ఒడిదుడుకుల పయనం

బైడెన్‍ జీవితం మొత్తం ఆటుపోట్లు.. ఒడిదుడుకులే. ఆయన సెనేటర్‍ పదవి చేపట్టిన తరువాత మొదటి పద్నాలుగు సంవత్సరాలు తన వ్యక్తిగత జీవితంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. భార్య, కుమార్తె మరణం తరువాత తన కొడుకులిద్దరికీ మంచి జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో ఆయన సొంతిల్లు ఉన్న డెలావర్‍ నుంచి వాషింగ్టన్‍కు రోజూ ప్రయాణం చేసేవారు.

1991, అక్టోబర్‍ 11వ తేదీన యూనివర్సిటీ ఆఫ్‍ ఒక్లహామాలో న్యాయశాస్త్ర అధ్యాపకురాలు అనిటా హిల్‍, అమెరికా సుప్రీంకోర్టు న్యాయవాది క్లారెన్స్ థామస్‍ మీద వేసిన కేసు విచారణ జరుగుతోంది. రోనాల్డ్ రీగన్‍ ప్రభుత్వంతో కలిసి పనిచేపినపుడు క్లారెన్స్ థామస్‍ తనను పలుమార్లు లైంగికంగా హింసించారని అనిటా హిల్‍ కేసు వేశారు. అమెరికాలో అందరూ ఈ కేసు విచారణ తీరుతెన్నుల్ని చూసేందుకు టీవీలకు అతుక్కుపోయారు. అమెరికా సెనేట్‍ జ్యూడీషియరీ కమిటీ ఈ విచారణను చేపట్టింది. ఈ కమిటీ చైర్మన్‍గా జో బైడెన్‍ విచారణకు అధ్యక్షత వహించారు. అనిటా హిల్‍ సాక్ష్యాల విషయంలో బైడెన్‍ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. ఈ విచారణ కమిటీలో అందరూ తెల్లజాతీయులైన పురుషులే సభ్యులుగా ఉన్నారు. అనిటా హిల్‍కు మద్దతుగా నిలిచిన పలువురు మహిళలను బైడెన్‍ సాక్ష్యం చెప్పడానికి పిలవలేదు. అనంతరం 2019, ఏప్రిల్‍లో బైడెన్‍ ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ కేసు గురించి మాట్లాడారు. ‘ఆవిడ (అనిటా హిల్‍)తో వ్యవహరించిన తీరుకు, విధానానికి సిగ్గుపడుతున్నాను’ అని ఆ ఇంటర్వ్యూలో బైడెన్‍ విచారం వ్యక్తం చేశారు.

కరోనా వైరస్‍ సృష్టించిన సంక్షోభంపై ట్రంప్‍, బైడెన్‍లవి భిన్నాభిప్రాయాలు. ట్రంప్‍ కరోనా వైరస్‍ను అరికట్టడంలో విఫలమయ్యారని బైడెన్‍ తన ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. ‘ఈ ఎన్నికల్లో నేను గెలిచినా సరే.. కోవిడ్‍ మహమ్మారిని అరికట్టడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. పదవిలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సరైన చర్యలు చేపడతాం’ అని బైడెన్‍ హామీనిచ్చారు. అమెరికన్లు కరోనా విషయంలో బైడెన్‍ మాటలను విశ్వసించారు. కాగా, కరోనా వైరస్‍ వ్యాప్తి నేపథ్యంలో 2020 అమెరికా ఎన్నికల్లో దాదాపు తొమ్మిది కోట్ల మంది ఓటర్లు ముందుగానే ఓటుహక్కును వినియోగించు కున్నారు. చాలా మంది పోస్ట్ ద్వారా ఓటు వేశారు.

Review ఒడిదుడుకుల పయనం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top