జనవరి 12 న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక నార్క్రాస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ సంబరాలను శూరా ఈబి 5 ఫండ్, మై టాక్స్ ఫైలర్ మరియు సంక్రాంతి రెస్టారెంట్ వారు సమర్పించగా, సుమారు 1200 మందికి పైగా హాజరై అట్లాంటా చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసారు.
ముందుగా పిల్లలకు ప్రత్యేకంగా నిర్వహించిన గ్లోబల్ ఆర్ట్ కళ మరియు ది యంగ్ లీడర్స్ అకాడమీ ఉపన్యాసం పోటీలలో సుమారు 250 మంది పిల్లలు పాల్గొని తమ ప్రావీణ్యాన్ని ప్రద ర్శించారు. ముగ్గుల పోటీలు మరియుమెహందీలో మహిళలు విరివిగా పాల్గొన్నారు. తదనంతరం సాంస్క•తిక కార్యదర్శి సుబ్బారావు మద్దాళి స్వాగతోపన్యాసం చేయగా, తామా కార్యవర్గం మరియు బోర్డు సభ్యులు జ్యోతి ప్రజ్వలనతో సాంస్క•తిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రదర్శించిన జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతం, సినీ పాటలు, న•త్యాలు, శ్లోకాలు అందరిని ఆకట్టు కున్నాయి. సాంస్క •తిక కార్యక్రమాలలో పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రాలు అందజేసారు.
అధ్యక్షులు వెంకీ గద్దె ప్రసం గిస్తూ తామా నిర్వహించే ఉచిత క్లినిక్, స్కాలర్షిప్స్, మనబడి, స్పోర్టస్, సాహిత్యం, తదితర విద్య, వైద్యం మరియు వినోద కార్యక్రమాలను వివరించారు. తామా కార్యవర్గం మరియు చైర్మన్ వినయ్ మద్దినేని సారధ్యంలో బోర్డు సభ్యుల చేతులమీదుగా స్పాన్సర్స్ శ్రీనివాస్ నిమ్మగడ్డ, హరిప్రసాద్ సాలియాన్, జాన్స్ క్రీక్ డిస్ట్రిక్ట్ 50 హౌస్ రిప్రజంటేటివ్ ఏంజెలికా కౌషె, హిందూ టెంపుల్ ప్రెసిడెంట్ షీలా లింగం, అట్లాంటా ఐటీ సర్వ్ ప్రెసిడెంట్ క్రిస్ గద్దె, స్కాలర్షిప్స్ సమన్వయకర్త సీత వల్లూరుపల్లి, మనబడి సమన్వయకర్త విజయ్ రావిళ్ల మరియు ఉపాధ్యాయని ఉపాధ్యాయులను సగౌరవంగా సత్కరించారు. మధ్య మధ్యలో గోదావరి రెస్టారెంట్, విజయ కలెక్షన్స్, నేటివ్ ట్రెండ్స్, ఏబీసీ పార్టీ హాల్ మరియు కేబీ జవేరీ వారు సమర్పించిన గ్రాండ్ రాఫుల్ విజేతలకు బహుమతులు అందజేశారు.
గాయని శిల్ప మరియు గాయకులు ప్రసాద్ సింహాద్రి తమ పాటలతో ప్రేక్షకులను మైమర పించారు. వారి పాటలకు పిల్లలు, యువతీ యువకులు వేదిక మీదకు వెళ్లి మరీ డాన్స్ చెయ్యడం విశేషం. గాయని శిల్ప నిర్వహించిన సంప్రదాయ దుస్తుల పోటీలలో మహిళలు, పిల్లలు పాల్గొనగా విజేతలకు బహుమతులు అందజేశారు. నగరంలోని ప్రముఖ వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన స్టాల్స్లో ప్రత్యేక ఆహార పదా ర్దాలు, ఆభరణాలు, వస్త్రాలు మొదలగునవి విశే షంగా ఆకట్టుకున్నాయి. పిల్లలు ఎక్కువగా ఫేస్ పెయింటింగ్ స్టాల్ దగ్గర తిరుగుతూ కనిపించారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వాలంటీర్స్ శ్రీనివాస్ లావు, అంజయ్య చౌదరి లావు, అనిల్ యలమంచిలి, ఉపేంద్ర నర్రా, వెంకట్ అడుసుమిల్లి, విజయ్ రావిళ్ల, శ్రీని బలుసు, వెంకట్ గోగినేని, విజయ్ కొత్తపల్లి, రామ్ మద్ది, మురళి బొడ్డు, విజయ్ బాబు కొత్త, యశ్వంత్ జొన్నలగడ్డ, రమణ, చైతన్య, నాగేందర్ గుత్తుల, అరుణ మద్దాళి, సునీత పొట్నూరు, అబ్దు, రీమ, సాన్వి, అక్షు, వేదికను అందంగా అలంకరించిన మేరీగోల్డ్ ఈవెంట్స్ సుజాత పొన్నాడ, ఆడియో లైటింగ్ ఫోటోగ్రఫీ అందించిన బైట్ గ్రాఫ్ ప్రశాంత్ కొల్లిపర, రుచి కరమైన భోజనాలందించిన సంక్రాంతి రెస్టారంట్ శ్రీనివాస్ నిమ్మగడ్డ, సమర్పకులు శూరా ఈబి 5 ఫండ్ ప్రసాద్ గద్దె, మై టాక్స్ ఫైలర్ హరిప్రసాద్ సాలియాన్, నార్క్రాస్ ఉన్నత పాఠశాల యాజ మాన్యం, వ్యాఖ్యాత శ్రీధర్, ది యంగ్ లీడర్స్ అకాడమీ కమల వడ్లమూడి, గ్లోబల్ ఆర్ట్ సుధ గోపాలక•ష్ణన్, తామా కార్యవర్గ మరియు బోర్డు సభ్యులకు వెంకీ గద్దె ధన్య వాదాలు తెలియజేసి విజయ వంతంగా ముగించారు.
-వెంకి గద్దె,
ప్రెసిడెంట్, తామా
Review ఘనంగా అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ సంక్రాంతి సంబరాలు.