కావాల్సినవి: క్యాలీఫ్లవర్ ముక్కలు – 2 కప్పులు, ట్రెడ్ క్రంట్స్ పొడి – 2 కప్పులు, గుడ్లు – 2, కొత్తిమీర – టేబుల్ స్పూన్ (చాలా సన్నగా తరగాలి), బ్యాంగ్ బ్యాంగ్ సాస్ లేదా టమాటా సాస్ – టేబుల్ స్పూన్ (తగినంత), స్వీట్ చిల్లీ సాస్ – 2 టేబుల్ స్పూన్లు, మయోనైజ్ – అరకప్పు, తేనె – టేబుల్ స్పూన్.
తయారు చేసే విధానం:- మూకుడులో నూనె వేసి కాగనివ్వాలి. ఒక గిన్నెలో గుడ్లు వేసి గిలకొట్టాలి. దీంట్లో ఒక్కో క్యాలీఫ్లవర్ ముక్క ముంచి, ఆ తర్వాత బ్రెడ్ పొడిలో అటూ ఇటూ రోల్ చేసి కాగుతున్న నూనెలో వేసి, బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. వీటిని తీసి పేపర్ టవల్ మీద వేయాలి. ఇలా చేయడం వల్ల అదనపు నూనెను పేపర్ పీల్చుకుంటుంది. క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ ఇలా వేయించుకున్నాక, బ్యాంగ్ బ్యాంగ్ టమాటా సాస్ వేసి కలపాలి.
– ఒక గిన్నెలో మాయోనైజ్, మిగతా సాస్‍లు పాలకూర తరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కూడా క్యాలీఫ్లవర్ ముక్కలలో వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి
Review బ్యాంగ్ బ్యాంగ్ క్యాలీఫ్లవర్.