క్యారీలాం సెన్సేషన్

హాంకాంగ్‍లో మొట్టమొదటి మహిళా నాయకురాలు క్యారీలామ్‍ సెన్సేషన్‍ సృష్టిస్తోంది. చైనాలో అత్యున్నత నాయకులైన మాజీల్లో.. రెండో స్థానంలో
ఉన్న ఈమె హాంకాంగ్‍ నూతన నేతగా ఎన్నికయింది. మాజీ ఫైనాన్స్ సెక్రెటరీ అయిన జాన్‍శాంగ్‍ను ఓడించి 777 ఓట్లతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో శాంగ్‍కు 365 ఓట్లు లభించాయి. క్యారీ ఎన్నికకు అనువుగా చైనా కమ్యూనిస్ట్ నాయకత్వం నెరపిన లాబీ ఫలించింది. హాంకాంగ్‍లో బ్రిటీష్‍ ఆధిపత్యం అంతమయ్యాక ఈ సిటీకి ఇంతకుమునుపు ముగ్గురు మహిళలు చీఫ్‍ ఎగ్జిక్యూటివ్స్గా ఎన్నిక కాగా, క్యారీ నాలుగో మహిళ. ఈ నగరం పాలనా వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకుంటోందని, క్యారీలామ్‍ అభ్యర్థిత్వానికి మద్దతునివ్వాలని ఓటర్లను ఒత్తిడి చేసిందని విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ఆమె ఎన్నికకు అడ్డే లేకపోయింది. కొందరు ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆమె మద్దతుదారులతో వాదులాటకు, ఘర్షణకు దిగారు. అయితే విజయం మాత్రం ఈమెనే వరించింది

Review క్యారీలాం సెన్సేషన్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top