
కావాల్సినవి: ఆలివ్ ఆయిల్ – అరకప్పు, వెల్లుల్లి – 3 రెబ్బలు (సన్నగా తరగాలి), ఛీజ్ తురుము – కప్పు, వాంటన్ ర్యాపర్స్ – 200 గ్రాముల ప్యాకెట్ (వీటిని ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు), ఉప్పు – తగినంత.
తయారు చేసే విధానం: రెండు కప్పుల మైదాలో గుడ్డు, పావు టీ స్పూన్ ఉప్పు, అర కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. చపాతీ పిండిలా కలిపి, పైన మూత పెట్టి అరగంట సేపు ఉంచాలి. తర్వాత చిన్న చిన్న ఉండలు తీసుకుని అప్పడాల కర్రతో పలచగా ఒత్తి, నాలుగు మూలలు వచ్చేలా కత్తితో కట్ చేసి పక్కన ఉంచాలి. వీటినే ర్యాపర్స్ అంటారు.
– మూకుడులో నూనె పోసి కాగనివ్వాలి. పైన చెప్పిన విధంగా కట్ చేసి ఉంచిన ర్యాపర్స్‌ను నూనెలో వేసి రెండు వైపులా కాల్చి తీయాలి. – చిన్న గిన్నెలో ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి వేసి 30 నిమిషాల పాటు ఉంచాలి. తయారు చేసుకున్న ర్యాపర్స్కు రెండువైపులా వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్ రాయాలి. – సర్వ్ చేసే ముందు చిటికెడు ఉప్పు, మిరియాల పొడి, సన్నగా తరిగిన పుదీనా ఆకులు రెండు వైపులా చల్లాలి. కరకరలాడే ర్యాపర్స్‌ను టమాటా కెచప్‌తో సర్వ్ చేసుకోవచ్చు
Review గార్లిక్ ర్యాపర్స్.