నువ్వు గెలుస్తావ్‍..

కమలా హారిస్‍ విజయంపై ఢిల్లీలో ఉన్న ఆమె మేనమామ గోపాలన్‍ బాలచంద్రన్‍ ఆనందం వ్యక్తం చేశారు. ‘చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. గెలుస్తావని నిన్ననే చెప్పేశా’ అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అలాగే అమ్మగారి ఊరైన తులసెంథిరపురంలో కమలా హారిస్‍ విజయాన్ని కోరుతూ గ్రామస్తులు అక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అణగారిన వర్గాల ప్రతినిధిగా.
కమలా హారిస్‍కు భర్త డగ్లస్‍ ఎమ్‍హోఫ్‍ అన్నింటా అండదండగా ఉంటున్నారు. డగ్లస్‍ యూదుడు. ఆయన కూడా న్యాయవాదే. వీరిద్దరు 2014లో వివాహం చేసుకున్నారు. తమ వివాహం భారతీయ, యూదు సంప్రదాయాలను అనుసరిస్తూ జరిగిందని కమలా తన ఆత్మకథ పుస్తకంలో రాసుకున్నారు. వివాహం అయ్యే సమయానికే ఆయన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. అప్పటికి ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సవతి పిల్లలనే కమల తన సంతానంగా భావిస్తున్నారు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి ఎన్నికై.. బహుళత్వం మెండుగా ఉండే అమెరికా సమాజంలో అణగారిన వర్గాల ప్రతినిధిగా ఆమె ఒక వెలుగు వెలిగారు.

వాదనా పటిమ.. సంభాషణా చాతుర్యం
కమలా హారిస్‍ ఏ విషయంలోనైనా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతుంటారు. ఆమె వాక్పటిమ, సంభాషణా చాతుర్యం, వాదనా పటిమతో చాలా తక్కువ సమయంలోనే ప్రజాకర్షణ పొందిన జాతీయ స్థాయి నాయకురాలిగా ఎదిగారు. ఆమెరికాలోని నల్లజాతి రాజకీయ నేతల్లో కమల ప్రముఖురాలు. తన భారత్‍ మూలాల పట్ల కూడా ఆమె తరచూ గర్వం వ్యక్తం చేస్తుంటారు. 2020 ఎన్నికల సందర్భంగా రిపబ్లికన్లను, ట్రంప్‍ను చాలా విషయాల్లో కడిగి పారేశారు. ప్రభుత్వ కార్యకలాపాల పాక్షిక ప్రతిష్టంభన (షట్‍డౌన్‍)ను పరిష్కరించకుండా అమెరిన్లను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ తీవ్ర ఇబ్బందుల పాల్జేస్తున్నారని ఆమె నేరుగా విమర్శించారు. రిపబ్లికన్‍ పార్టీకి చెందిన ట్రంప్‍ విధానాలను కమల తీవ్రంగా విమర్శిస్తుంటారు. ఇక న్యాయవాదిగానూ కమలా హారిస్‍ విశేషంగా రాణించిన సందర్భాలు ఉన్నాయి. అబార్షన్‍, 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణ అంశాలపై అమెరికా సుప్రీంకోర్టు అసోసియేట్‍ జస్టిస్‍ బ్రెట్‍ కావనా అభిప్రాయాలకు సంబంధించి కమలా హారిస్‍ ఆయనను బలంగా ప్రశ్నించారు. ఇది డెమొక్రాట్ల దృష్టికి బాగా ఆకర్షించింది. అయితే, తన సహాయకుల్లో ఒకరిపై వచ్చిన లైంగిక ఆరోపణల గురించి తనకు తెలియదని కమల హారిస్‍ గతంలో చెప్పినపుడు ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, ఆ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి 2016లో రాజీనామా చేశారు.

మహిళా ఒబామా..
తొలి ఆఫ్రికన్‍ – అమెరికన్‍ అధ్యక్షుడు బరాక్‍ ఒబామా హయాంలో కమల హారిస్‍ను ‘మహిళా ఒబామా’గా అభివర్ణించే వారు. 2016 సెనేట్‍ ఎన్నికలతో పాటు ఇతర ఎన్నికల్లో కమలకు ఒబామా మద్దతు పలికారు. ఆమెను ఒబామాకు సన్నిహితురాలిగా చెబుతారు. కమలా హారిస్‍ను నల్లజాతి అమెరికన్‍ రాజకీయ నేతగానే అక్కడి వారు చూస్తుంటారు. జాతి విద్వేషానికి వ్యతిరేకంగా ‘బ్లాక్‍ లైవ్‍ మాటర్స్’ ఉద్యమం జోరందుకున్న నేపథ్యంలో ఈ గుర్తింపునకు ప్రాధాన్యత పెరిగింది. మరోవైపు భారతీయ అమెరికన్లు కమలాను తమలో ఒకరిగా చూసుకునే వారు. ఆమె అభ్యర్థిత్వంతో అమెరికాలో ఉంటున్న భారతీయ, దక్షిణాసియా వర్గాలకు మరింత గుర్తింపు వస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆమెరికా వ్యాప్తంగా నల్లజాతి నిరసనలు చెలరేగినపుడు నిగ్రహంతో ఉండాలని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కమలా హారిస్‍ తనతో కలిసి పోటీ చేయడం గర్వకారణమని జో బైడెన్‍ తన ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించే వారు. ‘ఆమె ఎలాంటి బెరుకు లేకుండా పోరాడే యోధురాలు. దేశంలోని అత్యుత్తమ ప్రజా సేవకురాల్లో ఆమె కూడా ఒకరు’ అని ప్రశంసించే వారు. ‘నాతో పాటు పనిచేయడానికి తెలివైన దృఢమైన, నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి కావాలి. కమల అందుకు తగిన వారు’ అని బైడెన్‍ తన ప్రచార ఈ-మెయిల్‍లో పేర్కొన్నారు.

Review నువ్వు గెలుస్తావ్‍...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top