దాసరికి అశ్వినివాళి

తెలుగు సినిమా ప్రపంచానికి ఎనలేని సేవ లందించిన దాసరి నారాయరావు మ•తి పట్ల శ్రద్దాంజలి కార్యక్రమాన్ని తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్‍ లోని హిల్‍ టాప్‍ రెస్టారెంట్‍ హాల్‍లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి•గా నిర్మాత తమ్మారెడ్డి భరద్వా• పాల్గొన్నారు. కష్టం అని తలుపు తడితే ఆదుకునే ఆపన్న హస్తాన్ని తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయింది. దర్శకుడికి ప్రత్యేక గౌరవం తెచ్చిన వ్యక్తి దాసరి అని అలాగే అన్ని శాఖల్లోనూ ఆయన సత్తా చూపించారన్నారు. దాసరితో తమకున్న సన్నిహిత సంబంధాలను ప్రవాస భారతీయులతో తమ్మారెడ్డి పంచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు దాసరి చేసిన సేవలను తెలుగు సంఘం నాయకుడు ప్రసాద్‍ తోటకూర వెల్లడించారు. అంతకుముందు దివంగత దాసరి నారాయణరావు చిత్ర పటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రవాసాంధ్రులతో పాటు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, డాక్టర్‍. సుబ్బరాయ చౌదరి, ఆర్‍కె. పండితి, చిట్టి ముత్యాల, ప్రసాద్‍ తోటకూర, క్రిష్ణ పుట్టపర్తి, క్రిష్ణారెడ్డి ఉప్పలపాటి, ఉర్మిండి నరసింహారెడ్డి, ప్రతాప్‍ రెడ్డి, భీమ్‍ రెడ్డి, సుబ్బు జొన్నలగడ్డ, విజయ్‍ కాకర్ల, శ్రీధర్‍ కొర్సపాటి, చంద్ర కె బండార్‍, శ్రీనివాస్‍ ఏవీఎమ్‍ (బాబీ), సుగన్‍ చాగర్లమూడి, రామకృష్ణారెడ్డి వొడ్డ, రాజేష్‍ అడుసుమిల్లి, శ్రీకాంత్‍ పోలవరపు, శ్రీనివాస్‍ కోనేరు తదితరులు పాల్గొన్నారు.

Review దాసరికి అశ్వినివాళి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top