వచ్చే ఏడాది లాటరీ పద్ధతి లో వీసాలు

వచ్చే ఏడాది లాటరీ పద్ధతిలో వీసాలు
అమెరికా వెళ్లేందుకు హెచ్‍ 1బీ వీసాలు వచ్చే ఏడాది వరకు లాటరీ పద్ధతిలోనే కొనసాగనున్నాయి. ఈ విధానాన్ని సవాల్‍ చేస్తూ దాఖలైన పిటిషన్‍ను ఆ దేశ న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో ఏప్రిల్‍ 3 నుంచి ప్రారంభమయ్యే 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్‍-1బీ వీసాల జారీలో ఎలాంటి మార్పు లేదు. దీంతో లాటరీలో ఎంపికైన వాళ్లకి అమెరికా పౌరసత్వ వలస సేవల విభాగం గుర్తింపును ఇవ్వనుంది. ఇండియా నుంచి ఐటీ వృత్తి నిపుణులు ఎక్కువగా ఆసక్తి చూపించే వీసాలివే. సాధారణ విభాగంలో 45 వేల మందికి, స్టూడెంట్స్ 20 వేల మందికి వీసాలు జారీ చేయాలనేది ఈ విభాగం లక్ష్యం. అమెరికా చట్టసభ కాంగ్రెస్‍ నిర్ణయం ప్రకారం ఏటా 65 వేల హెచ్‍ 1బీ వీసా లకు అనుమతిస్తారు. అయితే దరఖాస్తులు రెట్టింపు రావడంతో లాటరీ పద్ధతిని అనుసరిస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ రెండు అమెరికన్‍ కంపెనీలు కేసు వేశాయి. లాటరీ కన్నా మెరుగైన పద్ధతిని పిటిషన్లు సూచించలేకపోవడంతో కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి
ప్రకటించారు

Review వచ్చే ఏడాది లాటరీ పద్ధతి లో వీసాలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top