రక్షా ఆధ్వర్యంలో ప్రకృతి నృత్య ప్రదర్శన

సమాజంలో ఆధ్యాత్మికత, కళలు,సంస్కృతి, సంప్రదాయాలకు ప్రజలు పెద్దపీట వేస్తున్నారు. అటు పాశ్చాత్య దేశాల్లోనూ ఆధ్యాత్మికత వెల్లివిరిస్తోంది. ముఖ్యంగా భారతావణిలో ఉన్న కళలు ఏ దేశంలో లేవనే చెప్పాలి. కూచిపూడి, భరతనాట్యం తదితర న•త్యాలు మనదేశం నుంచి వచ్చినవే. అమెరికాలోని దీక్ష స్కూల్‍ అనే సంస్థ తనవంతు సహకారంగా బాధిత మహిళలను ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సంస్థ ఆడవాళ్లపై దాడులు జరిగితే స్పందిస్తూ వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతుంది. అంతేకాదు ఈ స్వచ్చంద సంస్థ పలు న•త్యాలను ప్రదర్శించి తద్వారా వచ్చే ఆదాయాన్ని రక్ష అనే నాన్‍ ప్రాఫిట్‍ ఆర్గనైజేషన్‍కి అందజేస్తుంది. ఈమేరకు జార్జియాలోని మరియెట్టా, కెఎస్‍యు డాన్స్ ధియేటర్‍లో న•త్య, నాట్య అనేవాటిపై సమకాలీన న•త్య ప్రదర్శణలు చేశారు. న•త్యలో భాగంగా ఓం, తోడాయమంగళం, నాగేంద్రహరాయ, అల్లారిపు, జటిస్వరమ్‍, థిల్లానా, అయిగిరినందిని, నిత్యస్వర, శివతాండవ స్తోత్రం, జయ గంగే, బ్రహ్మ న•త్యం, ఆదిత్యన•త్యాలు చేశారు. నాట్యలో భాగంగా టాగూర్‍ చందాళికాను హిందీలో న•త్యం చేశారు. దీనికి ఉషా గంగూలి దర్శకత్వం వహించారు. దీంతోపాటు డెస్టినీ యునైటెడ్‍ అస్‍, క్వశ్చనింగ్‍ డెస్టినీ, వాటర్‍ ఫర్‍ ది ప్రివిలైజ్‍డ్‍, మై లవ్‍ ఫర్‍ యు ఈజ్‍ ఎండ్‍లెస్‍, ది కమింగ్‍ ఆఫ్‍ స్ప్రింగ్‍, ది సాల్వ్ అండ్‍ ది అన్‍టచబుల్‍, ది రాయల్‍ సమ్మన్స్, ది బర్డ్ యాజ్‍ ఫ్లోన్‍, అనాటేయినబుల్‍, సాల్వేషన్‍లపై న •త్యాలు చేశారు. మరోవైపు దర్శకురాలు ఉషా గంగూలిని శంకర్‍ సేన్‍గుప్త సత్కరించారు

Review రక్షా ఆధ్వర్యంలో ప్రకృతి నృత్య ప్రదర్శన.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top