ఎవరు మేము.. ?
తెలుగు వెలుగుల మేళనం.
కవుల కవితా భోజనం
వైద్యో నారాయణుల వారధులం
అట్లాంటా నగరానికి మణిహారులం.
తెలుగు సంప్రదాయ సాహిత్య పిపాసులం.
అచ్చమైన, స్వచ••మైన తెలుగింటి లోగిలి
మా తెలుగు సంస్క •తి వేదిక’
అంటూ అట్లాంటా తెలుగువారు ముక్త కంఠాన
ఎలుగెత్తి చాటిన శుభ దినమది.
తెలుగింటి సాంప్రదాయాలకు నిలువెత్తు దర్పణంగా మిళమిళ మెరిసే పట్టు చీరలు, తళతళలాడే పట్టు పంచెలు.. చిన్నారుల సాంప్రదాయ కట్టుబొట్టు.. ఆపైన పసందుగా సాగిన న•త్యాలు.. అందంగా కొలువు తీరిన బొమ్మలు.. గొబ్బెమ్మలతో కోలాటాలు, గంగిరెద్దు న•త్య విన్యాసాలు..చిన్నారుల ఆటపాటలు..నాట్య మయూరాల సవ్వడులు.. ఘుమ ఘమలాడే తెలుగువారి వంటలు…అరిటాకు భోజనాలు… ఇలా, ఒకటేమిటీ.. అక్కడ ఎటు చూసినా తెలుగుదనం ఓ పచ్చటి పంట చేనులా పరవశించింది.. పులకరించింది. పల్లెపదాలు, పల్లియల అందాలతో ఎటు విన్నా తెలుగు పదాల గుబాళింపులే. సంక్రాంతి లక్ష్మిని అట్లాంటా నగరం సాదరంగ స్వాగతించిన వేళ అది.
జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అట్లాంటా తెలుగు సంస్క •తి నిర్వహించిన మకర సంక్రాంతి వేడుకలను కన్నులారా చూసిన వారిదే వైభోగం.
సాంస్క •తిక కార్యక్రమాలు ఒకటా రెండా ప్రతి ఒక్కటీ విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల గాన కచేరీ, పెద్ద పిల్లల పాటల పోటీలు, వయొలిన్ పై త్యాగరాజ క•తులు, చిన్నారుల సినిమా పాటల న•త్యాలతో సంక్రాంతి శోభకు కొత్త రంగులు అద్దినట్లయింది. శ్రీవర్షిణీ సిస్టర్స్ గాత్ర కచేరీ వీనులవిందుగా సాగింది.
శశికళ పెనుమర్తి నేత•త్వంలో సాగిన సంక్రాంతి పండుగ నాట్యం ఆహుతులను అలరించింది.
అలాగే పుష్యమి గొట్టిపాటి చేసిన కూచిపూడి న•త్య ప్రదర్శన మన సాంప్రదాయ న•త్యానికే మరింత వన్నెతెచ్చింది. శ్రీవర్షిణి సుమధుర గానంతో అన్నమయ్య కీర్తనలతో ఆలపించి సభికులను భక్తి పారవశ్యంలో ఊయలలూగిం చారు. నీలిమ గడ్డమణుగు తన నాట్య బ•ంద సహకారంతో కొనసాగించిన సాంప్రదాయ భక్తి న•త్యాలు విశేషంగా ఆకర్షించాయి. నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ స్కూల్‍కి చెందిన అఖిల కొనకంచి, మహతి సిరిపురపు, అమూల్య వేమూరిల గణేశ పంచరత్నం, లింగాష్టకం నాట్య ప్రదర్శనలు ఆద్యంతం భక్తి భావనను పెంపొందించాయి. ఇక, శ్రీవాణి సోదెమ్మ వేషంలో సోదిజెప్పడం విశే షంగా ఆకర్షించింది.
అనూష బొంత శ్రీ గణపతి సేవింపరారే, మీనాక్షి మేముదం మంగళం సభికులను మంత్ర ముగ్ధులను చేశాయి. ఇక అనిల కొడుకుల, తన్మయ్ కేశవరాజు, అర్చితా కేశవరాజు, ఆదిత్య కార్తీక్ ఉపాధ్యాయుల, సౌమ్య మేడూరి, అలేఖ్య ధర్మవరం, మానస ధర్మవరం, అమ •త చల్ల, అమూల్య వేమూరి, ఐశ్వర్య యద్దనపూడి, వైష్ణవి తెలకపల్లి, క•ష్ణ శాండిల్య తెలకపల్లి, భవ్య విష్ణుభొట్ల, శ్రీజిత్ విష్ణుభొట్ల (వయొలిన్) సంహిత కొప్పోలు, సరయు కాళ్లకూరి, సహస్ర కొప్పోలు, సహస్ర కాళ్లకూరి, శరణ్య కాళ్ళకూరి, రిఖిల్ సాయి దువ్వూరి.. వీరంతా స్వరరాగ కోయిలలుగా భాసిల్లారు.
కాగా, ఆశ్రిత వెన్నెలకంటి, జయని కారు మంచి, తరుణ్ రాఘవ్ కారు మంచి, మహతి సిరిపురపు, అఖిల కొనకంచి, ప్రణతి స్వయం పాకులా, రితిక దుర్వాసుల, శ్రేయ దుర్వాసుల, అమూల్య వేమూరి, ఐశ్వర్య యద్దన పూడి, వైష్ణవి తెలకపల్లి, క•ష్ణ శాండిల్య తెలకపల్లి, భవ్య విష్ణుభొట్ల, అలేఖ్య ధర్మవరం ఈ కార్యక్రమంలో నాట్య మయూరాలై ఆహుతులను పరవశింప జేశారు.
సంక్రాంతి వేడుకల్లోనే కవితా గోష్టి సాగడం కార్యక్రమానికి మరింత వన్నెతెచ్చింది. శ్రీయుతులు భోగరావు పప్పు, మాధవ్ దుర్బ, ఫణి డొక్కా, పండిట్ బి.దేవిదాస్, నేమాని సోమ యాజులు, రమేష్ వల్లూరి, సంధ్య యల్లాప్రగడ, ప్రసాద్ నిమ్మగడ్డ వంటి వారు కవితా గోష్టిలో పాల్గొన్నారు.
సంగీత విభావరి వీనుల విందుగా సాగింది. ఈ కార్యక్రమంలో రామ్ దుర్వాసుల, వెంకట్ చెన్నుభోట్ల, శ్రీనివాస్ దుర్గం, శాంతి మేడిచెర్ల, భాను వావికొలను, కిశోర్ మేడూరి వంటి వారు పాల్గొనడాన్ని విశేషంగా చెప్పుకోవచ్చు.
తెలుగు సంస్క•తి సేవ కార్యకర్తలు, శ్యామల గంగరాజు, శ్రీరామ్ కొత్తూరి, సునీల్ తట్ట, ప్రశాంత్ విష్ణుభొట్ల, రూప యద్దనపూడి, మానస మొక్కపాటి, రాధా ధర్మవరం, శ్రీదేవి మైలవరపు, శేషు మారెళ్లపూడి, రవి కిరణ్ వడ్డమాను, శ్రీవాణి కంచిబొట్ల వంటి ఎందరో సేవా ధురంధరులు భాగస్వాములవడం వల్లనే ఈ ఏటి మకర సంకాంత్రి వేడుకలను ‘అట్లాంటా తెలుగు
సంస్క•తి’ ఎంతో ఘనంగా నిర్వహించగలిగిం దన్నది అక్షర సత్యం.
శాంతి మేడిచెర్ల, వెంకట్ చెన్నుబోట్ల , రామ్ దుర్వాసుల , శ్రీనివాస్ దుర్గం, భాను వావికొలను అందించిన సేవలను నిర్వాహకులు కొని యాడారు. ఫణి డొక్కా ఈ కార్యక్రమంలో అందరిని అలరించిన తీరు ప్రశంస నీయం. కిశోర్ మేడూరి సేవలు ఎన్నదగినవి.
శ్రీరాం కొత్తూరి, సునీల్ తట్టా (ఫుడ్ అండ్ లాజిస్టిక్స్), శేషు మారెల్లపూడి (లాజిస్టిక్స్ , ఫైనాన్స్), శ్యామల- రవి (డాన్స్), ప్రశాంత్ విష్ణుభొట్ల (లాజిస్టిక్స్), రమేష్ వల్లూరి (ఈవెంట్ మేనేజ్‍మెంట్) శ్రీదేవి మైలవరపు, రూపా యద్దనపూడి (డాన్స్, సింగింగ్), రాధా దర్మవరం (డాన్స్, లాజిస్టిక్స్), రవి కిరణ్ వడ్డమాను (ఫొటోగ్రఫీ), మానస మొక్కపాటి (సింగింగ్) ఈ కార్యక్రమాలకు వాలటీర్లుగా ఎనలేని సేవ లందించారు.
ఈ కార్యక్రమం ఇంతటి ఘనంగా జరగడానికి ఆర్థిక సహకారం అందించిన దాతలను ‘తెలుగు సంస్క •తి’ వందనాలర్పించింది. ఇక చక్కటి ఫొటోలు తీసిన సురేష్ గారికి, రవికిరణ్ వద్దామ, టీవీ 5 – పవన్‍లు ఇంకా ఎన్నో రూపాల్లో సేవ లందించిన వారందరికీ నిర్వహాకులు పేరు పేరునా ధన్యవాదాలు సమర్పించారు. అట్లాం టాలో నూతన తేజంతో తెలుగు సంప్రదాయాలకు నిలువెత్తు సూచికగా సాగిన మకర సంక్రాంతి వేడుకలు అమెరికాలోని మిగాతా ప్రాంతాలవారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Review చూసినవారిదే వైభోగం.