శాస్త్రీయ పరిశోధనలకు ఇచ్చే సొసైటీ ఫర్ సైన్స్ అండ్ ద పబ్లిక్ (ఎస్ఎస్పి) పురస్కారం-2017కు ఇండో అమెరికన్లు ఇంద్రాణి దాస్, అర్జున్ రమణి ఎంపికయ్యారు. మెదడుకు అయ్యే గాయాలు, సంక్రమించే వ్యాధులను నయం చేసే పరిశోధనకుగాను ఇంద్రాణి దాస్ మొదటిస్థానంలో నిలిచి రెండున్నర లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ గెలుచుకోగా కంప్యూటర్ పోగ్రామింగ్‌లో పరిశోధనకుగాను అర్జున్ రమణీ మూడోస్థానంలో నిలిచి లక్షన్నర డాలర్ల ప్రైజ్‌మనీని గెలుచుకున్నారు. సమాజానికి ఉపయోగపడే పరిశోధనలను ప్రోత్సహించేందుకు గాను 1942లో ఈ అవార్డుని ప్రారంభించారు. 1998 నుంచి ఈ పురస్కారం కింద ఇచ్చే నగదును ఇంటెల్ సంస్థ అందజేస్తోంది. ఈ అవార్డుని జూనియర్ నోబెల్ ప్రైజ్గానూ పిలుస్తారు.
ఇండో అమెరికన్స్ కు నోబెల్ ప్రైజ్

Review ఇండో అమెరికన్స్ కు నోబెల్ ప్రైజ్.