ఇంగ్లిష్‍ అంటే ఎంతో ఇష్టం..

న్యూజెర్సీలో 1951లో జన్మించిన జిల్‍ పూర్తి పేరు.. జిల్‍ ట్రాసీ జాకబ్స్ బైడెన్‍. ఆమె తండ్రి డొనాల్డ్ కార్ల్ జాకబ్స్ బ్యాంక్‍ టెల్లర్‍. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూఎస్‍ నేవీ సిగ్నల్‍ మ్యాన్‍గా కూడా ఆయన సేవలు అందించారు. తల్లి బోన్నీ జీన్‍ గృహిణి. జాకబ్స్ – బోన్నీ జీన్‍ దంపతుల సంతానమైన ఐదుగురు అమ్మాయిల్లో జిల్‍ పెద్దవారు.

వీరంతా ఫిలడెల్పియా శివార్లలోని విల్లోగ్రోవ్‍లో పెరిగారు. చదువుకునే రోజుల్లో ఇంగ్లిష్‍ క్లాసంటే పడి చచ్చిపోయేదానినని జిల్‍ చాలా సందర్భాల్లో చెప్పారు. అదే సబ్జెక్ట్లో డెలావర్‍ యూనివర్సిటీ నుంచి ఆమె బీఏ పూర్తి చేశారు. అనంతరం వెస్ట్ చెస్టర్‍ యూనివర్సిటీ నుంచి ఎం.ఎడ్‍, విలానోవా యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా అందుకున్నారు.

కాలేజీలో చదువుకునే రోజుల్లోనే కాస్త విరామం తీసుకుని విల్మింగ్టన్‍లోని ఓ స్థానిక సంస్థలో మోడలింగ్‍ కూడా చేశారు. అయితే చిన్నతనం నుంచి ఉపాధ్యాయ వృత్తిని అమితంగా ఇష్టపడిన జిల్‍.. అంతిమంగా తన కెరీర్‍ను అటువైపుగా మళ్లించారు.

ఈ క్రమంలోనే విల్మింగ్టన్‍ పబ్లిక్‍ స్కూల్‍లో సబ్‍స్టిట్యూట్‍ టీచర్‍గా కెరీర్‍ ప్రారంభించిన ఆమె.. ఆపై అక్కడి సెయింట్‍ మార్కస్ హైస్కూల్‍లో పూర్తి స్థాయి టీచర్‍గా సేవలు అందించారు. అది కూడా ఆమెకు ఎంతో ఇష్టమైన ఇంగ్లిష్‍ సబ్జెక్టులోనే కావడం విశేషం.

Review ఇంగ్లిష్‍ అంటే ఎంతో ఇష్టం...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top