కెసిఆర్ టీం లో దూసుకుపోతున్న ఎన్‍ఆర్‍ఐ మధు తాతా..

తెలంగాణ గడ్డపై పుట్టి, అమెరికా వచ్చి స్థిరపడి ఎంతగానో పేరుప్రతిష్టలు సంపాదించుకుని మాతృభూమికి సేవలందించాలన్న ఏకైక తపనతో టీఆర్‍ఎస్‍ పార్టీ తరఫున రాష్ట్ర అభివ •ద్ధికి ఇతోధికంగా సేవలందిస్తున్న మధు తాతాగారు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍ ఆంతరంగిక సభ్యుల బ•ందంలో ఒకరు. ఈ మధ్యనే టీఆర్‍ఎస్‍ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు, ఎన్నారైలు తీసుకోవాల్సిన బాధ్యతలు మొదలుకొని సంక్షేమ పథకాలు, అవినీతిని అరికట్టే విధానం వరకూ అనేక అంశాలపై మధు తాతా ఆలోచనలు విస్పష్టంగానే ఉన్నాయి. అవేమిటో ఓసారి చూద్దాం.

బంగారు తెలంగాణకు మేలైన బాటలు
ఉద్యమాలు ఫలించాయి. దశాబ్దాల కల ఫలించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరి గింది. ముఖ్యమంత్రి కేసీఆర్‍ బంగారు తెలం గాణకు బాటలు వేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా వాటిని టీఆర్‍ఎస్‍ ప్రభుత్వం సమర్థవంతంగా ఏదుర్కుంటున్నది. దశాబ్దాలుగా ఆదరణకు నోచుకోని తెలంగాణ కేసీఆర్‍ సారథ్యంలో ఇప్పటికే దేశంలో అగ్ర స్థానంలో నిలిచింది. అనేక విషయాల్లో తెలం గాణను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవడం ఇందుకు ఉదాహరణ. స్వచ్ఛమైన నీరును తెలం గాణ ప్రజలకు అందించే దిశగా జరుగుతున్న ప్రయత్నం ఫలించడానికి ఎంతో దూరం లేదు.
ఎన్నారైలు భాగస్వాములు కావాలి
అన్ని రంగాల్లో తెలంగాణ అభివ•ద్ధికి ప్రవాస భారతీయులు సైతం నడుం బిగించారు. ప్రవాస భారతీయులు తెలంగాణ అభివ •ద్ధిలో పాలుపంచుకోవాలి. అలాగే రాజకీయాల్లోకి కూడా రావాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ అభివ•ద్ధి పథంలో దూసుకుపోతోంది. బంగారు తెలంగాణను సాధించాలంటే ప్రవాస భార తీయులు తలో చెయ్యి వెయ్యాల్సి ఉంటుంది. రాజకీయాల్లోకి రావచ్చు. లేదా తెలంగాణలో పెట్టుబడులు పెట్టొచ్చు. సేవాకార్యక్రమాలను నిర్వహించవచ్చు. తమ పుట్టిన గ్రామాన్ని దత్తత తీసుకుని దాన్ని అభివ•ద్ధి చేయొచ్చు. పెట్టుబడులకు హైదరాబాద్‍ లో ఎలాంటి ఢోకా ఉండదు. ప్రభుత్వం ఓపెన్‍ విండో పాలసీని పెట్టింది. దీనివల్ల అనుమతులు కూడా తొంద రగా వస్తాయి. పరిశ్రమలకు 24 గంటలూ విద్యుత్తు సరఫరా అందిస్తున్నారు. అందుకోసమే ఎన్‍ఆర్‍ఐలు కూడా పెట్టు బడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. దేశంలోనే ఐటీ రంగంలో హైదరాబాద్‍ దూసుకుపోతోంది. పరిశ్రమలకు మంచి అవకాశం ఉంది. సానుకూలమైన వాతా వరణం ఉంది.
అవినీతికి అడ్డుకట్ట
అవినీతిని అరికట్టడం ఒక్కరోజులో సాధ్యం కాదు. ఎవరి చేతా కాదు. మనం ఉన్న వ్యవస్థ అలాంటిది. అలాంటి వ్యవస్థను మార్చాలనే కేసీఆర్‍ ఇప్పటికే వివిధ చర్యలు చేపట్టారు. అన్నీ ఆన్‍ లైన్లోకి వచ్చేలా చూస్తున్నారు. ప్రస్తుతం భూరికార్డుల ప్రక్షాళన జరుగుతుంది. అమెరికాలో ఒక ఇల్లు కొనుగోలు చేయాలంటే డాక్యుమెంట్లు గురించి బెంగ అవసరం లేదు. అంతా పక్కాగా ఉంటాయి. కాని మన దేశంలో ఇల్లు, స్థలం కొనాలంటే ఎన్నో విధాలుగా విచారించాల్సి ఉంటుంది. ఇకపై అలాంటిది తెలంగాణలో ఈ పరిస్థితి ఉండదు. ఇప్పటికే భూరికార్డుల ప్రక్షాళన 80 నుంచి 90 శాతం పూర్తయింది. కొద్దిరోజు ల్లోనే తెలంగాణలోని ప్రతి అడుగు భూమి రికార్డుల్లో ఉంటుంది. మోసాలకు తావుండదు. అవినీతికి ఆస్కారం ఉండదు.
కేసీఆర్‍ చెప్పినట్లు చేస్తా:
ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చాననీ, ముఖ్యమంత్రి కేసీఆర్‍ తన మీద ఎంతో నమ్మకం పెట్టుకుని తనకు కార్యదర్శి పదవి అప్పగించారని మధు తాతా అన్నారు.
‘పాలేరు, ఖమ్మం, వైరా, మధిర నియోజక వర్గాలకు ఇన్‍ ఛార్జిగా నియమించారు. ఎమ్మె ల్యేలు, ఎంపీలు, స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి. గతంలో నేను పాలేరు ఎన్నికల ఇన్‍ ఛార్జిగా కూడా పనిచేశాను. పార్టీ యంత్రాంగాన్ని పటిష్టపర్చడమే ముఖ్యం. ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల చెంతకు తీసుకెళ్లాలి. అందరినీ సమన్వయ పర్చుకుంటూ ముందుకెళ్ల డమే మా పని’ అని చెప్పారాయన.
ఎవరు పోటీ చేయాలో కేసీఆర్‍ నిర్ణయిస్తారు
‘వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మన భాధ్యత ఏమిటన్నది మన చేతిలో ఉండదు. ఎవరు పోటీ చేయాలో? ఎవరు పార్టీకి పనిచేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‍ నిర్ణయిస్తారు. ఆయన అభిప్రాయం ప్రకారమే నడుచుకోవడం పార్టీ కార్యకర్తగా మా పని. నాకు అత్యున్నతమైన సెక్రటరీ పదవి ఇచ్చారు. భవిష్యత్‍ ఎలా ఉంటుందన్నది కేసీఆర్‍ చేతు ల్లోనే ఉంది. గతంలో పాలేరు ఉప ఎన్నికల సమయంలో ఇన్‍ఛార్జిగా ఉన్నాను. ఇటీవల సింగరేణి ఎన్నికలకు ఇల్లెందు బాధ్యతలు నాకు అప్పగించారు. పల్లా రాజేశ్వర్‍ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడూ నేను చిత్తశుద్ధితో పనిచేశాను. అయితే పోటీ చేయాలా? వద్దా? అనే దానిని కేసీఆర్‍ నిర్ణయిస్తారు. కేసీఆర్‍ ఏ బాధ్యత అప్పజెప్పినా మనసా..వాచా.. చిత్తశుద్ధితో దాన్ని పూర్తి చేస్తాను’ అని మధు తాతా చెప్పారు.

అట్లాంటాలో మధు తాతాకు ఘన సన్మానం
తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివ•ద్ధి కోసం నిర్విరామ క•షి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‍ అందిస్తున్న సూర్తితో టీఆర్‍ఎస్‍ పార్టీ తరఫున అటు రాష్ట్రంలోనూ, ఇటు అమెరికాలోనూ అనేకానేక అభివ•ద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ప్రవాస భారతీయుడు మధు తాతా గారికి ఈ మధ్యనే అట్లాంటా నగరంలో ఘనసన్మానం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి బాధ్య తలు నిర్వహిస్తున్న మధు తాతాగారిని అట్లాంటా తెలుగు కమ్యూనిటీ ఘనంగా సన్మానించింది. మధు తాతా గారు ఇటీవల అమెరికా పర్యటనకు వచ్చిన సందర్భంగా అట్లాంటా తెలుగు కమ్యూనిటీ వారిని సాదరంగా ఆహ్వానించింది. ఈ సంద ర్భంగా మధు తాతా మాట్లాడుతూ, ఎన్‍ఆర్‍ఐలు నూతనంగా ఏర్పడిన తెలంగాణ అభివ •ద్ధికి సహకరించాలని కోరారు. తెలంగాణ కొత్తగా ఏర్ప డిన రాష్ట్రం అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీ ఆర్‍ సారథ్యంలో అన్ని రంగాల్లో పురోగమిస్తుం దన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తమ వంతు సాయం అందజేస్తామని ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులు తెలిపారు. వందలాది మంది సమక్షంలో మధు తాతాను శాలువతో ఘనంగా సత్కరించారు.
కాగా, బంగారు తెలంగాణ కోసం తమ వంతు పాటుపడతామని ఈ సందర్భంగా సమా వేశానికి హాజరైన ఎన్‍ఆర్‍ఐలు తెలిపారు. ఈ వేడుకలో అమెరికన్‍ తెలుగు అసోసియేషన్‍ (ఏటీఏ) ప్రెసిడెంట్‍ కరుణాకర్‍ రెడ్డి, అసోసియేషన్‍ నేతలు నరేందర్‍ రెడ్డి, షీలా లింగం, చాంద్‍ అక్కినేని, డాక్టర్‍ మంగరాజు వావపల్లి, డాక్టర్‍ హైమావతి మిక్కిలినేని, డాక్టర్‍ సుజాతారెడ్డి, డాక్టర్‍ శ్రీని గంగసాని, శ్రీధర్‍ జూపల్లి, పూర్ణ వీరపనేని, అనిల్‍ బోడిరెడ్డి, సురేష్‍ పెద్ది, మహేశ్‍ పవార్‍, వెంకట్‍ వీరనేని, సంధ్య యల్లాప్రగడ, శ్యామ్‍ మల్లవరపు, శివకుమార్‍ రామడుగు, నిరంజన్‍ ప్రొద్దుటూరి, వెంకట్‍ మొండెద్దు, సునీల్‍ షివాలి, సాగర్‍ మలిశెట్టి, శ్రీనివాస్‍ జరుగుమల్లి తదితరులు పాల్గొన్నారు. కమ్మింగ్‍, జార్జియా ( గ్రేటర్‍ అట్లాంటా పరిధి) లోని ఎస్‍- కన్వెన్షన్‍ సెంటర్‍లో జరిగిన ఈ సమావేశంలో మొత్తం 300 మంది ప్రతినిధులు పాల్గొనడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.

Review కెసిఆర్ టీం లో దూసుకుపోతున్న ఎన్‍ఆర్‍ఐ మధు తాతా...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top