రమణ మహర్షి దగ్గరికి ఓసారి పాశ్చాత్యుడు వెళ్ళి సలహా అడిగాడట – ‘స్వామీ! నాకు ఈ ప్రపంచానికి సేవచేయాలని ఉంది. ఎలా చేయమంటారు? అని అందుకు మహర్షి చెప్పారట – నాయనా ముందు నీకు నువ్వు సేవ చేసుకో. ప్రపంచానికి సేవ చేసినట్లే అని ఈ సరళమైన సలహాలో చాలా అంతరార్థం ఉంది. కాఠిన్యమూ ఉంది.
మనిషి తనను తాను ఉద్ధరించు కోవడమంటే ఎలా ? సాటి మనిషిని దోచుకుని సంపద దాచుకోవడమా, మేడలు భవంతులు కట్టి బంగరు కుర్చీల మీద కూర్చుని బంగరు పళ్లెంలో భోంచేయడమా, ఐహిక విలాసాల్లో మునిగి తేలడమా? ఇవేవీ కావు. తనను తాను ఉద్ధరించుకోవడమంటే, ఆత్మజ్ఞానం పొందటం భగవంతుడిచ్చిన ఈ జీవితం విలువ తెలుసుకోవడం కామక్రోధాది అంతశ్శత్రువుల్ని దూరంగా ఉంచడం. అంతకుమించి క్రమశిక్షణ, సమయ పాలన, సత్సాంగత్యం, స్వాధ్యయనం పరోపకారచింతన, ధర్మనిరతి, సత్యసంధతతో బతుకు గడపటం. ఇవన్నీ చెప్పడం ఎంత సులభమో ఆచరణలో పెట్టడం అంత కష్టతరం!
బాపూజీ రోజులానే ఉదయం తన ఆశ్రమంలో కూర్చొని, గోధుమల్లోని రాళ్లు ఏరుతున్నారు. అప్పుడు ఓ పాశ్చాత్య విలేఖరి అక్కడికి వెళ్లాడు. బాపూజీని రెండే రెండు ప్రశ్నలడిగేందుకు, ఆయన సహచరుడి నుంచి అతి కష్టం మీద అనుమతి తీసుకున్నాడు. ఆ విలేఖరి లోనికి వెళ్ళి గాంధీజీ చేస్తున్న పని చూసి నివ్వెరపోయాడు. ‘బాపూ! మీరు గోధుమల్లో రాళ్ళేరుతున్నారా?అని ప్రశ్నించగానే, మీ మొదటి ప్రశ్న అయిపోయింది. రెండో ప్రశ్న? అన్నారట ఆయన పరమ శాంతంగా, ఆ విలేఖరి కంగుతిని ఏమిటీ …. అప్పుడే రెండో ప్రశ్నా? అనడంతో మీ రెండు ప్రశ్నలూ అయిపోయాయి. ఇక వెళ్లొచ్చు అని బదులిచ్చారు బాపూ. సమయపాలనకు అంతటి విలువ ఇవ్వడంవల్లే ఆయన జాతిపిత అయ్యారు.
వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ భారత భాగవతాలు, భగవద్గీత, అష్టాదశ పురాణాలతో పాటు, రుషులు, సిద్ధులు, యోగులు, ప్రవక్తలు రాసిన ఎన్నో గ్రంథాలు ఈ భూమిలో అందుబాటులో ఉన్నాయి. వీటిని అధ్యయనం చేయడం, వీటి సారాన్ని అందజేసే ఆధ్యాత్మిక వేత్తల ప్రవచనాల్ని వినడం అందరి కర్తవ్యం. భక్తి, జ్ఞానం అనే రెండు నయనాలతో విశ్వపతిని దర్శించేందుకు ప్రయత్నించాలి. మానవుడిలో మాధవుణ్ని చూసి ప్రేమించే సంస్కారాన్ని సముపార్జించడం ముఖ్యం. మన జీవన రథానికి ధర్మం. సత్యం అనే రెండు చక్రాలుంటాయి. వాటిని సర్వదా కాపాడుకోవాలి. ఆ రెండింటినీ నమ్మి జీవనయాత్ర సాగించిన ఎందరో పురాణ పురుషులు మనకు ప్రాతఃస్మరణీయులు, వందనీయులు, అనుసరణీయులు.
జీవితంలో మనిషి అనేక పాత్రు పోషిస్తాడు. తండ్రి, తనయుడు, భర్త, సోదరుడు, గురువు, మిత్రుడు, నాయకుడు, కవి, కళాకారుడుగానూ వ్యవహరిస్తాడు. మహిళ తనయ, సోదరి, భార్య, త్లి నాయకురాలిగా ఎంత ఆర్శవంతంగా ఉండాలో మన పురాణ గాథలు చెబుతున్నాయి.
చెలమను తవ్వుతున్నకొద్దీ మంచి నీరు ఊరుతుంటుంది. గురువును ప్రశ్నించినకొద్దీ జ్ఞానం వృద్ధి చెందుతుంది. అద్యయనం చేసినకొద్దీ వివేకం పెరుగుతుంటుంది. అందుకు మనిషి నిరంతర ప్రయత్నం సాగించాలి. ప్రయత్నమే ప్రథమ విజయం’ అని పెద్దల మాట.
వ్యక్తి వికాసానికి అనేక మార్గాలున్నాయి. తనకు అనుకూలమైన మార్గానిన ఎంచుకోవటం, ముందుకు పయనించడమే మనిషి చేయాల్సిన పనులు. సహనం, సంయమనం, సాత్కి చింతనం, ఇంద్రియ నిగ్రహం, ప్రసన్నత, వాక్శుద్ధి, సద్వర్తనం ఆధ్యాత్మిక సౌధానికి అసలైన సోపానాలు. సర్వ జీవరాశులను ప్రమించే సంస్క•తిని సాతన ధర్మం మనకు అందించింది. శాంతిమంత్రాన్ని నేర్పింది. ‘సర్వే జనా స్సుఖినో భవస్తు’అనే సువిశాల, మానవతా దృక్పథాన్ని నిర్దేశించింది. మెతుకు కోసం కాదు బతుకు వెతకడం కోసం అనే సత్యాన్ని ప్రబోధించింది వెతకడం అంటే అన్వేషణ. జ్ఞానం, ధర్మం, విశ్వకల్యాణం, విలువల పరిరక్షణ కోసమే అన్వేషణ కొనసాగాలి. అప్పుడే మనిషి తనను తాను ఉద్ధరించుకున్నట్లు!
Review నిన్ను నువు ఉద్దరించుకో.