర్థం. వీటిని పాటించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారు.
కనీసం ఐదు రోజులకు ఒకసారి తల వెంట్రుకలు, మీసం, గడ్డం, గోళ్లు కత్తిరించుకోవాలి.
జన సమ్మర్ధం కలిగిన స్థలాల్లోనూ, భుజించేటపుడూ, జపం, హోమం, అధ్యయనం, పూజ, మంగళకరమైన పనులు చేసేటపుడూ ఉమ్మి వేయడం, ముక్కు చీదడం వంటి పనులు చేయకూడదు.
ముఖానికి చేయి చాటు లేకుండా ఆవులింత, తుమ్ము వంటివి బహిర్గతం చేయరాదు.
అలాగే, నలుగురిలో ఉన్నపుడు అకారణంగా నవ్వడం కూడదు.
పురుషుడు, తల్లి, తోబుట్టువులు, పుత్రికలు.. వీరితో కూడా ఒంటరిగా కూర్చుండరాదు. ఎందుకంటే, ఇంద్రియ సమూహం మిక్కిలి బలం కలది. విద్వాంసుల మనసునైనా ఇంద్రియాలు క్షణాల్లో మార్చివేస్తాయి కాబట్టి జాగరూకతతో ఉండాలి.

Review ఆయుర్వేదం.. సద్వర్తనం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top