చక్కటి చిరునవ్వుకు కేర్ ఫ్ అడ్రస్ ప్రిస్టిన్ ఆర్థోడెంటిక్స్

ఆనందమైన జీవితం గడిపేందుకు మన అందమైన చిరునవ్వు ఎంతో ముఖ్య భూమిక పోషిస్తుంది. అంతేకాదు ఆ అందమైన చిరునవ్వు ఎదుటివారికి మీ మీద మంచి అభిప్రాయాన్ని కల్పించడమే కాదు.. మీ మీద గౌరవాన్ని కూడా రెట్టింపు చేస్తుంది.
మరి అందమైన చిరునవ్వును మీ సొంతం చేసుకోవాలంటే దంత సంరక్షణ ఏంతో ముఖ్యం. ఇలాంటి చక్కటి చిరునవ్వును ప్రజలకు దంత చికిత్స ద్వారా అందిస్తున్నారు అమెరికాలోని టెక్సాస్‍ రాష్ట్రంలో ఆర్థోడెంటిస్ట్ డా. నిమేష్‍ పటేల్‍. స్థానిక ప్లానో పట్టణం, హెడ్కోక్‍ రోడ్‍లో ప్రిస్టైన్‍ ఆర్థోడెంటిక్స్ ద్వారా వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ప్రతి ఒక్కరు అందమైన చిరునవ్వుతో జీవించాలన్నది తన కోరిక అని చెబుతారు డా. నిమేష్‍.
డా. నిమేష్‍ పటేల్‍.. యూనివర్సిటీ ఆఫ్‍ పెన్సిల్వేనియా నుంచి స్కూల్‍ ఆఫ్‍ డెంటల్‍ మెడిసిన్‍ లో డాక్టర్‍ ఆఫ్‍ డెంటల్‍ మెడిసిన్‍ (ణవీణ) పూర్తి చేశారు. అలాగే మూడేళ్ల పాటు ట్రెయినింగ్‍ చేయడంతో పాటు.., కొలంబియా యూనివర్సిటీ నుంచి ఆర్థోడెంటిక్స్ లో మాస్టర్‍ డిగ్రీ పూర్తి చేశారు.
దంత వైద్యమంటే డా. నిమేష్‍ పటేల్‍కి ఎంతో ఇష్టం. అందుకే రెండు యూనివర్సిటీల్లో ఆయా కోర్సులు పూర్తి చేశారు. ప్రతి ఒక్కరు చక్కటి, అందమైన చిరునవ్వుతో ఉండాలని కోరుకునే డా. నిమేష్‍ పటేల్‍.., అందుకోసం ప్లానోలో డెంటల్‍ క్లినిక్‍ ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. దంత సమస్యలపై ఏ ఒక్కరు కూడా అశ్రద్ధ చేయకూడదని.., తరచూ వైద్యులను సంప్రదించడం ద్వారా చక్కటి చిరునవ్వుతో జీవితాన్ని గడపవచ్చని ఆయన చెబుతుంటారు. అంతేకాదు అమెరికాలాంటి దేశాల్లో చక్కటి చిరునవ్వు కోసం దంత సంరక్షణ కోసం ఎంతో ప్రాధాన్యత ఇస్తారని డా. నిమేష్‍ పటేల్‍• చెబుతున్నారు. అంతేకాదు డా. నిమేష్‍ పటేల్‍• దంత వైద్యులే కాదు ఓ చక్కటి రచయిత కూడా. దంత వైద్యానికి సంబంధించి స్మైలింగ్‍ ఫర్‍ సక్సెస్‍ అనే బుక్‍ కూడా రాశారు. ఈ బుక్‍ ని ఈ కామర్స్ అమెజాన్‍లో అందుబాటులో ఉంచారు.

Review చక్కటి చిరునవ్వుకు కేర్ ఫ్ అడ్రస్ ప్రిస్టిన్ ఆర్థోడెంటిక్స్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top