ప్రకృతి సామ్రాజ్యం సామ్యవాదం

సకల జీవులపట్ల ఏకైక సమదృష్టి,
ఇష్టుడు, అయిష్టుడు లేని కమ్యూనిష్టు పరమేష్టి

కొందరి జీవితాలు ఎందుకు నిరంతరం దుర్భరదుఃఖమయమై ఉంటాయని మనకు సందేహం కలుగుతూ ఉంటుంది. ఇది అర్థం కావాలంటే జీవితాన్ని సంపూర్ణంగా, సమగ్ర దృష్టితో చూడాలి. చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి పరిశీలించకూడదు. సరైన సమయంలో (వేసవికాలం) అధికమైన వేడి, చక్కటి తరుణంలో మంచి వర్షాలకు కారణమవుతుంది. అట్లాగే, అధికమైన దుఃఖం, అసలైన సమయంలో సుఖాన్నిస్తుంది. పైకి కనిపించే (తప్పించుకోలేని) అసమానతల వెనక సమనత్వం అంతర్లీనంగా భాసిస్తున్నది. ప్రకృతిలో కమ్యూనిజం ప్రస్ఫుటంగా ప్రకటితమౌతున్నది.
కొన్ని జీవితాలు కాంతులీనుతుంటాయి. కొందరి బ్రతుకుల్లో చీకటి తాండవిస్తుంటుంది. మరికొందరిలో రెండూ సమస్థాయిలో ఉంటాయి. ఎందుకిన్ని భేదాలు?
భూమధ్యరేఖకు సమీపంలో ఉండేవారికి ప్రతిరోజూ పగలూ రాత్రీ దాదాపు సమానంగా ఉంటాయి. అదే ధృవప్రాంత ప్రజలకు ఒక్కోసారి సంవత్సరంలో చాలా భాగం చీకటిగానూ, మిగిలిన భాగం వెలుతురుగానూ ఉంటుంది.
కొన్నిచోట్ల పగటివేళ కంటె, రాత్రి సమయం ఎక్కువ. యూరప్‍లో వేసవిలో రాత్రి పది గంటల దాకా వెలుతురు కనిపిస్తుంది. మనదేశంలో ఆరు లేదా ఏడు గంటలకే సూర్యాస్తమయం అవుతుంది. ఈ తేడాలకు భౌగోళిక పరిస్థితులు కారణం. ఇవి మనం మార్చలేం.
ధృవ ప్రాంతాల్లో విపరీతమైన చలి కదా, అక్కడి వాళ్ళెలా జీవిస్తున్నారు? ఇక్కడే విశ్వస్వామ్యం, కమ్యూనిజం వెల్లివిరుస్తున్నది. చలిని తట్టుకునే సామర్థ్యం వారి శరీరాలకు కల్పించబడింది. అక్కడ ఎలుగుబంట్లు కూడా నివసిస్తున్నాయి, వాటికి కూడా ఆ చలిని తట్టుకునేలా శరీరనిర్మాణం ఉంటుంది. ఎక్కడి జీవులకు అక్కడి జీవనశైలి కరతలామలకమవు తుంది. ప్రతి జీవికీ సుఖదుఃఖాలు సమానంగానే అనుభవమవుతాయి. ఇది ప్రకృతి ప్రథమ సూత్రం. మీకెప్పుడైనా అనుమానాలు కలిగితే, ప్రశ్నలు పుడితే ఒక్కటే గుర్తుచేసుకోండి, సృష్టి మూలసూత్రాన్ని మరచిపోయామని.
అందరికీ రెండే కళ్ళున్నాయి. ఒకటే గుండె ఉంది. చేదు అందరికీ చేదుగానే ఉంటుంది. తీపి ప్రతిఒక్కరికీ తియ్యగానే ఉంటుంది. పుట్టిన ప్రతిజీవికీ చావు తప్పదు (కారణాలెన్నో ఉండవచ్చు.) ప్రపంచ విజేతగా పేరు పొందిన అలెగ్జాండర్‍ మహాచక్రవర్తి మలేరియాతో మరణించాడు. ఒక చిన్నదోమ అంత గొప్ప వ్యక్తిని చంపేసింది. ఇదే ‘విశ్వస్వామ్యం’ కమ్యూ నిజం అంటే ఇదే. వంద రూపాయల నోటు తీసుకోండి. నాలుగు మడతలు పెట్టండి. ఇప్పుడు విలువ తగ్గిందా ? బాగా నలపండి, విలువ మారిందా ? కొత్త నోటయితే చూడ్డానికి బాగుండ వచ్చు. కానీ విలువ మాత్రం ఒక్కటే. జీవితం కూడా అంతే ! వేడుకలోనైనా, వేదనలోనైనా జీవితం విలువ జీవితానిదే!
చెట్లకూ, రాళ్ళకూ సుఖదుఃఖాలు సమంగా ఉంటాయా, లేదా అని మనకో సందేహం. ఆ విషయాలన్నీ మనకు అంతగా అవసరమైనవి కావు. ఒక చెట్టు కింద కూర్చున్నాం. హాయిగా నీడగా ఉంది. పండ్లు కోసుకుతింటాం. అంత వరకు బాగానే ఉంది. అంతేకానీ, చెట్టుకు మనసుందా ? ఉంటే ఏమని భావిస్తుంది ? ఇదంతా అవసరమా ? ఆ వృక్షాన్ని గురించి పూర్తిగా అర్థం చేసుకోలేదని బాధపడాల్సిన పని లేదు. నిజమేమిటంటే, సృష్టి అనుమతించిన మేకు మాత్రమే మనం ప్రకృతిని అర్థం చేసుకో గలం. మనకెంతవరకు ఉపయోగమో, మన కెంత కావాలో అంతవరకే అనుమతించబడు తుంది. అది చాలు. ఇంకేమి కావాలి ?
మట్టికి మనసుందా ? రాయికి హృదయ ముందా ? అని వెతుకుతూ మన సమయాన్ని వృథా చేసుకోనవసరం లేదు. చంద్రమండలానికి వెళ్ళి పరిశోధించడం కంటె, పండు వెన్నెల్లో గుండె విరబూస్తుండగా నిండుగా పండుగ చేసు కోవడమే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. ఆకలి మండుతుంటే ఎదురుగా ఉన్న పళ్ళు దర్జాగా తినాలి. అంతేకానీ, ఎవరు తెచ్చారు? ఎందుకు తెచ్చారు? వీటిలోని పోషక విలువలేమిటి ? అని చర్చించనవసరం లేదు. చంద్రమండలం మీద అడుగుపెట్టడం, అక్కడ విహరించడం గొప్ప విన్యాసం. సుధాకరుని అమృత కిరణధారలో తడిసి, తన్మయం చెందడం అంతే గొప్ప విషయం. మామిడిపళ్ళ మాధుర్యం రుచి చూడటం ముఖ్యమా ? లేక ఆకులు, కొమ్మలు లెక్కించడం ముఖ్యమా ? సూర్యుడి గురించి దీర్ఘోపన్యాసాల కంటే, సౌరశక్తిని సరిగ్గా వాడుకోవడం తెలివైన పని.
ప్రకృతి అనే మహాకావ్యం పఠించడం మొదలుపెట్టండి. అన్ని గ్రంథాలకంటే ఇది అత్యుత్తమ గ్రంథం. ఒక్కోపుట చదువుతుంటే ఒక్కో జవాబు దొరుకుతుంది. ఇక ప్రశ్నలు బాధించవు. నిర్జీవులు సుఖంగా ఉంటున్నాయా అనే విషయం కంటే, ప్రయోజనకరమైన అంశాల పట్ల మన దృష్టి ఉండాలి. చెట్టు, చేమల జీవన విధానం సంగతి మనకెందుకు? అది వృక్షశాస్త్రవేత్తల పని. ఆ వివరాలు వారికి కావాలి. కాబట్టి సేకరిస్తారు. మనం ఒక విత్తనం నాటుతాం. దాన్ని మొక్కగా పెంచుకునేటంత జ్ఞానం మనకు సరిపోతుంది. మన శరీరావ యవాల నిర్మాణం, వాటి పనితీరు మనకు తెలియాల్సిన పనిలేదు. అది తెలుసుకోవడం వైద్యుని ధర్మం. జీర్ణపక్రియలోని పరిజ్ఞానం మనకు లేకున్నా మనం తీసుకునే ఆహారం చక్కగా జీర్ణమవుతోంది. తెలుసుకుంటే మనకు కలిగే లాభమూ లేదు, తెలియకపోతే నష్టమూ లేదు. మన సుఖ సంతోషాలకు ఆటంకం కాదు. మనకేమి ముఖ్యమో వాటిపై శ్రద్ధ చూపుదాం. ప్రకృతి ఏలుబడిలో ఏవి ఎలా
ఉండాలో, అలానే ఉంటాయనే విశ్వాసాన్ని మరింత దృఢపరచు కుందాం. ప్రతి విషయాన్నీ అర్థం చేసుకునే సామర్థ్యం మనకు లేకపోవచ్చు. కానీ అన్నీ అత్యుత్తమమైన రీతిలోనే ఉంటాయని గ్రహించే తెలివి మనకుంటేచాలు.
విశ్వంలోని ప్రతి సంఘటనా ఎంత చిన్నదైనా, ఎంత పెద్దదైనా సరే ముందుగానే నిశ్చయించ బడింది. మన స్వతంత్రత, మన స్వయంకర్త•త్వం నేతిబీరకాయ లోని నెయ్యివంటివే. అంతా విధినిర్ణయమే! అన్నీముందే సంకల్పించబడినాయి!! అన్నీ సక్రమంగా నిర్వహించబడుతున్నాయి. అన్నీ ‘ఆయన’ ఆజ్ఞకులోబడి, అత్యంత సమర్థ వంతంగా పనిచేస్తున్నాయి. పాలనవ్వుల పసిబాల కాలుచేతుల కదలికల నుండి, పాలపుంతల ఘనగోళ భ్రమణ, పరిభ్రమణాల వరకూ, మిల్లీమీటర్‍లోని మిలియన్‍ భాగం ఆంగ్‍స్ట్రామ్‍ యూనిట్‍ నుండి, కోట్ల కాంతి సంవత్సరాల సుదూర స్థలపరిమాణం వరకూ; ఒక క్షణంలోని సూక్ష్మాతిసూక్ష్మమైన కాలకణం ‘ఆట్టోసెకన్‍’ నుండి మహాయుగాలు, మన్వంతరాల కాలప్రమాణం వరకూ, సకలమూ సర్వేశ్వరుడు పూర్వమే ప్రకటించిన ప్రణాళిక ప్రకారం అమలు జరుగుతున్నది. అంతా ప్రామాణికంగా సమతూకంగా సవ్యంగా నిర్వహించబడు తున్నది. మనశరీరంలోని కోటానుకోట్ల కణజాలంలో ప్రతికణకేంద్రకం (డి.యన్‍.ఎ.) లోపల భవిష్యత్తులో మన జీవితాంతం శరీరంలో జరిగే ప్రతిచిన్నమార్పు ముందుగానే, తల్లి గర్భంలోనే రచింప బడింది. అదే విధంగా, మన సంపూర్ణ జీవితచరిత్ర మన పుట్టుకకు పూర్వమే గ్రంథస్థం చేయబడింది. ఇందులో అణు మాత్రమైనా అనుమానంలేదు. ఈ ప్రపంచ చలనచిత్రం ఏనాడో నిర్మించ బడింది. ఆ మహానిర్మాత ఇష్టానికి తగినట్టుగా, ఆ మహాదర్శకుని అభి రుచికి అనుగుణంగా నిర్మితమైంది. ఇప్పుడు కేవలం ప్రదర్శన జరుగు తున్నది. ఎటువంటి మార్పులకీ, చేర్పులకీ అవకాశంలేదు. మహాత్ములందరూ ఈ ‘మహాసత్యం’ గ్రహించారు. అన్నీ సంతోషంగా అంగీకరించారు. ఆనందంగా భరించారు. ఇదంతా ‘ఆయన’ అనుగ్రహం. ముందుగా వండి, సిద్ధం చేసిన మహాప్రసాదం.
అయితే, జరిగేదంతా మనమంచికే కాబట్టి, జరిపించేదంతా ‘ఆయనే’ కాబట్టి, మనం దేనికీ బాధ్యులం కాదనే భావాన్ని ఆసరాగా తీసుకుని, అంతరాత్మ హెచ్చరికలు పెడచెవిన పెట్టి, తర్కంతో, వాదంతో మనల్ని మనం సమ ర్థించుకుంటూ చేయకూడని పనులు చేయరాదు. మనసు మాయాజాలానికి చిక్కకుండా అంతరాత్మ హెచ్చరికలు బహుజాగ్రత్తగా పాటించాలి.
‘విశ్వాస రహస్యం’ తెలిసిన ఎదలో ‘విశ్వ రహస్యం’ నదులుగా ప్రవహిస్తుంది. విశ్వేశ్వరునికి విదేయులమై ఉన్నప్పుడే, ఆయనను ఆజ్ఞాపించే అర్హత లభిస్తుంది. అన్ని సమస్యలకూ భగ వంతుని పట్ల సంపూర్ణమైన విశ్వాసమే పరిష్కారం. విశ్వనాథుని విశ్వసించు. వేచి
ఉండు. వెలుగంతా నీదే!

Review ప్రకృతి సామ్రాజ్యం సామ్యవాదం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top