న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా బిల్ ఇంగ్లీష్ నియమితులయ్యారు. ఆ దేశ అధికార నేషనల్ పార్టీ ప్రధాని పదవికి ఆయన పేరును ఖరారు చేసింది. ఇక ఇటలీ ప్రధానిగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి పాలో గెంటిలోనిని నియమించారు. ఆ దేశాధ్యక్షుడు సెర్గియో మాటరెల్లా అన్ని పార్టీల నాయకులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 5న న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ, ఇటలీ ప్రధాని మట్టెయో రెంజీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ స్వచ్ఛందగా రాజీనామా చేయగా.. ఇటలీ ప్రధాని రెంజీ మాత్రం రెఫరెండంలో వ్యతిరేకంగా తీర్పు రావడంతో వైదొలిగారు. ఇటలీలో రాజ్యాంగ సవరణ కోసం నిర్వహించిన రెఫరెండంలో (ప్రజాభిప్రాయ సేకరణ) ప్రజలు వ్యతిరేకంగా ఓట్లు వేశారు.
ఇద్దరు కొత్త ప్రధానుల నియామక

Review ఇద్దరు కొత్త ప్రధానుల నియామక.