కలర్ ఫుల్ గ ఇండిపెడెన్సు డే సెలెబ్రేషన్స్…

బ్రిటన్‍ అరాచక రాచరికపు పాలన కింద ఏళ్ల తరబడి మగ్గిన అమెరికా…, స్వాతంత్య్రం కోసం పోరాడి సర్వ స్వతంత్ర దేశంగా 1776, జులై 4న ఆవిర్భవించింది. ఈ సందర్భంగా దేశంలోని అన్ని ముఖ్యనగరాలు, పట్టణాలతో పాటు అన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నగరాలన్నింటినీ అందంగా అలంకరించారు. టెక్సాస్‍రాష్ట్రంలోని ఇర్వింగ్‍లోనూ స్వతంత్ర దినోత్సవ వేడుక అంబరాన్నంటింది. స్థానిక డౌన్‍టౌన్‍ ఇర్వింగ్‍లో జరిగిన సెలెబ్రేషన్స్కి వేలాది మంది అమెరికన్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సాంస్క•తిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఉదయం నుంచి జరిగిన పలు కార్యక్రమాల్లో అమెరికన్స్ ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయంత్రం వేళ జరిగిన మ్యూజిక్‍షో అందరినీ ఆకట్టుకుంది. మరొవైపు ఇండిపెండెన్స్డే సందర్భంగా ప్రతి భవనం జాతీయ పతాకంతో రెపరెపలాడింది. వేడుకల్లో భాగంగా రాత్రి వేళలో బాణాసంచ కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. క్రాకర్స్ వెలుగుల్లో ఇర్వింగ్‍మిలమిలా మెరిసిపోయింది.

Review కలర్ ఫుల్ గ ఇండిపెడెన్సు డే సెలెబ్రేషన్స్….

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top