పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తికి దోహదపడేలా కాంతిని ఉపయోగించే పరీక్షను జర్మనీలోని జ్యూలిచ్‍లో ఏరోస్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు చేపట్టారు. ఒకే ఫ్రేములో 149 స్పాట్‍లైట్లను అమర్చి వాటిని పరీక్షించారు. ఈ 149 లైట్ల ఫ్రేమును అధికారికంగా సిన్‍లైట్ అని పిలుస్తారు. అలాగే ప్రపంచపు అతిపెద్ద కృత్రిమ సూర్యుడిగా దీనిని వ్యవహరిస్తున్నారు. 149 లైట్ల కాంతిని కేవలం 20 చదరపు సెంటీమీటర్లున్న ఒక ప్రదేశంపైకి ప్రసరింపజేయగా ఆ ప్రదేశం సాధారణం కన్నా పదివేల రెట్లు ఎక్కువ రేడియేషన్‍తో వెలిగిపోయింది. అక్కడ దాదాపు 3వేల డిగ్రీ సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు ఉండేలా చూసి హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి కొత్త మార్గాలను శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు
కృత్రిమ సూర్యుడి పరీక్షా

Review కృత్రిమ సూర్యుడి పరీక్షా.