ఏటీసీ ఎక్సలెన్స్ ఇన్ కమ్యూనిటీ అవార్డు

అమెరికా చరిత్రలో మొదటి సారిగా రెండు జాతీయ తెలుగు సంఘాలు (అమెరికా తెలుగు సంఘము ఆట – తెలంగాణ అమెరికా తెలుగు సంఘం టాటా) సంయుక్తంగా అమెరికన్‍ తెలుగు కన్వెన్షన్‍ (•••) చారిత్రాత్మక సంయుక్త సమావేశం ఇర్వింగ్‍ కన్వెన్షన్‍ సెంటర్‍ డల్లాస్‍లో మే 31నుండి జూన్‍ 2 వరకు ఘనంగా తెలుగు మహాసభలు జరిగినవి. అమెరికా నలుమూలలనుండి పెద్ద సంఖ్యలో ప్రవాసులు, తానా, నాట్స్, నాటా, టాంటెక్స్ సంస్థల ప్రతినిధులు హాజ రయ్యారు. వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన ప్రవాసులకు (ఆటా-టాటా) పురస్కారాలను ప్రధానం చేశారు. ఇందులో భాగంగా సామాజిక సేవ రంగంలో శ్రీ చుక్క వెంకటేశ్వర్లుకు ఎక్స్లెన్స్ ఇన్‍ కమ్యూనిటీ సర్వీసెస్‍ అవార్డును శ్రీ చంద్రమోహనరెడ్డి సోమిరెడ్డి వ్యవసాయశాఖ మంత్రులు, ఆంధప్రదేశ్‍ అందించారు. చుక్క వెంకటేశ్వర్లు గత

2 దశాబ్దాలుగా మనోచేతన స్వచ్ఛంద సంస్థ ద్వారా దివ్యాంగులకు ప్రత్యేక విద్య, వైద్యం, పునరావాసం, అవగాహన, హెల్త్ కార్డులు, హెల్త్ క్యాంపులు, పర్యావరణ పరిరక్షణ, మానవ వనరుల అభివృద్ధి, దివ్యాం గులకు సహాయ పరికరాలు అందించడం వంటి పలు కార్యక్రమాలు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వేదికపై శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్‍ రెడ్డి మంత్రివర్యులు, శ్రీ కరుణాకర్‍ రెడ్డి ఆటా ప్రెసిడెంట్‍, డా. హరినాధ్‍ పొలిచెర్ల టాటా ప్రెసిడెంట్‍, శ్రీ నందాచాట్ల గేట్స్ ప్రెసిడెంట్‍, డా. పైళ్ళ మల్లారెడ్డి, ప్రముఖ దాత టాటా అడ్వైసరి కమిటీ ఛైర్మన్‍ డా. వెంకట్‍ వీరమనేని, డా. రాజేశ్వర్‍ టెక్‍ మాల్‍, చైర్‍ అవార్డస్ కమిటీ శ్రీచిని సత్యం వీరమపు కో చైర్మన్‍ అవార్డస్ కమిటీ పాల్గొన్నారు

Review ఏటీసీ ఎక్సలెన్స్ ఇన్ కమ్యూనిటీ అవార్డు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top