ఉమెన్స్ ఫెస్ట్ ఫెంటాస్టిక్

మామూలుగా నలుగురు మహిళలు కలిస్తే అక్కడ ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. అదే వందలాది మంది ఒకచోట గుమికూడితే.. ఆనందం అవర్ణమవుతుంది. నవ్వులు జల్లులై కురుస్తాయి. అద్భుతం ఆవిష్క•తమవుతుంది. ఈ మహాద్భుతానికి వేదికైంది- కమ్మింగ్‍లోని స్కైల్యాండ్‍ బిజినెస్‍ సెంటర్‍.
ద ఇండియన్‍ ఫ్రెండ్స్ ఆఫ్‍ అట్లాంటా (ఐఎఫ్‍ఏ) రెండో వార్షిక ఉమెన్స్ ఫెస్ట్-2017ను ఘనంగా నిర్వహించింది. మే 20న కమ్మింగ్‍లోని స్కైల్యాండ్‍ బిజినెస్‍ సెంటర్‍లో వేలాది మంది మహిళలు సందడి చేశారు. ఎందరో ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమానికి మరింత ప్రత్యేక ఆకర్షణ తెచ్చారు. ప్రవాస భారతీయ, అమెరికా ప్రముఖులు డీవీ సింగ్‍, కరేన్‍ హండెల్‍, రాన్‍ ఫ్రీమాన్‍, నహీద్‍ సయ్యద్‍, డెబొరా లాన్హం తదితరులతో పాటు తెలంగాణ అమెరికన్‍ తెలుగు అసోసియేషన్‍, గుజరాతి సమాజ్‍, గ్రేటర్‍ అట్లాంటా తెలంగాణ సొసైటీ, సింధి సభ, గ్రేటర్‍ అట్లాంటా పంజాబి సొసైటీ, గ్రేటర్‍ అట్లాంటా తెలుగు అసోసియేషన్‍ తదితర సంఘాలతో పాటు వెయ్యి మందికి పైగా ప్రవాస భారతీయ మహిళలు ఈ సెలబ్రేషన్స్లో ఉత్సాహంగా ఆడిపాడారు. ఏడాదంతా అసోసియేషన్‍ కార్యకలాపాలు, సేవా కార్యక్రమాల్లో మునిగితేలిన మహిళలు.. చివరిలో ఇలా ఉత్సాహంగా ఒకచోట సమావేశమై ఆనందాన్ని పంచుకున్నారు. మ్యూజిక్‍, డ్యాన్స్, ఫన్‍ గేమ్స్, సెమినార్స్, ప్రముఖుల ప్రసంగాలు, అవార్డులు, ఫ్యాషన్‍ షోతో పోగ్రామ్‍ వన్నెలీనింది. క్లాసికల్‍, ఫ్యూజన్‍, ఫోల్క్ డ్యాన్స్లో అట్లాంటాకు చెందిన తెలుగు డ్యాన్స్ అకాడమీలు అదరగొట్టాయి. ‘ఎవర్‍ గ్రీన్‍ బాలీవుడ్‍’ అనే థీమ్‍తో ఈ ఫెస్ట్ను నిర్వహించారు. మన సామాజిక సంస్క•తిపై, జీవనంపై, లైఫ్‍స్టైల్‍పై బాలీవుడ్‍ ఫ్యాషన్‍ చూపుతున్న ప్రభావాన్ని కళ్లకు కట్టినట్టు చూపారు. ఇక, ఆధునిక, సంప్రదాయ వస్త్రధారణల్లో మహిళలు మెరిసిపోయారు. ఫ్యాషన్‍ షో వేదికపై రంగురంగుల దుస్తులు, అధునాతన యాక్సెసరీస్‍ ధరించిన మహిళలు తళుకులీనుతూ హొయలు ఒలకబోశారు. వీరిని అతిథులు, ఆహూతులు చప్పట్లతో ఉత్సాహపరిచారు. రాజకీయాల్లో మహిళల పాత్ర, ఓటరు నమోదు, మహిళల భద్రత, ఐటీలో ఉన్న అవకాశాలు తదితర అంశాలపై వక్తలు స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు. ఎన్‍ఆర్‍ఐ పల్స్ ఎడిటర్‍ వీణారావు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కమలేష్‍, డాక్టర్‍ వీణారావు, అంజలి ఛాబ్రియాను ఐఎఫ్‍ఏ ఘనంగా సత్కరించింది.
అట్లాంటా ప్రాంతానికి చెందిన మహిళల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మెరుగుపరచడం, ఒకరికొకరు పరిచయం కావడం, వారి మధ్య సత్సంబంధాలు ఏర్పర్చడం.. వంటి లక్ష్యాలతో ఐఎఫ్‍ఏ ఏటా ఈ ఫెస్ట్ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఐఎఫ్‍ఏ మహిళల కోసం ‘ఐఎఫ్‍ఏ శక్తి’ అనే హెల్ప్లైన్‍ను ప్రారంభించింది. ఇది ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాదు.. మహిళల కెరీర్‍ గ్రోత్‍కు, న్యాయపరమైన వివాదాల విషయంలో సలహా సూచనలు ఇవ్వడంతో పాటు, ఇమ్మిగ్రేషన్‍కు సంబంధించిన అంశాలపై కౌన్సెలింగ్‍నూ నిర్వహిస్తుంది. కార్యక్రమం మొత్తాన్ని ఐఎఫ్‍ఏ ఎగ్జిక్యూటివ్‍ డైరెక్టర్‍ లక్ష్మి ముందుండి నడిపించారు. అట్లాంటా పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారంతా ఈ ఫెస్ట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఐఎఫ్‍ఎస్‍ అధ్యక్షులు శ్రీకాంత్‍ ఉప్పాల, లక్ష్మీ థీసమ్‍, సునీల్‍ సవిలీ, శ్యామ్‍ మల్లవరపు తదితరులు పాల్గొన్నారు.

Review ఉమెన్స్ ఫెస్ట్ ఫెంటాస్టిక్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top