తెలంగాణ సైన్స్ ఎక్స్ లెన్స్ పురష్కారం

అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ తెలంగాణ మహాసభలలో ప్రొఫెసర్‍ దూదిపాల సాంబరెడ్డికి ప్రతిష్ఠాత్మక ‘తెలంగాణ సైన్స్ ఎక్స్లెన్స్ పురష్కారం’ ప్రధానం చేశారు. అమెరికాలో హౌస్టన్‍ మహానగరంలో జూన్‍ 29 నుండి జులై 2 వరకు జార్జ్ బ్రౌన్‍ కన్వెన్షన్‍ సెంటర్‍లో జరిగిన ద్వితీయ తెలంగాణ ప్రపంచ మహాసభలలో ప్రత్యేక బ్యాంకువేట్‍ అవార్డు సభలో, టెక్సాస్‍ ఏ•ఎమ్‍ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‍ డా. సాంబరెడ్డిని ‘తెలంగాణ మహాసభల’ బ•ందం తెలుగు సంప్రదాయాలతో ఘనంగా సత్కరించారు.
శాస్త్ర సాంకేతిక రంగంలో నిస్వార్థంగా, అత్యంత ప్రతిభతో గత 20 సంవత్సరాలుగా ప్రొఫెసర్‍ సాంబ రెడ్డి చేసిన పరిశోధనలకు మరియు సేవ నిరతకు గుర్తింపుగా ఈ విశిష్ట పురష్కారాన్ని ఇస్తున్నట్లు మహాసభల నాయకత్వ బ•ందం ప్రకటించింది. ఇట్టి విషయాన్ని పాలపిట్ట అనే సావెనీర్‍లో కూడా విడుదల చేశారు. వేల మందితో కిక్కిరిసిన ఈ మహాసభలకు అమెరికా అన్ని రాష్ట్రాలనుండి తెలుగు మరియు తెలంగాణ ప్రవాసులు ప్రముఖులు హాజ రయ్యారు. తెలంగాణ మంత్రి జగదీష్‍ రెడ్డి, వీ• సీతారాం నాయక్‍తో పాటు ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు.
తెలంగాణ మహాసభల ఎగ్జిక్యూటివ్‍ మరియు కన్వెన్షన్‍ బ•ంద నేత•త్వములో అత్యంత వైభవంగా, మాత• సంస్క •తిని మరిచిపోలేని విధంగా జరిగిన, ప్రారంభ డిన్నర్‍ వేడుక సభలో చీఫ్‍ గెస్ట్గా విచ్చేసిన గౌరవ తెలంగాణ పార్లమెంట్‍ లీడర్‍ వీ• జితేందర్‍ రెడ్డి గారు ఈ సత్కారాన్ని డా. సాంబరెడ్డికి అందజేసి పుష్పగుచ్ఛముతో గౌరవించారు. అమెరికా తెలంగాణ మహాసభల ఆర్గనైజర్లు కరుణాకర్‍ మాధవారపు (చైర్మన్‍), సత్యనారాయణ రెడ్డి కందిమల్ల (ప్రెసిడెంట్‍), శ్రీధర్‍ కాంచనకుంట్ల (డైరెక్టర్‍), వినోద్‍ కుకునూర్‍ (ప్రెసిడెంట్‍-ఎలెక్ట్), బంగారెడ్డి ఆలూరి (కన్వీనర్‍), జగపతి రెడ్డి వీరటి (కోఆర్డినేటర్‍), డా. రాజేందర్‍ అపారసు (అవార్డు చైర్‍), బోర్డు మెంబర్లు, కన్వెన్షన్‍ సభ్యులు, కన్వెన్షన్‍ కమిటి చైర్మన్లు, తెలంగాణ అసోసియేషన్‍ అఫ్‍ గ్రేటర్‍ హౌస్టన్‍, తెలుగు కల్చరల్‍ అసోసియేషన్‍ హౌస్టన్‍ సభ్యులు మరియు తదితరులు ఈ అవార్డు సభలో హాజరయ్యారు.
వరంగల్‍ జిల్లా పరకాల మండల పరిధిలోని ఒక చిన్న గ్రామం చెర్లపల్లిలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించి, ప్రతిరోజూ కాలినడకతో స్కూల్‍కి వెళ్లి, స్వయంశక్తితో విద్యాభ్యాసం చేసిన డా. సాంబరెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయ ఫార్మసీలో ఆరు బంగారు పతకాలతో పట్టభద్రులయ్యారు. అటు తరువాత స్వతంత్ర బాటలో పంజాబ్‍ విశ్వవిద్యాలయ ఫార్మసీలో పీహెడీ చేసి, అత్యధిక శాస్త్ర అధ్యయనాలు ప్రచురించి లిమ్‍కా రికార్డు స•ష్టించారు.
డా. సాంబరెడ్డి ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్‍ ఏ•ఎమ్‍ విశ్వవిద్యాలయం వైద్య శాస్త్ర ప్రొఫెసర్‍గా సేవలందిస్తున్నారు. అమెరికాలోని అత్యంత ప్రసిద్ధి గాంచిన శాస్త్ర సంస్థలయిన వీ• (అమెరికన్‍ అసోసియేషన్‍ ఫర్‍ ది అడ్వాన్స్మెంట్‍ అఫ్‍ సైన్స్), •••• (అమెరికన్‍ అసోసియేషన్‍ అఫ్‍ ఫార్మా స్యూటికల్‍ సొసైటీ), •జు• (అమెరికన్‍ ఎపిలెప్సీ సొసైటీ)నుంచి ‘ఫెల్లో’ (శాశ్వత సభ్యత్వము) అనే అతికొద్ది శాస్త్రవేత్తలకిచ్చే ముఖ్యమైన పురస్కారాలు అందుకున్న మొట్టమొదటి తెలుగు భారతీయుడు. ఫార్మసీ మెడికల్‍ రంగాల్లో 180 పేపర్స్, డజన్‍కు పైగా మెడికల్‍ పుస్తకాలు రచించిన అయిన ఇంటర్‍నేషనల్‍ సైన్స్ పండిత డాక్టర్లలో ఒక అసామాన్యుడుగా ప్రసిద్ధి పొందారు.
అయన గత 24 సంవత్సరాల నుండి మెదడు జబ్బుల సైన్స్ అధ్యయనంలో ప్రతిరోజూ కష్ట పడుతున్నాడు. ఫిట్స్ వ్యాధికి ఒక మెడిసిన్‍ కని పెట్టాడు. ఎన్నో పరిశోధనలు చేసి, ఎపిలెప్సీ రోగ నిర్మూలనం కోసం ‘న్యూరో కోడ్‍’ కనిపెట్టి చరిత్ర స•ష్టించాడు. మెదడు దెబ్బల నుచి న్యూరోలాజికల్‍ జబ్బులు రాకుండా ఒక కొత్త ‘ఏపిజెనెటిక్‍’ చికిత్స విధానాన్ని ఇటీవలే ప్రక టించారు. డా. సాంబరెడ్డి డబ్బు సంపాదనే ధ్యేయంగా కాకుండా, మెడికల్‍ శాస్త్ర సాంకేతిక రంగంలో తాను పొందిన జ్ఞానాన్ని, ప్రపంచ మానవాళికి ఉపయోగపడే విధంగా, మెదడు జబ్బులకు కొత్త మందులు కనిపెట్టి న్యూరోలాజికల్‍ రోగులకు స•జనాత్మక చికిత్స లందించి వారి జబ్బుల నియంత్రణకు సహాయం చేయడమే తన జీవిత ధ్యేయంగా మలచుకున్నారు.
మరో విశేషం ఏమంటే, 2012, 2013, 2014లో వరుసగా అమెరికాలోని ప్రముఖ తెలుగు అసోసియేషన్స్ ‘నాటా’, ‘తానా,’ మరియు ‘ఆటా’ సంస్థలనుచి రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డు సాధించి, హ్యాట్రిక్‍ స•ష్టించిన ఏకైక తెలుగు ప్రవాస భార తీయుడు. శాస్త్రవేత్తగా ల్యాబ్‍లో బాగా బిజీగా వుంటూనే, అమెరికన్‍ చారిటబుల్‍ సంస్థల ద్వారా అయన మెడికల్‍ క్యాంపులు, జనరల్‍ స్క్రీనింగ్‍, వాక్సినేషన్‍, వ్యాధి నిరోధక ఆహారం, వ్యాయామం, లాఫింగ్‍ యోగా లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. నేను సైతం అంటు మానవీయ విలువలు కలిగిన ఒక కర్మయోగిలా, ప్రమాదాలు సంభవించిన విద్యార్థులకు, అమెరికాలో యాక్సిడెంట్‍ డెత్‍ జరిగిన చాలా కుటుంబాలకు చాలాసార్లు సేవ చేశారు.
డా. సాంబరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇంతటి ఘనమైన ‘తెలంగాణ సైన్స్ పురష్కారం’ ఇంతచిన్న వయసు లోనే అందుకోవడం ఒక మంచి అద•ష్టంగా భావిస్తు న్నాను. మీలో ఒకడిగా ఒక తెలంగాణ బిడ్డగా ఇంతటి గౌరవం నాకు ఇవ్వడానికి సహకరించిన సువిశాల నాయకులకి అందరికీ• నా హ•దయ పూర్వక క•తజ్ఞతలు. ఈ పురస్కారానికి ఇంకా ఎంతో వన్నె తెచ్చి, రానున్న కాలంలో మరెన్నో శాస్త్ర విజయాలు సాధించి తెలంగాణ గడ్డకి మన భారతీయులందరి కీర్తిప్రతిష్టలు పెంపొందించి మన కుటుంబాలకు ముఖ్యంగా మన పిల్లలకు మార్గదర్శిగా వుంటూ, సామాజిక సేవ చెయ్యడమే నా ఆశయం అని అత్యంత క•తజ్ఞత భావంతో పేర్కొన్నారు. తానకు జన్మనిచ్చి, శాస్త్రవేత్తగా ఎదగడానికి పునాది వేసి, స్వర్గస్తులయిన మా ‘అమ్మ – నాన్న’ లకు పాదాభివందనం చేస్తూ, ఈ అవార్డును నా మాత•మూర్తుల జ్ఞాపకంగా వారికి అంకితం చేస్తున్నా’’నని పేర్కొన్నారు.
ఫార్మసీ ఫార్మకాలజీ రంగాల్లో అత్యంత ప్రతిభతో మెదడు జబ్బుల మందు లను కనిపెట్టిన తెలుగుతేజం, హిందూ-రతన్‍ గ్రహీత డా. సాంబరెడ్డి జీవిత చరిత్రని ప్రతిష్టాత్మక భారత శాస్త్రవేత్తల చరిత్ర జాబితాలో ప్రచురించారు. ఒక కుగ్రామం నుంచి అమెరికాలో టాప్‍ ప్రొఫెసర్‍ గా ఎదిగి, వైద్య శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటుతూ, తెలుగు వారందరికి కీర్తి తెస్తున్న డా. సాంబరెడ్డి ‘జీవిత పురష్కారం’ • ‘పద్మశ్రీ’ లాంటి పురష్కారానికి అత్యంత అర్హత కలిగిన భారత శాస్త్రవేత్త అని పలువురు పేర్కొన్నారు.

Review తెలంగాణ సైన్స్ ఎక్స్ లెన్స్ పురష్కారం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top