భారత అమ్మాయికి అరుదైన గౌరవం

భారత దేశానికి చెందిన 16 ఏళ్ల బెంగ ళూరు అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది. నీటి నాణ్యతను పెంచే దిశగా ఆమె చేసిన క•షికి గాను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సైన్స్అవార్డు దక్కడంతో పాటు విశ్వంలోని ఓ చిన్న గ్రహానికి ఆమె పేరు పెట్టారు. పన్నెండో తరగతి చదువుతున్న సాహితి పింగళికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల లాస్‍ఏంజిల్స్లో జరిగిన ఇంటెల్‍ఇంటర్నేషనల్‍ సైన్స్ అండ్‍ ఇంజనీరింగ్‍ఫెయిర్‍లో సాహితి పాల్గొన్నది. ఇన్నోవేటివ్‍క్రౌండ్‍సోర్సింగ్‍అప్రోచ్‍టు మానిటరింగ్‍ఫ్రెష్‍ వాటర్‍బాడీస్‍అనే అంశంపై సాహితి చేసిన పరిశోధనకుగాను గోల్డ్మెడల్‍దక్కింది. మసాచుసెట్స్ఇన్‍స్టిట్యూట్‍ఆఫ్‍టెక్నాలజీ (ఎంఐటీ)లోని లింకన్‍ లేబరేటరీకి విశ్వంలోని చిన్న గ్రహాలకు పేర్లు పెట్టే హక్కులు ఉన్నాయి. ఈ సైన్స్ఫెయిర్‍లో ఇండియన్స్కి మొత్తం 21 అవార్డులు రాగా అందులో మూడు సాహితికే దక్కాయి. ఎర్త్అండ్‍ఎన్విరాన్‍మెంట్‍సైన్సెస్‍కేటగిరీలో ఓవరాల్‍గా రెండోస్థానంలో సాహితి నిలిచింది. తాను ఇది ఊహించలేదని, ఒక్క స్పెషల్‍అవార్డు మాత్రమే తాను ఎక్స్పెక్ట్చేశానని సాహితి చెప్పింది. ప్రస్తుతం సాహితి యూనివర్సిటీ ఆఫ్‍మిషిగన్‍లో ఇంటర్న్షిప్‍చేస్తున్నది.

ఉగ్రవాదంపై పోరాటానికి సిద్దమైన దేశాలు
కజకిస్తాన్‍రాజధాని అస్తానాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‍సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచానికి పెను సవాలుగా మారిన ఉగ్రవాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గళం వినిపించారు. వివిధ దేశాల్లో వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరాటానికి పటిష్టమైన అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక అవసరాన్ని ఆయన వివరించారు. ఎంతో కాలంగా భారత్‍, పాకిస్తాన్‍లు ఎదురుచూస్తున్న ఎస్‍సీఓ శాశ్వత సభ్యత్వానికి రంగం సిద్ధమైన నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది. 2001లో ఎస్‍సీఓ ఏర్పడిన తరువాత తొలిసారిగా విస్తరిస్తుండటం విశేషం.చైనా, రష్యా తదితర ప్రధాన దేశాల మధ్య ఆసియా దేశాధినేతలు పాల్గొంటున్న ఈ సమావేశానికి హాజరయ్యేందుకు మోదీ అస్తానా చేరుకున్నారు. ఆర్థిక, అనుసంధాన అంశాలతో పాటు ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో సహకారంపై ముందడుగు వేసేందుకు ఎస్‍సీఓ సమావేశం బాగా ఉపకరించిందని మేడీ అన్నారు. చైనా ఆధిపత్యం సాగుతున్న ఎస్‍సీఓలో శాశ్వత సభ్యత్వం ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలు, వాణిజ్య లావాదేవీల్లో భారత్‍కు మైలురాయిగా నిలుస్తుందన్నారు. భారత్‍, పాక్‍ల సభ్యత్వం… ఈ ప్రాంతాల్లో సవాళ్లను అధిగమించడానికి, వాణిజ్య, పెట్టుబడుల ప్రోత్సాహానికి దోహదపడిందని ఎస్‍సీఓ సెక్రటరీ జనరల్‍రషీద్‍అలిమోవ్‍చెప్పారు

Review భారత అమ్మాయికి అరుదైన గౌరవం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top