మన కళలను సాకారం చేసు కునేందుకు.. మాత•భూమిని విడిచి ఎక్కడో విదేశాల్లో జీవిత గమనంలో స్థిర పడుతుంటారు. ఇక్కడి ఆచార వ్యవ హారాలు, సంస్కృతి వారి చిన్నారులకు నేర్పించాలనుకుంటారు. అలాంటి వారికోసమే అట్లాంటాలో నివసిస్తున్న భారతీయుల కోసం, 4 సంవత్సరాలు ఆపైన వయసున్న పిల్లల కోసం జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజ్నా అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. విదేశాల్లో మన సంస్కృతి, సంప్రదాయాలు, హైందవ విలువలను ప్రచారం చేయడానికే జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రజ్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం పిల్లల్లో మంచి విజ్ఞానం కలిగించే కార్యక్రమంగా ఉపకరిస్తుంది. దాదాపు 5000లకు పైగా చిన్నారులు ఈ ప్రజ్నా కార్యక్రమంలో చేరి విద్యనభ్యసించి వేదాలు, పురాణాలపై పరిశోధనలు ప్రారంభించారు. ఇదొక మనిషి యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని మరింత పెంపొందించే కార్యక్రమంగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా భగవద్గీత మరియు భాగావతాల ఆధారంగా యోగా, ధ్యానం, ప్రార్ధనలు ఏ విధంగా చేయాలో నేర్చుకుంటారు. అలాగే ఉపనిషత్తులు, పురాణాల కథలు కూడా ఇందులో విద్యార్థులకు బోధిస్తారు. వీటితో పాటు పండుగలు జరుపుకోవడం, నాటకాలు వేయడం లాంటివి అభ్యసిస్తారు. ఈ ప్రజ్ఞా కార్యక్రమం ప్రతి సంవత్సరం పాఠశాల ప్రారంభంతో మొదలై పాఠశాల పూర్తవడంతో ముగుస్తుంది. దీనిని మాడ్యుల్ అంటారు. ప్రతి సంవత్సరం మాడ్యుల్ పూర్తిచేసుకున్న విద్యార్థి తరువాతి మాడ్యుల్ లోకి ప్రవేశిస్తాడు. మొదటి మాడ్యుల్లో చేరే విద్యార్ధులు ఉదయం లేవగానే ప్రార్ధన చేయడం, సూర్య నమస్కారాలు, స్నానం చేసినప్పుడు, చదువడం ప్రారంభించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీర్ధం, ప్రసాదం ఎలా తీసుకోవాలి అనే ప్రాధమిక అంశాలను నేర్చుకుంటారు. పెద్ద మాడ్యుల్ లో చదివే విద్యార్థులు తల్లిదండ్రులు, గురువులను గౌరవించడం, స్నేహం విలువలు, కొత్త విషయాలు నేర్చుకోవడం వాటియొక్క ప్రాముఖ్యత, రుషుల గురించి తెలుసుకుంటారు. దీంతో పాటు విష్ణు సహస్ర నామం, భగవద్గీత, పలు ఉపనిషత్తులను వారి మాడ్యుల్‍లను పూర్తిచేసుకునే లోగా నేర్చుకుంటారు. అలాగే ముఖ్యమైన పండగలు, వాటి నేపథ్యం, ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. ఈ ప్రజ్నా కార్యక్రమం అట్లాంటాలో 2010 నుంచి నిర్వహిస్తూ వస్తోంది జియర్ ట్రస్ట్. అప్పటినుంచి ఇప్పటివరకు 500పైగా విద్యార్థులు ఇందులో పట్టభద్రులయ్యారు. వీళ్లంతా అల్ఫారెట్టా, కమ్మింగ్ ప్రాంతాల్లో క్తాసులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రజ్నాలో చేరాలనుకునే పిల్లలు www.prajna4me.org లో రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే తెలుగు భాష తరగతులను సైతం నిర్వహించే జియర్ ట్రస్టు.. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. ఈ ప్రజ్నా కార్యక్రమంలో విద్యార్ధులు చెట్లు నాటడం, ఆహారం పంపిణీ వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుని నుంచి ప్రత్యేక మెడల్ ప్రజ్నా కార్యక్రమానికి లభించింది.
Review చిన్నజీయర్ స్వామి ఆశీర్వాద్తలతో చిన్నారులకు శిక్షణా తరగతులు.